విటమిన్ సీ లోపాన్ని తగ్గించే టాప్ ఫుడ్స్

ఈ ఆహార పదార్థాలను తింటే విటమిన్ సీ లోపం తగ్గుతుంది కాల్షియం ప్రొటీన్లలా విటమిన్లు శరీరానికి మరీ అంత ముఖ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సీ అవసరం ఎంతైనా ఉంది. మన ముఖాన్ని మెరిసేలా చేసేందుకు కూడా విటమిన్ సీ ఉపయోగపడుతుంది.  మెరిసే చర్మం, మృదువైన జుట్టు, మెరిసే రంగు కావాలంటే విటమిన్ సీ అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా, బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడానికి విటమిన్ సీ సహాయపడుతుంది. విటమిన్ […]

Share:

ఈ ఆహార పదార్థాలను తింటే విటమిన్ సీ లోపం తగ్గుతుంది

కాల్షియం ప్రొటీన్లలా విటమిన్లు శరీరానికి మరీ అంత ముఖ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సీ అవసరం ఎంతైనా ఉంది. మన ముఖాన్ని మెరిసేలా చేసేందుకు కూడా విటమిన్ సీ ఉపయోగపడుతుంది. 

మెరిసే చర్మం, మృదువైన జుట్టు, మెరిసే రంగు కావాలంటే విటమిన్ సీ అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా, బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడానికి విటమిన్ సీ సహాయపడుతుంది. విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి, కాలం మార్పు వల్ల కలిగే అనారోగ్యాలు రాకుండా చూస్తుంది.

అలాగే, విటమిన్ సీ ఆస్తమా, క్యాన్సర్‌తో సహా ఎన్నో రోగాలు రాకుండా నివారిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, విటమిన్ సీ శరీరానికి చాలా అవసరం. విటమిన్ సీ లోపాన్ని భర్తీ చేయగల ఆహార పదార్థాలు ఇవే;

సిట్రస్ పండ్లు: నారింజ, దానిమ్మ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, కివి, జామ, బొప్పాయి, పైనాపిల్, పుచ్చకాయ మొదలైన సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే శరీరంలోని విటమిన్ సీ లోటును త్వరగా భర్తీ చేయవచ్చు.

పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు: ఎర్ర మిరపకాయల రుచి ఘాటుగా ఉన్నప్పటికీ విటమిన్ సీ అధికంగా ఉండే వాటిని తినడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. పచ్చి మిరపకాయల కంటే ఎండు మిరపకాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఆహారంలో క్యాప్సికమ్‌ తీసుకొంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.

కూరగాయలు: టమాటాలతో పాటు, బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు, ద్రాక్షపండు, బచ్చలికూర, బఠానీలలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే, మీరు మీ ఆహారంలో పుదీనా ఆకులు, పుదీనా రసం, పనసపండు, ముల్లంగి ఆకులు, కొత్తిమీర ఆకులు, బీట్‌రూట్, ఉసిరి వంటి వాటిని చేర్చడం ద్వారా మీ శరీరానికి విటమిన్ సీ మరింత ఎక్కువగా చేరుతుంది.

ఉసిరి: విటమిన్ సీ యొక్క అద్భుతమైన మూలం ఉసిరి లేదా ఆమ్లా. ఆయుర్వేదంలో ఉసిరి కాయలను త్రిఫలాలలో ఒకటిగా చెప్తారు. ఉసిరి కాయలను కాయగూరగా వంటలలోను, సలాడ్‌లలోను, జ్యూస్‌ రూపంలో లేదంటే వాటితో స్వీట్ తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు. 100 గ్రాముల ఉసిరికాయలలో 600 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. ఇది విటమిన్ లోపం ఉన్నవారికి మంచి సప్లిమెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది.

జామపండ్లు: ఒక రోజులో మొత్తం ఎంత విటమిన్ సీ తీసుకోవాలో అంతకు రెట్టింపు విటమిన్ సీ జామపండులో ఉంటుంది. జామకాయలో ఐరన్‌తో సహా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సీ యొక్క గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. 

కరోనా  మహమ్మారి విజృంభించిన రోజుల్లో విటమిన్ సీ తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెప్పడం వినే మనం ఉంటారు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విటమిన్ సీ శరీరంలో తక్కువ అవకుండా చూసుకోవడం ఎప్పటికైనా మంచిదే అని కూడా డాక్టర్లు, పోషకాహార నిపుణులు చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. 

తెలుసుకున్నారుగా.. విటమిన్ సీ లోపాన్ని తగ్గించడానికి, ఏయే  ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఉపయోగపడతాయో.. అయితే వెంటనే ఈ వివరాలను మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు కూడా తెలియజెయ్యండి.