ప‌సుపుకి జీర్ణ‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గించే సామ‌ర్ధ్యం ఉంద‌ట‌

పసుపులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి జీర్ణాశయాంతర అంటే జీర్ణ ప్రక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే జీర్ణశక్తిని పెంపొందించడంలో ప్రకృతి సిద్ధమైన మంచి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.  ఔషధ గుణాలు ఉన్న పసుపు:  ప్రకృతి సిద్ధంగా లభించే స్వచ్ఛమైన పచ్చి పసుపులో లభించే సహజమైన ఒమెప్రజోల్ ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు పుతున్నారు. మనకు లభించే […]

Share:

పసుపులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి జీర్ణాశయాంతర అంటే జీర్ణ ప్రక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే జీర్ణశక్తిని పెంపొందించడంలో ప్రకృతి సిద్ధమైన మంచి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. 

ఔషధ గుణాలు ఉన్న పసుపు: 

ప్రకృతి సిద్ధంగా లభించే స్వచ్ఛమైన పచ్చి పసుపులో లభించే సహజమైన ఒమెప్రజోల్ ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు పుతున్నారు. మనకు లభించే పసుపులో ఉండే ఒమెప్రజోల్ వంటి పదార్థం, మన కడుపులో ఉండే ఎసిడిటీ కలిగించే అధిక ఆసిడ్ వంటి పదార్థాలను తగ్గించడం ద్వారా, జీర్ణశయాంతర లక్షణాల కనిపించిన వారిలో చాలా చక్కని చికిత్సకు ఉపయోగించే ఔషధంగా పనిచేస్తుంది. BMJ ఎవిడెన్స్-బేస్డ్ మెడిసిన్ జర్నల్‌లో పసుపు ఎంత చక్కగా మన జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందో ప్రచురించడం జరిగింది. కుర్కుమా లాంగా మొక్క వేరు నుండి పసుపు మనకు లభిస్తుంది. ఇందులో కర్కుమిన్‌ను ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సహజంగా మంచి శక్తిని అందించే పదార్ధం, ఇది చాలా కాలంగా ఆగ్నేయాసియా సంబంధించిన ట్రీట్మెంట్ లో, అంతే కాకుండా ముఖ్యంగా అజీర్తి చికిత్స కోసం ఉపయోగిస్తూ ఉంటారు. 

ఇటీవల జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం 18 నుంచి 70 వయసు గల ఉన్న వ్యక్తులలో జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారిని ముఖ్యంగా ఎంపిక చేసుకుని 28 రోజులపాటు రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే మూడు గ్రూపులుగా విభజించి, గ్రూపుకి 69 మంది చొప్పున తీసుకున్నారు. అయితే ఒక గ్రూపు వారికి కేవలం పసుపుకి సంబంధించిన క్యాప్సిల్ ఇవ్వడం జరిగింది. రెండో గ్రూపు వాళ్లకి ఓమెప్రజోల్ అనే 20mg క్యాప్సిల్ ఇవ్వడం జరిగింది. ఇక మూడో గ్రూప్ కి పసుపు అదే విధంగా, ఓమెప్రజోల్ కాంబినేషన్ తో ఉన్న క్యాప్సిల్ ఇవ్వడం జరిగింది. 

రిజల్ట్స్: 

ఓమెప్రజోల్ అనేది నిజానికి ప్రోటోన్ పంప్ఇన్హిబిట్టర్ వంటిది అంటే పిపిఐ. ఇది ముఖ్యంగా అజీర్తికి సంబంధించిన చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే 28 రోజులపాటు జరిగిన రీసెర్చ్ చేసిన అనంతరం రిజల్ట్స్ ప్రకారం, మరో 28 రోజులు రీసెర్చ్ చేయడం జరిగింది.. అయితే ఎవరైతే పసుపుకి సంబంధించి క్యాప్సిల్ వేసుకున్నారో వారిలోని జీర్ణశక్తి పెంపొందించడమే కాకుండా, మరి ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఉపశమనం కలిగినట్లు కనుగొన్నారు పరిశోధకులు. 

ఓమెప్రజోల్ క్యాప్సిల్ ఎక్కువగా ఉపయోగించిన వారి రిజల్ట్ కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే మరోవైపు ఓమెప్రజోల్ వంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో ఫ్రాక్చర్ రిస్క్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వారిలో ఓమెప్రజోల్ వంటి క్యాప్సిల్స్ అధిక మొత్తంలో తీసుకోవడం కారణంగా లివర్ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. 

అయితే ప్రస్తుతానికి పసుపు వంటి లక్షణాలతో ఉన్న పదార్థాలు జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే ఔషధాలుగా గుర్తించినప్పటికీ వీటి గురించి మరింత రీసెర్చ్ జరుగుతూనే ఉంది. పసుపులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మన చర్మాన్ని కాపాడతాయి. మన సైడ్ వంటల్లో ఎక్కువగా పసుపు ఉపయోగిస్తారు. దీనివల్ల మన చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. మనకు ముడతలు రాకుండా ఉంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా ఉపయోగపడతాయి. ఏది ఏమైనప్పటికీ పసుపులో ఉండే ఔషధ గుణాలు సగటు మనిషి సమస్యలను తీర్చడంలో ఎంత బాగా ఉపయోగపడుతుందో మరొకసారి నిరూపితం అయింది.