వెరికోస్ వెయిన్స్ నొప్పితో బాధపడుతున్నారా?

మన ప్రపంచ దేశాలలో నివసిస్తున్న ఎంతోమంది ఎన్నో రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీ కాళ్లు వెరికోస్ వెయిన్స్ తో బాగా నొప్పి పెడుతున్నాయా? ఈ నొప్పిని తగ్గించడానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.  వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్లకే ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. దీనివల్ల ఘోరమైన లెగ్ పెయిన్ వస్తుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. […]

Share:

మన ప్రపంచ దేశాలలో నివసిస్తున్న ఎంతోమంది ఎన్నో రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీ కాళ్లు వెరికోస్ వెయిన్స్ తో బాగా నొప్పి పెడుతున్నాయా? ఈ నొప్పిని తగ్గించడానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.  వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్లకే ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. దీనివల్ల ఘోరమైన లెగ్ పెయిన్ వస్తుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. అందుకే ఈ నొప్పిని ఎలాగైనా మేనేజ్ చేయాలి. వెరికోస్ వెయిన్స్ మన కంట్రీలో చాలామందికి ఉంది. చాలామంది దీనివల్ల సఫర్ అవుతున్నారు.

వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? 

వెరికోస్ వెయిన్స్ అనేది మన కాలి నరాలకు కలిగే నొప్పి. నరాల ప్రాబ్లం వచ్చి బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగక ఈ నొప్పి అనేది మొదలవుతుంది. తరచుగా ఒకే చోట కూర్చోవడం, లేదా ఒకే చోట నిల్చోవడం వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది. దీనివల్ల కాలు నొప్పి బాగా పెరుగుతుంది. వెరికోస్ వెయిన్స్ నొప్పిని  తగ్గించుకోవడం ఎలా?  ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మనం కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

రెగ్యులర్ ఎక్సర్సైజ్: 

రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది. ఇంకా నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. సైక్లింగ్ ,వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయడం వల్ల మీ కాళ్ళలో ఉన్న మజిల్స్ స్ట్రాంగ్ గా మారి  ఈ నొప్పిని తగ్గేలా చేస్తాయి.

బరువుని కంట్రోల్ లో ఉంచుకోవాలి: 

అధిక బరువు వల్ల కూడా కాళ్ళ మీద ఒత్తిడి  పడుతుంది. అందుకే మీ బరువును తగ్గించుకోవాలి.

బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

కాళ్లను పైకి ఉంచడం: 

పడుకున్నప్పుడు, లేదా రెస్ట్ లో ఉన్నప్పుడు మీ కాళ్ళను పైకి పెట్టడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తిరిగి హార్ట్ వైపు వెళుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. కాళ్లు వాయకుండా ఉంటుంది.

కంప్రెషన్ స్టాకింగ్స్: 

వీటిని వాడడం ఈ నొప్పి నుండి బయటపడొచ్చు. ఇది నరాలకు సపోర్టిచ్చి పెయిన్ రాకుండా చేస్తుంది. దీనివల్ల నొప్పి అనేది తగ్గుతుంది.

డాక్టర్ ని కన్సల్ట్ చేయడం: 

డాక్టర్ ని కన్సల్ట్ చేయడం వల్ల మీ పెయిన్ కి రీజన్ ఏంటో తెలుస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. స్పెషలిస్ట్ ఈ నొప్పి నుండి మీరు బయటపడే విషయంలో సాయం చేస్తారు. వెరికోస్ వెయిన్స్ అనేది మన కాళ్లకు చాలా నొప్పి కలిగేలా చేస్తుంది. దీని బారిన పడ్డ వాళ్లకే ఈ నొప్పి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఈ నొప్పి బారిన పడ్డ వాళ్లకి నరకం కనిపిస్తుంది. దీని నుండి బయటపడాలంటే మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి.

వెరికోస్ వెయిన్స్ అనే సమస్య పెద్దదైనా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. పైన చెప్పిన నియమాలు పాటించినట్లయితే మీ సమస్యలో చాలా వరకు మార్పు ఉంటుంది. ఒకవేళ మార్పు లేకపోతే కచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించడం వల్ల దీని నుండి మీరు శాశ్వత ఉపశమనం పొందవచ్చు.