పిల్ల‌ల్లో టైప్ 2 మధుమేహం

టైప్ 2 డయాబెటిస్ (T2D), దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధి, ఇది రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ అధిక స్థాయిలను సూచిస్తుంది. ఇది అనియంత్రిత రక్తంలో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత మరియు శరీరంలో ఇన్సులిన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. మనం తినే ఆహారాలు మనకు శక్తికి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్‌ని అందిస్తాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మధుమేహం విషయంలో, శరీర కణాలు ఇన్సులిన్‌కు సాధారణంగా స్పందించవు, […]

Share:

టైప్ 2 డయాబెటిస్ (T2D), దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధి, ఇది రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ అధిక స్థాయిలను సూచిస్తుంది. ఇది అనియంత్రిత రక్తంలో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత మరియు శరీరంలో ఇన్సులిన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. మనం తినే ఆహారాలు మనకు శక్తికి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్‌ని అందిస్తాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మధుమేహం విషయంలో, శరీర కణాలు ఇన్సులిన్‌కు సాధారణంగా స్పందించవు, దీనిని ఇన్సులిన్ నిరోధకత అంటారు. అయితే ఈ తరం చిన్నారుల్లో రోజురోజుకీ టైప్ 2 డయాబెటిస్ వ్యాధి శాతం పెరిగిపోతుంది. ఇందుకు కారణాలు ఏంటి.. ఏయే లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించొచ్చు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి. 

నవంబర్ 14న చిల్డ్రన్స్ డే..ఇదే రోజున వరల్డ్ డయాబెటీస్ డే కూడా.. ఈ నేపథ్యంలోనే ఓ భయంకరమైన నిజం చెప్పాలంటే.. నేటి కాలంలో చిన్నపిల్లల్లోనూ షుగర్ వ్యాధి పెరిగిపోతోంది. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. మరి దీన్ని గుర్తించడం ఎలా.. కొన్ని లక్షణాల వల్ల చిన్నారుల్లో దీన్ని గుర్తించవచ్చు.

మన దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య పెరుగుతూనే వస్తోంది. మన దురదృష్టం కొద్దీ చిన్నారులకి కూడా ఇది పాకుతోంది. ఈ విషయం మనకు తెలియడం లేదు. చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో మనం దాన్ని గుర్తించట్లేదు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చిన్నారుల్లో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు..

చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు..

*బరువు తగ్గుతారు..

డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే.

*నీరు ఎక్కువగా తీసుకోవడం..

షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగుతుంటే అనుమానించాల్సిందే.

*అతి మూత్ర విసర్జన ..

షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఆ విషయాన్ని గుర్తించాలి.

*కొన్ని సార్లు స్పర్శ కోల్పోవడం..

చిన్నారుల్లో కొన్ని స్పర్శ ఉండదు.. ముఖ్యంగా వారి కాళ్లు, చేతులకి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. దీన్ని గుర్తించాలి. లేకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి త్వరగా గుర్తించాలి.

*కడుపు నొప్పి..

చిన్నాారులు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువగా జీర్ణశక్తి లోపించినప్పుడు అనుకుంటాం. కానీ, కొన్ని సార్లు షుగర్ వ్యాధి ఉన్నా కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు.

*దృష్టిలోపం..

మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం. చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే చిన్నారులు అందరికీ ఈ లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉంటుంది. దాన్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందిగా మారుతుంది. తీరా ఈ వ్యాధి పిల్లలతో పాటే పెరుగుతుంది.

నిజానికీ భారతదేశంలో చిన్నారుల్లోనూ సమస్య పెరుగుతుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించడం ద్వారా సమస్య చాలా వరకూ నయం అవుతుంది.

పిల్లల్లో వ్యాధి రావడానికి కారణాలు..

సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఇందులో జన్యుపరమైన, పర్యావరణ లోపాలు కారణం కావొచ్చు.

ఇక టైప్ 2 డయాబెటిస్ మెల్లిటిస్ దగ్గరి బంధువులలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గరి బంధువులకు ఎవరైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4 శాతం పిల్లలకి వస్తుంది.

ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4 శాతం వరకు వస్తుంది. అదే విధంగా ఒక వేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8 శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

పిల్లలు మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, రన్నింగ్ రేస్.. ఇలాంటి అవుట్ డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శరీరం కాస్తైనా శ్రమకి గురవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి బ్బులు దరిచేరవు.అదే విధంగా వారి డైట్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం.

 వారిని మంచి ఆహారం తీసుకునేలా చూడాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అదే విధంగా జంక్ ఫుడ్‌కి దూరం చేయాలి. పౌష్ఠికాహారం తీసుకునేలా చూడాలి. వ్యాయామం చేసేలా చూడాలి. మీతో పాటు వ్యాయామం చేయించాలి. తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల చాలా వరకూ సమస్య దూరం అవుతుంది.