నిందించకుండా ఇలా మీ ఫీలింగ్స్ చెప్పండి

కమ్యూనికేషన్… కమ్యూనికేషన్. ఏ బంధం అయినా బలపడాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చాలా అవసరం. మనకు ఫీలింగ్స్ షేర్ చేసుకునే విష‌యంలో సరైన కమ్యూనికేషన్ గనుక లేకపోతే మనకు అవతలి వారితో స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడదు. తరచూ మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా ఏదో ఒక అపోహ రాకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అందుకోసమే అందరూ కమ్యూనికేషన్ మీద గ్రిప్ పెంచుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పినా […]

Share:

కమ్యూనికేషన్… కమ్యూనికేషన్. ఏ బంధం అయినా బలపడాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చాలా అవసరం. మనకు ఫీలింగ్స్ షేర్ చేసుకునే విష‌యంలో సరైన కమ్యూనికేషన్ గనుక లేకపోతే మనకు అవతలి వారితో స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడదు. తరచూ మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా ఏదో ఒక అపోహ రాకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అందుకోసమే అందరూ కమ్యూనికేషన్ మీద గ్రిప్ పెంచుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పినా కానీ అవతలివారికి సరిగ్గా రీచ్ కాదు. అందుకోసమే చెప్పే విషయంతో పాటు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. 

ఆలుమగల మధ్య చాలా అవసరం

ఈ కమ్యూనికేషన్ అనేది మన జీవిత భాగస్వామితో చాలా అవసరం. అది ఫీమేల్ అయినా కానీ మేల్ అయినా కానీ మంచి కమ్యూనికేషన్ ఉంటే ఆ జంట చాలా హ్యాపీగా ఉంటుంది. కమ్యూనికేషన్ సరిగ్గా లేని జంటకు ఎప్పుడు ఏవో రకమైన చిక్కులు వస్తుంటాయి. వారు ఎల్లప్పుడూ వాటితోనే సతమతం అవుతూ ఉంటారు. అందుకోసమే కమ్యూనికేషన్ ను స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకోవాలని అనేక మంది సూచిస్తుంటారు. మనం మన అనుకునే వారికి ఏదైనా విషయం చెప్పాలని అనుకుంటున్నపుడు దానిని ఎలా చెప్పామనే విషయం కూడా కాలిక్యులేట్ అవుతుంది. విషయం ఎంత గొప్పదైనా కానీ సరైన విధంగా కమ్యూనికేషన్ కనుక లేకపోతే మనం వారికి ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయలేం. అదే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఎంతటి చిన్న విషయాన్ని అయినా కానీ మనం అనుకున్నరీతిలో ప్రజెంట్ చేసేందుకు వీలు పడుతుంది. అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం అని చెబుతారు. మన జీవిత భాగస్వామితో ఏదేని విషయం గురించి డిస్కస్ చేసేటపుడు లేదా ఏదైనా కొత్త విషయాన్ని వారికి కన్వే చేయాలని అనుకున్నపుడు కొన్ని సార్లు మనకు మొహమాటం అడ్డు వస్తుంది. అరే ఈవిషయం చెబితే వారు బాధపడతారేమో అని మనకు అనిపిస్తుంటుంది. అటువంటి సమయంలో ఈ కింది సింపుల్ ట్రిక్ ద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని వారి మనసు నొప్పించకుండా కన్వే చేసేందుకు వీలుపడుతుంది. ఆ చిట్కాలేంటో ఓ సారి లుక్కేస్తే..  

ఈ కింది కొన్ని చిట్కాలను ఉపయోగించడం ద్వారా మనకు కావాల్సిన వారి మనసు నొప్పించకుండానే మనం అనుకున్నది వారికి చెప్పే వీలుంటుంది. 

దెప్పి పొడవకండి

మనం ఏదైనా విషయాన్ని మార్చుకోమని మన జీవిత భాగస్వామి లేదా మనకు దగ్గరి వారికి చెప్పాలని అనుకున్నపుడు వారు తప్పు చేసినట్లు పదే పదే దెప్పి పొడవడం చేయకూడదు. చాలా సింపుల్ గా వారికి అర్థం అయ్యేలా మ్యాటర్ ను ముగించాలి. అంతే కానీ మీరు తప్పు చేశారని పదే పదే అనడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా చెప్పడం వల్ల వారు మారే అవకాశం కూడా ఉండదు. అందుకోసమే ఇలా చెప్పడం అంతగా ప్రయోజనం కలిగించదు. ఈ నిర్ణయాన్ని మానుకోవడం ఉత్తమం. అంతే కాకుండా వారిని పాయింట్ అవుట్ చేయడం వల్ల వారు హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రమాదాలను నివారించేందుకు వారిని పాయింట్ అవుట్ చేయకపోవడమే ఉత్తమం. 

నేను అనే భావన కలిగించండి… 

సాధారణంగా మాట్లాడే బదులు, మన స్వంత భావాలు మరియు పర్ స్పెక్టివ్ ల మీద కాన్సంట్రేట్ చేయండి. ఇలా చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా మారే అవకాశం ఉంటుంది. కామన్ గా చెబితే వారు మరింత లైట్ తీసుకోవచ్చు. అందుకోసం ఇలా ట్రై చేయండి. మీరు తప్పకుండా మీరు చెప్పాలని అనుకున్న విషయాన్ని వారికి కన్వే చేస్తారు. 

మీ బంధం చెడిపోకుండా చూసుకోండి

మనం ఎవరో బయటి వారికి విషయం చెప్పడం లేదు. మన సొంత వారికే విషయాలను చెబుతున్నాం కాబట్టి ఏ మాత్రం బెడిసికొట్టినా మన బంధం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఏదైనా విషయాన్ని గురించి చెప్పే ముందు అది మన బంధాన్ని ఏమైనా దెబ్బతీస్తుందా?  అనే విషయం గురించి ఆలోచించడం చాలా అవసరం. ఇలా ఆలోచించకుండా ఇష్టారీతిన విషయాలను కన్వే చేయాలని అనుకుంటే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. విషయం చెప్పేటపుడు మనం ఎమోషనల్ అవకుండా చాలా జాగ్రత్తగా మనం చెప్పాలనుకున్న దాన్ని కన్వే చేయడం చాలా అవసరం. ఏ మాత్రం ఎమోషనల్ అయి సిట్యుయేషన్ స్పాయిల్ చేసినా కానీ ఎదుటి వారికి మనం చెప్పాలని అనుకున్న మ్యాటర్ రీచ్ కాదు. దాని వల్ల మనకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.