విటమిన్ డి: విండో గ్లాస్ ద్వారా వచ్చే సూర్యరశ్మి వల్ల డి విటమిన్‌ లభిస్తుందా?

విటమిన్లు, ఖనిజాల గురించి మనకు చాలా తెలుసు, ఈ పోషకాల గురించి మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఒక్కో విటమిన్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. విటమిన్ డి మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి, ఇది బలమైన ఎముకలు, దంతాలు, కండరాలకు మాత్రమే కాకుండా, శరీరాన్ని క్రమబద్ధీకరించడానికి, కాల్షియం, ఫాస్పరస్‌ను శోషించడానికి, నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండ తగలకుండా రోజంతా ఏసీ […]

Share:

విటమిన్లు, ఖనిజాల గురించి మనకు చాలా తెలుసు, ఈ పోషకాల గురించి మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఒక్కో విటమిన్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. విటమిన్ డి మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి, ఇది బలమైన ఎముకలు, దంతాలు, కండరాలకు మాత్రమే కాకుండా, శరీరాన్ని క్రమబద్ధీకరించడానికి, కాల్షియం, ఫాస్పరస్‌ను శోషించడానికి, నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండ తగలకుండా రోజంతా ఏసీ గదుల్లో ఉండటం, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ అధికంగా తాగడంతో చాలా మందిలో విటమిన్ డి కొరత ఉంటోంది.

విటమిన్ డి ఎక్కువగా సూర్యరశ్మి నుండి లభిస్తుందని మనందరికీ తెలుసు, అందుకే దీనిని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా అంటారు. అయినప్పటికీ, సూర్యరశ్మి యొక్క పాత్రను అర్థం చేసుకునే విషయానికి వస్తే, శరీరానికి అవసరమైనంత విటమిన్ D లభిస్తోందా, సూర్యుడి నుండి మనకు ఎంత విటమిన్ D లభిస్తుంది? అనేది మనకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

విండో గ్లాస్ నుండి వచ్చే సూర్యకాంతి వల్ల మనకు సరిపడా విటమిన్ డి దొరుకుతుందా? అంటే, లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యకాంతి నుండి విటమిన్ డి పొందాలంటే శరీరంలో 70 శాతానికి సూర్యకాంతి తగలాలి.

మీరు ఉదయం పూట విటమిన్ డి పొందాలనుకుంటే, ఉదయం 8 గంటల సమయంలో 25 నుండి 30 నిమిషాలు ఎండలో నుంచోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో విటమిన్ డి బాగా లభిస్తుంది.

మీరు సాయంత్రం సూర్యకాంతి నుండి విటమిన్ డి పొందాలనుకుంటే, మీరు సూర్యాస్తమయం సమయంలో ఈ విటమిన్ పొందవచ్చు.

సూర్యరశ్మి వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకోండి

విటమిన్ డి

సూర్యకాంతిలో కొద్దిసేపు గడపడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

సూర్యునిలో UVA ఉంటుంది

శరీరానికి సూర్యరశ్మి నుండి UVA వస్తుంది. ఇది మన రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇదే కాకుండా, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరుస్తుంది.

విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బ్రిటన్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ డి శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ మొత్తాన్ని నియంత్రించడంలో, నిర్వహించడంలో సహాయపడుతుందని తెలుపుతోంది. ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పోషకాలు అవసరమని వివరిస్తోంది.

“విటమిన్ D లేకపోవడం పిల్లలలో రికెట్స్ వంటి వైకల్యాలకు దారితీస్తుంది, పెద్దలలో ఆస్టియోమలాసియా అనే సమస్య వల్ల ఎముకలలో నొప్పి వస్తుంది” అని NHS షేర్ చేస్తుంది.

ఇంకా.. విటమిన్ డి లోపం వల్ల అలసట, ఒంటి నొప్పులు, మానసిక సమస్యలు, జుట్టు రాలడం, కండరాల బలహీనత, ఆకలి లేకపోవటం, తరచుగా జబ్బు పడటం వంటి అనేక లక్షణాలకు దారితీయవచ్చు. తగినంత విటమిన్ డి పొందడం ద్వారా వీటన్నింటినీ నివారించవచ్చు.