ఆరోగ్యాన్ని అందించే విటమిన్ P

విటమిన్ల లోపం కారణంగా ప్రతి ఒక్కరిలోని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మారుతున్నాయి. అయితే ఆరోగ్యాన్ని అందించే విటమిన్ P నిజానికి ఇది విటమిన్ల పరిధిలోకి రాదు. ఇది ఒక ఆంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫైటో న్యుట్రియన్స్ విభాగంలోకి వస్తుంది. ముఖ్యంగా ఎన్నో ఆరోగ్య అవసరాలు తీర్చే విటమిన్ P, ముఖ్యంగా ఎన్నో ఆహార పదార్థాలలో లభిస్తూ ఉంటుంది. మరి ఈ విటమిన్ అందించే ఆరోగ్య విశేషాలు.. అదే విధంగా ఏ ఆహార పదార్థాలలో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..  […]

Share:

విటమిన్ల లోపం కారణంగా ప్రతి ఒక్కరిలోని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మారుతున్నాయి. అయితే ఆరోగ్యాన్ని అందించే విటమిన్ P నిజానికి ఇది విటమిన్ల పరిధిలోకి రాదు. ఇది ఒక ఆంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫైటో న్యుట్రియన్స్ విభాగంలోకి వస్తుంది. ముఖ్యంగా ఎన్నో ఆరోగ్య అవసరాలు తీర్చే విటమిన్ P, ముఖ్యంగా ఎన్నో ఆహార పదార్థాలలో లభిస్తూ ఉంటుంది. మరి ఈ విటమిన్ అందించే ఆరోగ్య విశేషాలు.. అదే విధంగా ఏ ఆహార పదార్థాలలో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుండె పదిలం: 

విటమిన్ P ఉండే ఆహార పదార్థాలు కారణంగా, శరీరంలో ఉండే బ్లడ్ వెస్సెల్స్ పనితీరు మెరుగు పడుతుంది. బ్లడ్ వెస్సెల్స్ లో ఈజీగా బ్లడ్ ఫ్లో ఉండడం కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా ఉంటాము. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: 

విటమిన్ P మన శరీరంలో ఉండడం కారణంగా, హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయడంలో ఈ విటమిన్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ సహాయపడుతుంది. దీనికి కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. 

అలర్జీలకు దూరం: 

విటమిన్ P ముఖ్యంగా ఆహార పదార్థాలలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా శర్మానికి హాని కలిగించే అలర్జీలకు దూరంగా ఉండేలా చూస్తుంది. 

మెరుగైన కంటి చూపు, చురుకైన మెదడు: 

విటమిన్ P ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యంగా తీసుకోవడం ద్వారా ఆహార పదార్థాలలో ఉండే పోషకాల వల్ల, మీ కంటి చూపు మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా విటమిన్ P ఎంతగానో ఉపయోగపడుతుంది. 

క్యాన్సర్ భారీ నుంచి తప్పిస్తుంది: 

విటమిన్ P ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యంగా బయోఫ్లేవనాయిడ్‌లు, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రొమ్ము, ఊపిరితిత్తులు మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

విటమిన్ P ఉండే ఆహార పదార్థాలు: 

ఆరోగ్యాన్ని అందించే పండ్లు: నారింజలు, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, ఇంకా సిట్రస్ లభించే పండ్లలో ఫ్లేవనాయిడ్లు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే హెస్పెరిడిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్: 70%, అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్‌ ఉండే డార్క్ చాక్లెట్‌లో క్యాటెచిన్స్, అదేవిధంగా ప్రోసైనిడిన్స్ వంటి ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.

బెర్రీలు: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు వంటి బెర్రీ పండ్లలో ఆంథోసైనిన్‌ల వంటి ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి.

యాపిల్స్: యాపిల్స్‌లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆపిల్ మీద ఉండే తొక్కలో, విటమిన్ P లభించే గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

గ్రీన్ టీ: నార్మల్ గా వట్టి టీ తాగడం అనారోగ్యం అంటూ ఉంటారు చాలామంది కానీ, గ్రీన్ టీ అలా కాదు, ఇందులోలో క్యాటెచిన్స్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ టీలో అనేక ఇతర ఆరోగ్య పోషకాలలు సమృద్ధిగా ఉన్నట్లు తేలింది.

లీఫీ గ్రీన్స్: కేల్, బచ్చలికూర మరియు బ్రోకలీ వంటి కూరగాయలలో ఎక్కువగా క్వెర్సెటిన్ రూపంలో ఫ్లేవనాయిడ్లు లభిస్తూ ఉంటాయి. అవి కేలరీలలో కూడా తక్కువగా ఉంటాయి. మీ డైట్ విషయానికి వస్తే, ఇటువంటి తక్కువ కేలరీల ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి.  ఫ్లేవనాయిడ్స్‌తో సహా వివిధ ఫైటోన్యూట్రియెంట్‌లు ఎక్కువగా లభించే వివిధ రకాల మొక్కల ఆధారిత ఆహారాలను తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. అందుకే ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి విటమిన్లు ఉండే ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే అనారోగ్యం దూరం అయ్యి, ఆరోగ్యకరమైన జీవన శైలి మనకి లభిస్తుంది.