ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఈ హెర్బల్ షాంపూని ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడవుగా అవుతుంది

ఈ రోజుల్లో జుట్టు బలహీనపడటం, చివరలు చిట్లిపోవడం, చివర్లలో తెగిపోవడం, జుట్టు రాలడం వంటివి దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే! జుట్టు బలహీనపడటం, పెరుగుతున్న జుట్టు రాలడం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈ రోజుల్లో జుట్టు బలహీనపడటం, చివరలు చిట్లిపోవడం, చివర్లలో తెగిపోవడం, జుట్టు రాలడం వంటివి దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. జుట్టు బలహీనపడటం, పెరుగుతున్న జుట్టు రాలడం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు. జుట్టుకు సరైన పోషణ లభించాలంటే.. సరైన […]

Share:

ఈ రోజుల్లో జుట్టు బలహీనపడటం, చివరలు చిట్లిపోవడం, చివర్లలో తెగిపోవడం, జుట్టు రాలడం వంటివి దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే! జుట్టు బలహీనపడటం, పెరుగుతున్న జుట్టు రాలడం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు.

ఈ రోజుల్లో జుట్టు బలహీనపడటం, చివరలు చిట్లిపోవడం, చివర్లలో తెగిపోవడం, జుట్టు రాలడం వంటివి దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. జుట్టు బలహీనపడటం, పెరుగుతున్న జుట్టు రాలడం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు.

జుట్టుకు సరైన పోషణ లభించాలంటే.. సరైన పోషకాహారం, సంరక్షణ అవసరం. కానీ, కొన్నిసార్లు కాలుష్యం, వాతావరణంలో మార్పులు, జుట్టును సరిగ్గా పట్టించుకోకపోవటం వంటి వాటి వల్ల జుట్టు ఎక్కువగా రాలడం మొదలవుతుంది. అందుకే రకరకాల షాంపూలను ఉపయోగించడం మొదలుపెడతారు. మార్కెట్‌లో దొరికే షాంపూలలో చాలా రసాయనాలు ఉన్నాయి, ఇవి జుట్టును పాలిషింగ్‌తో పాటు మృదువుగా, మెరిసేలా చేస్తాయి, అయితే ఈ షాంపూలు దీర్ఘకాలంలో జుట్టుకు హాని చేస్తాయి.

అటువంటి పరిస్థితిలో మీరు ఇంట్లో మీ జుట్టు కోసం ప్రకృతి సిద్ధంగా దొరికే వస్తువులతో సహజమైన హెర్బల్ షాంపూని తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టుకు అవసరమైన పోషణ అందిస్తుంది. ఈ షాంపూలను వాడటం వల్ల మీ జుట్టుపై ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు.

జుట్టు ఒత్తుగా బలంగా పెరగటం కోసం హెర్బల్ షాంపూ తయారుచేసే విధానం

షాంపూల ప్రకటనలలో మా షాంపూలో కుంకుడు కాయలు, ఉసిరి, శీకాకాయ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద మూలికలు, ఇవి మీకు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. వీటితో షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 

100 గ్రాములు గింజలు తీసిన కుంకుడు కాయలు, ఉసిరికాయల పొడి, శీకాకాయ తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక ఇనుప పాత్రలో నీటిలో వేసి, కొన్ని మెంతులు వేయాలి. ఇవన్నీ బాగా ఉడకబెట్టాలి. అరగంట ఉడకబెట్టిన తర్వాత ఆ మిశ్రమం రంగు పూర్తిగా నల్లగా మారుతుంది.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని జల్లెడ సహాయంతో ఒక పాత్రలోకి వడగట్టండి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ఒక సీసాలో భద్రపరుచుకోండి. ఈ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు బాగా పెరుగుతుంది.

చుండ్రు కోసం హెర్బల్ షాంపూ

చాలామందికి తలలో చుండ్రు, దురద ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇన్ఫెక్షన్ తలలో మొదలయ్యి, దీనివల్ల జుట్టు తెగిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఈ షాంపూ బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లో తయారుచేసే ఈ హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దాం. 

శీకాకాయ్ పొడి, చందనం పొడి, ఎండిన వేప ఆకుల పొడిని కొద్దిగా శనగ పిండిలో బాగా కలపండి. దీన్ని పొడిగా ఉన్న ఒక డబ్బాలో నిల్వ చేయండి. మీరు తలంటుకోవడానికి ఒక అరగంట ముందు, ఒక కప్పులో కొద్ది మొత్తంలో ఈ పొడిని నానబెట్టి, ఆ నీటితో  షాంపూ చేసుకోండి. దీనివల్ల చుండ్రు, పొడిబారడం,ఇన్‌ఫెక్షన్‌ వంటివి తగ్గి జుట్టు దృఢంగా అవుతుంది.

ఇవండీ! మనకు మార్కెట్‌లో సులువుగా దొరికే ప్రకృతి సిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోగలిగే షాంపూలు. మరి, మీరు కూడా ట్రై చేస్తారుగా?