నడకతో ఒత్తిడిని తగ్గించుకోండి 

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం […]

Share:

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం ఒత్తిడి నుంచి బయట పడే అవకాశం ఉంది, అవేంటో ఈరోజు తెలుసుకుందాం.. 

నడవండి: 

ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కేవలం మనం రోజులో వేసే అడుగులు మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుతుంది. అయితే రోజుకి మనం ఎన్ని అడుగులు వేయాలి? ఎంత నడక నడవాలి అనే దాని గురించి, హార్వర్డ్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న బ్రిగ్‌హామ్ మరియు ఉమెన్స్ హాస్పిటల్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, అదేవిధంగా JAMA ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌ ప్రకారం మనం రోజుకి 4,400 అడుగుల నడక నడవాలట. ఇలా మన రోజు పూర్తయినట్లయితే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నట్టు. ఎందుకంటే మన నడకకి మన ఒత్తిడికి మధ్య ముఖ్యమైన లింక్ ఉంటుంది. ప్రతిరోజు నడవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. మంచి రిలాక్సేషన్ అనేది శరీరానికి దొరుకుతుంది. నడవడం అనేది స్ట్రెస్ తగ్గించడమే కాకుండా మంచి నిద్రకి తోహదపడుతుంది.

ఎక్సర్సైజ్-యోగ: 

మనిషి జీవితంలో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగంగా అయిపోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల ఎక్ససైజ్ శరీరానికి ఎంతో మంచిది. వాకింగ్ చేయడం, ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్లడం, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం. ఇవన్నీ మనం రోజు ఒక అరగంట కనీసం చేయగలిగితే, మనకి తెలియకుండా మనలో ఉండే ఒత్తిడి బయటికి వెళ్లిపోతుంది. మళ్లీ ఉత్సాహంగా మన పనులను మనం ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతాము. 

మంచి అలవాట్లు: 

అలవాట్లు మనిషి జీవితాన్ని మారుస్తాయి అనడంలో సందేహమే లేదు. మన రోజువారి జీవన శైలిలో మనకి నచ్చిన అలవాట్లు అలవర్చుకోవడం వల్ల, మనిషి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైన క్షణాలకు దూరమచ్చు. ముఖ్యంగా, ఒత్తిడిని దూరం చేసే అలవాట్లు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు అవసరమైన విషయాలు గుర్తు చేసుకోకుండా కొన్ని అలవాట్లను ఈ రోజే మొదలు పెట్టండి. బుక్స్ చదవడం, రీసెర్చ్ చేయడం, కథలు రాయడం, ఇలాంటివి చేయడం వల్ల అనవసరమైన ఆలోచనలను కలిగించే ఒత్తిడికు దూరంగా ఉండొచ్చు. 

ఉదయాన్నే లేవడం: 

‘ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్’ అని చిన్నతనంలో మనం నేర్చుకున్న పాఠాలు నిజానికి సగటు మనిషికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉదయాన్నే లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి చక్కగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం అనేది, మనం రోజువారి చేసే పని మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది.  చిన్న పని కూడా హడావిడిగా చేయాల్సిన అవసరం ఉండదు. మన ప్రణాళిక ప్రకారమే పనులు పూర్తవుతాయి. దీనివల్ల రోజంతా ఎంతో హాయిగా, ఒత్తిడి లేకుండా, సాఫీగా, మనశ్శాంతిగా ఉండొచ్చు. అందుకే ఉదయాన్నే లేవడం ఒక అలవాటుగా మార్చుకుంటే మన జీవన శైలి కూడా చాలా చక్కగా మారుతుంది.

నిజానికి జీవితంలో ఏదీ ఊరికే రాదు, అది ఆరోగ్యమైన సరే. కాబట్టి బద్దకాన్ని పక్కనపెట్టి, మన ఒత్తిడిని తగ్గించేందుకు కనీసం మన రోజు వారి నడక గురించి ప్రణాళిక వేయడం మొదలు పెట్టాలి. నడవడం అనేది మన శరీర ఒత్తిడిని తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొంత దూరం నడవడానికి ప్రయత్నించాలి. అలా రోజు చేసే ప్రయత్నమే కొద్ది రోజుల్లోనే 4,400 అడుగులు ప్రతిరోజు వేయడానికి సహాయపడుతుంది.