ముఖాన్ని ప్రకాశవంతంగా చేసే విటమిన్ ఈ

మెరిసే, యవ్వనమైన ఛాయ కోసం విటమిన్ E విటమిన్ ఈ కోసం మీరు తప్పకుండా తినాల్సిన 5 ఆహార పదార్థాలు విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ Eని బ్యూటీ విటమిన్ అని అంటారు. ఇది చర్మానికి అనేక విధాలుగా పనిచేస్తుందని పోషకాహార  నిపుణులు చాలా సందర్భాల్లో వివరించారు. ఇది చర్మానికి, ముఖానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖంపైన, చర్మంపైన ఉండే ఫైన్ లైన్స్ మరియు ముడతలను తగ్గిస్తుంది. చర్మం ఆకృతిని మెరుగుపరచడంతోపాటు ఫ్రీ […]

Share:

మెరిసే, యవ్వనమైన ఛాయ కోసం విటమిన్ E

విటమిన్ ఈ కోసం మీరు తప్పకుండా తినాల్సిన 5 ఆహార పదార్థాలు

విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ Eని బ్యూటీ విటమిన్ అని అంటారు. ఇది చర్మానికి అనేక విధాలుగా పనిచేస్తుందని పోషకాహార  నిపుణులు చాలా సందర్భాల్లో వివరించారు. ఇది చర్మానికి, ముఖానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖంపైన, చర్మంపైన ఉండే ఫైన్ లైన్స్ మరియు ముడతలను తగ్గిస్తుంది. చర్మం ఆకృతిని మెరుగుపరచడంతోపాటు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది. మీరు విటమిన్ E పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తిన్నా లేదా విటమిన్ E క్యాప్సూల్స్ వేసుకున్నా అవన్నీ చర్మానికి అనేక విధాలుగా పని చేస్తాయి.  విటమిన్ Eని ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో వాడుతుంటారు. అయితే అదనపు ప్రయోజనాల కోసం దీనిని క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నేటి రోజుల్లో అనేక మందికి విటమిన్ ఈ లోపం ఉంటుంది కావున చాలా మంది డెఫిషియెన్సీతో బాధపడుతున్నారు. 


శరీరంలో ఎక్కడ అయితే పోషకాల అవసరం ఉంటుందో దానినే లక్ష్యంగా విటమిన్ E క్యాప్సూల్స్ పనిచేసి ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల మీ శరీరం ఈ విటమిన్‌ను గ్రహించి అవసరమైన చోట ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది. ఇక విటమిన్ E క్యాప్సూల్స్ ఉపయోగించడం సులభం. వీటిని నోటి ద్వారా తీసుకోవచ్చు లేదా చర్మంపైన కూడా అప్లయి చేసుకోవచ్చు.

విటమిన్ Eని అనేక పద్ధతులలో ముఖానికి అప్లై చేయవచ్చు. ఉదాహరణకు విటమిన్ ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి దాని నూనెను నేరుగా చర్మానికి పూయవచ్చు. లేదా దాని ప్రభావాన్ని మరింత పెంచడానికి మాయిశ్చరైజర్ లేదా మరేదైనా ఇతర స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో కలిపి చర్మానికి అప్లయి చేసుకోవచ్చు. అయితే విటమిన్ E అనేది కొవ్వులో కరిగే విటమిన్ అని మనం తప్పక గుర్తుంచుకోవాలి. కాబట్టి దీన్ని మితంగా వాడాలి. లేకుంటే చర్మంపై దురదలు వచ్చే అవకాశం ఉంది.

విటమిన్ ఈ తో కేవలం సౌందర్య ప్రయోజనాలే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, గుండె నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడానికి సహాయ పడుతుంది. అయితే విటమిన్ ఈ నుంచి అధిక ప్రయోజనాలు పొందాలంటే క్యాప్సూల్స్ గా తీసుకోవడం కన్నా ఆహారంలో భాగంగా ఉండేలా డైట్‌ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం విటమిన్ ఈ అధికంగా ఉండే ఆహార పదార్థాలైన గింజలు, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

విటమిన్ E చర్మంపైన ఉండే మృత కణాలను తొలగిస్తుంది. ముఖంపై ఉండే సన్నని రంధ్రాలను శుభ్ర పరిచి మొటిమలు రాకుండా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది. విటమిన్ ఈ కోసం ఆహారంలో గుడ్లు, బాదం, వాల్‌నట్, పొద్దు తిరుగుడు గింజలు, ఆకు కూరలు, ఆవాలు, టర్నిప్, అవకాడో, బ్రోకలీ, బొప్పాయి, గుమ్మడికాయ, చిలగడ దుంపలను చేర్చుకోవచ్చు. అయితే క్యాప్సూల్స్‌గా తీసుకోవాల్సి వస్తే మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ విటమిన్​ను అనేక మంది తీసుకుంటారు. 

చూశారుగా.. విటమిన్ E మన శరీరానికి, ముఖానికి ఎంత ఉపయోగపడుతుందో, ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రయతించండి మరి.