టైప్ 1 డయాబెటిస్ నివారించవచ్చు

స్క్రిప్స్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తలు రక్తంలోని టి- సెల్స్ మీద చేసిన అనాలసిస్ ద్వారా టైప్ 1 డయాబెటిస్ ని గుర్తించవచ్చని తెలుసుకున్నారు. అదేవిధంగా టి సెల్ఫ్ ద్వారా సాధ్యమైనంత వరకు టైప్ 1 డయాబెటిస్ నివారించవచ్చు అంటున్నారు పరిశోధకులు. టైప్ 1 డయాబెటిస్ రిస్క్‌ను గుర్తించడానికి కొత్త పద్ధతి ఒకటి స్క్రిప్స్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. రక్తంలోని టి- సెల్స్ విశ్లేషించడం ద్వారా టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్న వాళ్ళను గుర్తించవచ్చని అంటున్నారు ఈ […]

Share:

స్క్రిప్స్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తలు రక్తంలోని టి- సెల్స్ మీద చేసిన అనాలసిస్ ద్వారా టైప్ 1 డయాబెటిస్ ని గుర్తించవచ్చని తెలుసుకున్నారు. అదేవిధంగా టి సెల్ఫ్ ద్వారా సాధ్యమైనంత వరకు టైప్ 1 డయాబెటిస్ నివారించవచ్చు అంటున్నారు పరిశోధకులు.

టైప్ 1 డయాబెటిస్ రిస్క్‌ను గుర్తించడానికి కొత్త పద్ధతి ఒకటి స్క్రిప్స్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. రక్తంలోని టి- సెల్స్ విశ్లేషించడం ద్వారా టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్న వాళ్ళను గుర్తించవచ్చని అంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. ఎలుకల మరియు మనుషుల రక్త నమూనాల నుండి టి సెల్స్ ను వేరుచేయడం ద్వారా, వారు ఆటో ఇమ్మ్యూనిటీ ఉన్న రోగులను ఖచ్చితంగా గుర్తించగలిగారు, వారికి నివారణ చికిత్సలకు మార్గం సులభం అంటున్నారు. “సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌” అనే జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో, ఆటో ఇమ్యూన్ ప్రక్రియను ముందుగానే గుర్తించడం ఎలాగో వివరించారు. ఇది టైప్ 1 డయాబెటిస్‌ను ఆలస్యం చెయ్యచ్చనే ఆశను అందిస్తుంది. అధ్యయన ప్రధాన పరిశోధకుడు లూక్ టెయ్టన్, MD, PhD, ప్రమాదంలో ఉన్న రోగులను గుర్తించడంలో మరియు వారికి నివారణ చికిత్సలను అందించడంలో ఈ విధానం ఒక ముఖ్యమైన దశ అని అభిప్రాయపడ్డారు. 

టైప్ 1 డయాబెటిస్-టి సెల్స్: 

ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలను రోగనిరోధక వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని నాశనం చేసినప్పుడు, టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. జన్యుపరమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ల ద్వారా ప్రభావితమయ్యే ప్రాసెస్ ఏర్పడుతుంది. రక్షించవలసిన రోగనిరోధక వ్యవస్థ, అంటే ఆటో ఇమ్యూన్ ప్రోటీన్లు, బలహీనం అయ్యి స్వయం ప్రతిరక్షక పురోగతి అంటే ఆటో ఇమ్మ్యూనిటి ఇవ్వకపోవడం వలన వయసు పెరిగే కొద్దీ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా చిన్నవయసు నుండే అంటే బాల్యం లేదా యుక్తవయస్సులోనే టైప్ 1 డయాబెటిస్ కంప్లైంట్ వినిపిస్తుంది, వీరికి జీవితకాల ఇన్సులిన్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి టైప్ 1 డయాబెటిస్ రావడాన్ని ఆలస్యం చేయడానికి రోగనిరోధక వ్యవస్థ నాశనం అవసరం ఆయన సెల్స్ ని నాశనం చెయ్యకుండా చికిత్స ఆమోదించబడినప్పటికీ, అవసరం ఉన్న పేషంట్స్ లని గుర్తించడం సవాలుగా ఉంది. యాంటీ-ఐలెట్ యాంటీబాడీస్‌పై ఆధారపడే సాంప్రదాయ పద్ధతులు ఆటో ఇమ్యూన్ పురోగతిని అంచనా వేయడంలో నమ్మదగినవి కాదని తేలింది. టైటన్ టైప్ 1 డయాబెటిస్ అభివృద్ధిలో టి సెల్స్ కణాల కీలక పాత్ర పోషిస్తాయని నొక్కి చెప్పారు. 

అధ్యయనం ప్రకారం చెప్పాలంటే, టేటన్ టీం ఆటో ఇమ్యూన్ ప్రోటీన్లు మరియు ఇన్సులిన్ పదార్ధాల మిశ్రమం లాగా  ఉండే ప్రోటీన్ కాంప్లెక్స్‌లను నిర్మించింది, ఇవి ప్రత్యేకమైన సిడి4 టి సెల్స్లో తమకు తామే ప్రతిరక్షక ప్రతిస్పందనను, అంటే రోగాన్ని తగ్గించే ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఈ కాంప్లెక్స్‌లను ఎరగా ఉపయోగించి, వారు రక్త నమూనాల నుండి యాంటీ ఇన్సులిన్ సిడి4 టి సెల్స్ లను పట్టుకున్నారు. ఇలా సేకరించిన టి సెల్స్లో జన్యు మార్పులు, వాటి వలన సంభవించే ప్రోటీన్ ఎలా పనిచేస్తాయో అనాలసిస్ ద్వారా, ఈ  యాంటీ-ఐలెట్ ఆటో ఇమ్యూనిటీతో ప్రమాదంలో ఉన్న రోగులను గుర్తించడానికి పరిశోధకులు వర్గీకరణ అల్గోరిథంను అభివృద్ధి చేశారు. టీటన్ టీం తరువాత లక్ష్యం ఈ విధానాన్ని ఇంకొంతమందిలో అధ్యయనం చేసి దీనిని యాంటీ-ఐలెట్ యాంటీబాడీలను లెక్కించే సాంప్రదాయ పద్ధతితో పోల్చిన తరువాత వారు తెలుసుకున్న విషయాలను బయటకి చెప్తారు.  అదనంగా, ఈ టి సెల్స్ వేరుచేసి విశ్లేషించే ప్రాసెస్ను మరింత సులువుగా క్లినికల్ ఉపయోగం కోసం అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవంతమైతే, ఈ పద్ధతి ద్వారా డయాబెటీస్ తో ప్రమాదంలో ఉన్న పేషంట్స్ని గుర్తించి మెరుగైన చికిత్స అందించి వ్యాధి పెరగకుండా, పర్యవేక్షించడంలో కీలకమైన సాధనంగా ఉంటుంది.