రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం

మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే జలుబు, రొంప, దగ్గు, కళ్ళు కలకలు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవడం జరుగుతుంది. మరి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా పోషకాలతో నిండి ఉండే, రోగనిరోధక శక్తి పెంచే రకరకాల విటమిన్లు తమ […]

Share:

మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే జలుబు, రొంప, దగ్గు, కళ్ళు కలకలు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవడం జరుగుతుంది. మరి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా పోషకాలతో నిండి ఉండే, రోగనిరోధక శక్తి పెంచే రకరకాల విటమిన్లు తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎంతో లాభం ఉండటమే కాకుండా అనారోగ్యానికి దూరంగా ఉంటాం. అలాంటి కొన్ని విటమిన్ల గురించి ఇప్పుడు చూసేద్దాం. 

విటమిన్ D: 

విటమిన్ డి మీ శారీరిక ఆరోగ్యానికి  కోసం చాలా ముఖ్యమైనది. కండరాల కణాల పెరుగుదలకు, మీ రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరుకు మరియు మీ ఎముకల బలానికి విటమిన్ డి అవసరమని అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల ఎంతో నష్టం వాటిల్లే అవకాశం. విటమిన్ డి లోపం పెరుగుతున్న నేపథ్యంలో, మళ్లీ విటమిన్ డి మన శరీరంలో సాధారణ స్థాయికి చేరుకోవడానికి సప్లిమెంట్లను తీసుకుంటారు. అయినప్పటికీ, విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరం అని కొంతమందికి తెలియదు. విటమిన్ డి ఎక్కువ మోతాదులో శరీరానికి అందాలంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎండలో ఒక పావుగంట సమయమైనా ఉండాల్సి ఉంటుంది, చేప కూడా మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ డి ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. 

విటమిన్ K: 

విటమిన్ K తక్కువగా ఉన్న వ్యక్తులు ఊపిరితిత్తుల పనితీరులో లోపాలు కనిపిస్తున్నాయని కొన్ని రీసర్చ్ల ప్రకారం తెలిసింది. విటమిన్ కే లోపం కారణంగా, రోగనిరోధక శక్తి కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా విటమిన్ కె లోపం ఉన్నవారు ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అంతేకాకుండా గురకతో బాధపడుతున్నారని తేలింది.

విటమిన్ కె ఆకు కూరలు, కూరగాయల నూనెలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో పాత్ర పోషిస్తుంది. శరీరానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యంలో దాని పాత్ర గురించి ఈ మధ్యకాలంలోనే రీసర్చ్ ల ద్వారా బయటపడింది.

విటమిన్ k ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు: 

బచ్చలికూర 

1 కప్పు: 145 mcg (121% DV)

100 గ్రాములు: 483 mcg (DVలో 402%)

బ్రోకలీ (వండినది) 

1/2 కప్పు: 110 mcg (DVలో 92%)

100 గ్రాములు: 141 mcg (118% DV)

గుడ్డు, మాంసం, కాలేయం

1 స్లైస్: 72 mcg (DVలో 60%)

100 గ్రాములు: 106 mcg (DVలో 88%)

 చికెన్ 

3 ఔన్సులు: 51 mcg (DVలో 43%)

100 గ్రాములు: 60 mcg (DVలో 50%)

విటమిన్ A: 

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది, ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి పనిచేస్తుంది. ఇది రోగనిరోధక కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా మీ శ్వాసకోశ యొక్క సమగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. క్యారెట్లు, చిలగడదుంపలు మరియు బచ్చలికూర వంటి ఆహారాలు విటమిన్ ఎ యొక్క అద్భుతమైన మూలాలు. 

ప్రత్యేకించి ఏ సీజన్లో పండిన కూరగాయలు ఆ సీజన్లో తీసుకోవడం ద్వారా వాటి పోషకాలు శరీరానికి వంటపడతాయి. విటమిన్ C, సెలీనియం, విటమిన్ ఈ, జింక్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం.