జీలకర్ర ఉపయోగాలు

జీలకర్రతో ఊబకాయం మాయం.. ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలుత్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే జీలకర్ర తప్పనిసరి ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి అనేకమందికి తగినంత సమయం దొరకడమే లేదు. దీనికి తోడు జంక్ ఫుడ్‌ ని విపరీతంగా తినేస్తుండటంతో అందరిలోనూ ఊబకాయం కనిపిస్తూనే ఉంది. ఊబకాయం వందలాది వ్యాధులకు నిలయం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధిక బరువు మన ఆరోగ్యాన్ని అనేక మార్గాల్లో ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. […]

Share:

జీలకర్రతో ఊబకాయం మాయం.. ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలు
త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే జీలకర్ర తప్పనిసరి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి అనేకమందికి తగినంత సమయం దొరకడమే లేదు. దీనికి తోడు జంక్ ఫుడ్‌ ని విపరీతంగా తినేస్తుండటంతో అందరిలోనూ ఊబకాయం కనిపిస్తూనే ఉంది. ఊబకాయం వందలాది వ్యాధులకు నిలయం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధిక బరువు మన ఆరోగ్యాన్ని అనేక మార్గాల్లో ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. కొంతమంది బరువు తగ్గడం కోసం డైట్‌ని ఆశ్రయిస్తారు, కొందరు హార్డ్ కోర్ వర్కవుట్‌లు చేస్తారు. అయితే బరువు తగ్గడానికి ఈ రెండు పద్ధతులు అందరికీ సులభం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయలేరు. అలాగనీ సరైన విధంగా డైట్ ని ఫాలో అవ్వలేరు. అందుకే చాలా మంది బరువు తగ్గడానికి కొన్ని ఇతర సులభమైన మార్గాలను ప్రయత్నిస్తారు. ఇలాంటి వాటిల్లో ఒకటి జీలకర్ర నీరు. కొన్ని నెలల వ్యవధిలోనే శరీరంలోని అదనపు కొవ్వును కరిగించగల శక్తి జీలకర్రకు ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. నిజానికి జీలకర్ర ఊబకాయాన్ని తగ్గించడానికి ఒక శక్తివంతమైన పదార్ధం. సరిగ్గా ఉపయోగించినట్లయితే ఇది అదనపు శరీర కొవ్వును మాయం చేస్తుంది, 

బరువు తగ్గడంలో జీలకర్ర ఎలా సహాయపడుతుంది, దీని ప్రయోజనాలను పెంచుకోవడానికి జీలకర్రను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లను శరీరం గ్రహించడంలో జీలకర్ర సహాయపడుతుంది, అందుకే ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని అందరూ చెబుతారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జీవక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతో అదనపు కొవ్వు శక్తిగా మారుతుంది.మీ బరువును నియంత్రించుకోవడానికి జీలకర్రను ఉపయోగించాలనుకుంటే జీలకర్ర నీటిని తీసుకోవాలి. అత్యంత ప్రయోజనకరమైన దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

హాట్ జీరా వాటర్

జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. అదే నీటిని మరిగించి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. దీని వల్ల మీ శరీర జీవక్రియ వేగవంతమవుతుంది. దీనిని మీరు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే శరీరం డీటాక్సిఫికేషన్ అవుతున్న అనుభూతిని మీరు పొందుతారు.

జీలకర్ర, గరం మసాలా నీరు

రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో గరంమసాలా, జీలకర్ర వేసి నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవాలి. ఈ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ఇవి శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడతాయి. తద్వారా మీ బరువు త్వరగా తగ్గడం మీరు గమనిస్తారు.

జీలకర్ర, లెమన్ వాటర్

నిమ్మరసం కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ జీవక్రియను వేగవంతం చేసి కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. దీనిని జీలకర్రతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను మనం పొందవచ్చు. దీనికోసం కొన్ని జీలకర్ర గింజలు, ఐదు చుక్కల నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పూట తీసుకోవాలి. ఇది వేగంగా బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వుని కరిగించేస్తుంది. జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అయితే జీలకర్ర మన శరీరానికి వేడి చేస్తుంది. అందుకే దీన్ని తీసుకోవడానికి ఒక సమయం ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, మీరు వేసవి కాలంలో తాగితే అది మీ ఆరోగ్యానికి కొంతమేర హాని కలిగిస్తుంది. అయితే చలికాలం, వానకాలంలో ఉదయం పూట జీలకర్ర నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది.