ఆయుర్వేదంతో మైగ్రేన్ తగ్గించొచ్చు

తలనొప్పులందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.. మనకు వచ్చే సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌ నొప్పి చాలా ఉంటుంది. సాధారణ తలనొప్పి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ, మైగ్రేన్ అలా కాదు.. ఇది తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో చిరాకు కలుగుతుంది. అందుకే ట్రీట్‌మెంట్ తీసుకుంటే కానీ ఇది తగ్గదు. మైగ్రేన్‌.. మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి.  కానీ, చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో  చాలా మంది ఈ డిసీజ్‌తో బాధపడుతున్నారు. మైగ్రేన్‌ తలలో ఒక […]

Share:

తలనొప్పులందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.. మనకు వచ్చే సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌ నొప్పి చాలా ఉంటుంది. సాధారణ తలనొప్పి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ, మైగ్రేన్ అలా కాదు.. ఇది తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో చిరాకు కలుగుతుంది. అందుకే ట్రీట్‌మెంట్ తీసుకుంటే కానీ ఇది తగ్గదు.

మైగ్రేన్‌.. మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి.  కానీ, చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో  చాలా మంది ఈ డిసీజ్‌తో బాధపడుతున్నారు. మైగ్రేన్‌ తలలో ఒక వైపు మాత్రమే వస్తుంది. కొన్ని సార్లు రెండు వైపులా రావొచ్చు. వచ్చినప్పుడు మాత్రం తలలో సూదులు గచ్చుతున్నట్లుగా ఉంటుంది. మాడుపై సమ్మెటతో బాదుతున్నట్లు, రక్తనాళాలు చిట్లపోతున్నట్లుగా మైగ్రేన్‌ మనిషిని బాధిస్తుంటుంది. ప్రత్యేక్ష నరకాన్ని చూపిస్తుంది. తలలో ఒవైపు నరాలు కుచించుకుపోవడంతో మైగ్రేన్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది. దీనిలో మళ్లీ కామన్ మైగ్రేన్ అని, క్లాసిక్ మైగ్రేన్ అని రెండు రకాలు ఉన్నాయి. 

తరుచూ మానసిక ఒత్తిడికి లోనై వారిలోనూ, మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ బాధలు కొంత మందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరి కొంత మందిలో కొన్ని రోజులదాకా కూడా ఉంటుంది. కామన్ మైగ్రేన్లో జనరల్‌ తలనొప్పి రావడంతో పాటు వాంతులు కూడా వస్తాయి. ఈ రకమైన తలనొప్పి మందులు వాడకుండా తగ్గిపోవచ్చు. కొన్నికొన్నిసార్లు దీనికి మందులు వాడాల్సి ఉంటుంది. 

క్లాసిక్ మైగ్రేన్‌లో తలనొప్పి అనేది ఒకవైపు మాత్రమే వస్తుంది. ఆ తర్వాత అది మరోవైపునకు వ్యాపిస్తుంది. అంతేకాకుండా కాళ్లకు, చేతులకు కూడా తిమ్మిరిలాగా మైగ్రేన్ వ్యాపించే అవకాశం ఉంది.  ఇది ఎక్కువగా ఉంటే కళ్లు బర్ల్ గా కనిపిస్తాయి. ఈ మైగ్రేన్ ఒకసారి వచ్చిందంటే వాళ్లు తప్పకుండా వాంతులు అవుతూ ఉంటాయి. ఈ క్లాసిక్ మైగ్రేన్ వస్తే తప్పకుండా మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. 

కామన్ మైగ్రేన్లో ఒక్కోసారి సింప్టట్స్ కనపడకపోవచ్చు… కానీ, క్లాసిక్ మైగ్రేన్‌ వచ్చేటప్పుడు మాత్రం కచ్చితంగా లక్షణాలు కనపడతాయి. కొంతమందికి ప్రత్యేకమైన స్మెల్ రావడం, తలలో ఓవైపు లాగుతున్నట్లు అనిపించడం, కళ్లు బర్లగా మారి, ముందు ఎదో ఒక వస్తున్నట్లు  ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన తలనొప్పి వచ్చే ముందు గంట నుంచి 20 నిమిషాల ముందు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పుకుండా క్లాసిక్ మైగ్రేన్ వస్తున్నట్లు గుర్తించాలి. 

అయితే, ఈ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎలాంటి నివారణ ఉందో ఓసారి చూద్దాం…

మైగ్రేన్ తలనొప్పిని తలగ్గించడంలో సహాయపడే కొన్ని ఆయుర్వేద నివారణలను ఆయుర్వేద, గట్‌ హెల్త్ కోచ్ డాక్టర్ డింపుల్ జంగ్దా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నారు. 

శిరోలెపా: 

శిరోలెపా అనేది.. మైగ్రేన్లు, ఒత్తిడి కారణంగా ఏర్పడే మానసిక అలసటనను నయ చేస్తుది. ఇది ఒక టెక్నిక్. దీనిలో కొన్ని మూలికలను కలిపి పేస్ట్ లుగా తయారు చేస్తారు. ఆ పేస్ట్‌ను తలపై ఉంచి, అరటి ఆకుతో గంటసేపు కప్పి ఉంచుతారు. 

శిరోధార: 

మన నాడులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న నుదుటిపై, వెచ్చని నూనెను నిరంతరం ధారగా పోయాలి. అలా నిరంతరం పోసినప్పుడు ఆ నూనె పీడనం నుదిటిపై కంపనాన్ని సృష్టిస్తుంది. ఇది మన మనస్సు, నాడీ వ్యవస్థకు మానసిక విశ్రాంతిని ఇస్తుంది. 

కవల గ్రహ:

కవల గ్రహ ప్రభావం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్ ను నయం చేసేందుకు చందనాడి తైలా, మహా నారాయణి తైలాలతో ఆయిల్ పుల్లింగ్ చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. 

స్నేహ బస్తీ: 

ఈ చికిత్స నాసికా మార్గం ద్వారా చేస్తారు. షిద్బిందు తైలా లేదా అను తైలా వంటి నూనెలను చుక్కుల మాదిరిగా ముక్కులో వేయాలి. అలాగే, భుజం నొప్పి చికిత్సలో కూడా ఈ తైలం పనిచేస్తుంది. 

‘‘కనబొమ్మపై నొప్పి రావడం, ఎండలో ఎక్కువసేపు ఉంటే తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు మైగ్రేన్‌ గా గుర్తించవచ్చు. ఈ నొప్పి తరచుగా వస్తుంది. ఒక్కోసారి తీవ్రంగా కూడా ఉంటుంది. తలలో మొదలై భుజానికి కూడా ఇది వ్యాపిస్తుంది. తలనొప్పికూడా రెండు నుంచి మూడు గంటల వరకు ఉంటుంది. అయితే, నొప్పి రెండు నుంచి మూడ్రోజుల పాటు కొనసాగితే, డాక్టర్ల సాయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని డాక్టర్ డింపుల్ పేర్కొన్నారు.