ఒత్తిడిని దూరం చేసే చిట్కాలు

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం […]

Share:

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం ఒత్తిడి నుంచి బయట పడే అవకాశం ఉంది, అవేంటో ఈరోజు తెలుసుకుందాం.. 

ప్రతిరోజు డైరీ రాసుకోండి: 

మీరు రోజు వారు చేయాలనుకునే కొన్ని విషయాలను ఈరోజు మొదలవుతుంది అనిపించుకుని ఒత్తిడి తగ్గించేందుకు, రోజు స్టార్ట్ చేసే ముందు డైరీలో కొన్ని మంచి విషయాలు రాసుకోండి. ముఖ్యంగా మీ ఆనందాన్ని పెంపొందించే అంసాలను డైరీలో ఉండేలా చూసుకోండి. డైరీ రాయడం ఒక మంచి పద్ధతి. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా సరే డైరీ రాసే అలవాటు చేసుకోవచ్చు. మన గురించి మనకి మరింత బాగా తెలుసుకునేందుకు కూడా ఈ డైరీ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గించే ప్రక్రియలో డైరీ కూడా భాగంగా మారుతుంది. 

ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొనండి: 

రోజువారి అనవసరమైన సమయాలలో అనవసరమైన విషయాలను ఆలోచించడం ద్వారా మరింత ఒత్తిడి దగ్గర అవకాశం ఎంతో ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాలను మరింత దగ్గర చేసే సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా, తమకు నచ్చిన ఆర్ట్ లో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల అనవసరమైన ఒత్తిడికి దూరం అవుతాము. పాటలు పాడడం, డ్రాయింగ్ వేయడం, నచ్చిన గేమ్స్ ఆడడం ఇలాంటి విషయాలలో మనం మనకి నచ్చిన కాంపిటీషన్లో పాల్గొనడం, ప్రతిరోజు కొంత సమయాన్ని ఆర్ట్ కోసం సద్వినియోగం చేసుకోవడం, ఒత్తిడికి దూరమయ్యే ప్రక్రియలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఎక్సర్సైజ్-యోగ: 

మనిషి జీవితంలో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగంగా అయిపోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల ఎక్ససైజ్ శరీరానికి ఎంతో మంచిది. వాకింగ్ చేయడం, ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్లడం, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం. ఇవన్నీ మనం రోజు ఒక అరగంట కనీసం చేయగలిగితే, మనకి తెలియకుండా మనలో ఉండే ఒత్తిడి బయటికి వెళ్లిపోతుంది. మళ్లీ ఉత్సాహంగా మన పనులను మనం ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతాము. 

బంధాలను ఏర్పరచుకోండి: 

ఒత్తిడికి ముఖ్యమైన కారణం బంధాలకు దూరం అవడం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న జీవన శైలిలో చాలా మంది ఒంటరిగా ఉండడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మొదటిలో ఈ ఒంటరితనం అనందాన్ని అందించినప్పటికీ, పోను పోను ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి రోజు ఇంట్లో వారితో లేదంటే స్నేహితులతో కొంత సమయం గడపడం ఎంతో ఉత్తమం. బంధాలు బాధలను అదేవిధంగా ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడతాయి.

మంచి అలవాట్లు: 

అలవాట్లు మనిషి జీవితాన్ని మారుస్తాయి అనడంలో సందేహమే లేదు. మన రోజువారి జీవన శైలిలో మనకి నచ్చిన అలవాట్లు అలవర్చుకోవడం వల్ల, మనిషి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైన క్షణాలకు దూరమచ్చు. ముఖ్యంగా, ఒత్తిడిని దూరం చేసే అలవాట్లు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు అవసరమైన విషయాలు గుర్తు చేసుకోకుండా కొన్ని అలవాట్లను ఈ రోజే మొదలు పెట్టండి. బుక్స్ చదవడం, రీసెర్చ్ చేయడం, కథలు రాయడం, ఇలాంటివి చేయడం వల్ల అనవసరమైన ఆలోచనలను కలిగించే ఒత్తిడికు దూరంగా ఉండొచ్చు.