తులసితో ఒత్తిడి సహజ నివారణలు

తులసీ ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది, రోజూ తులసీ ఆకులను నమలండి ఎన్నో ఔషధ గుణాలతో నిండిన తులసి దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. సంతోషం మరియు శాంతికి చిహ్నమైన తులసిని తీసుకోవడం వల్ల మీ జలుబు మరియు దగ్గును దూరం చేయడమే కాకుండా అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఈ మూలిక భారతదేశంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. దగ్గు వస్తే మన ఇంటి పెద్దలు తులసి టీ తాగమని సలహా ఇస్తుంటారు. కానీ తులసి దాని శాంతపరిచే […]

Share:

తులసీ ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది, రోజూ తులసీ ఆకులను నమలండి

ఎన్నో ఔషధ గుణాలతో నిండిన తులసి దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. సంతోషం మరియు శాంతికి చిహ్నమైన తులసిని తీసుకోవడం వల్ల మీ జలుబు మరియు దగ్గును దూరం చేయడమే కాకుండా అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఈ మూలిక భారతదేశంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. దగ్గు వస్తే మన ఇంటి పెద్దలు తులసి టీ తాగమని సలహా ఇస్తుంటారు. కానీ తులసి దాని శాంతపరిచే ప్రభావానికి ప్రసిద్ధి చెందిందని మీకు తెలుసా, అందుకే ఈ అద్భుత మూలికను సమర్థవంతమైన సహజ ఒత్తిడి నివారిణిగా పరిగణిస్తారు.


మైగ్రేన్ నుండి డిప్రెషన్ వరకు, తులసీ ఆకులు ప్రభావవంతంగా ఉంటాయి

మన జీవితంలో తులసికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. మన ఇళ్లలో పూజించే తులసీ అనేక రకాల ఔషధ ప్రయోజనాల భాండాగారం అని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. హిందువులు తులసిని మాతృ స్వరూపంగా భావించి పూర్తి ఆచారాలతో పూజిస్తారు. తులసీ పెరిగే ఇంట్లో నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. తులసిలో అనేక ఆరోగ్యకర లక్షణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ ప్రాణాంతక వ్యాధులను తగ్గిస్తాయి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం తులసిని చాలామంది ఉపయోగిస్తారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు, మధుమేహం, అనేక ఇతర వ్యాధుల వల్ల వచ్చే అనారోగ్యాలను  తగ్గిస్తుంది. అంతేకాక తులసీ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. నిద్రలేమి, తలనొప్పి, మైగ్రేన్, ఒత్తిడి మొదలైనవాటిని ఎదుర్కోవడంలో తులసీ సహాయపడుతుంది.

తులసీ ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే తులసిని ఆయుర్వేదంలో అమృతం అని పిలుస్తారు. అలాగే దీనిని సాటిలేనిది, ప్రకృతి యొక్క మదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. దీన్ని రెగ్యులర్‌‌గా ఉపయోగిస్తే మిమ్మల్ని ఉల్లాసంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలకు తులసీ ఆకులను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలకు తులసీ ఆకుల ప్రయోజనాలు

డిప్రెషన్:

ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్‌‌తో సతమతమవుతున్నారనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. రకరకాల కారణాల వల్ల చాలామంది ఉద్యోగ ఒత్తిడి, వర్క్ లైఫ్‌లో సమతుల్యత లేకపోవడం, వినోదం తగ్గిపోవడం, ఆర్థిక సమస్యల వల్ల మానసిక అనారోగ్యం అనేక మందిని పీడిస్తోంది. ఇలాంటి వారికి తులసీ ఒక వరం. తులసీ సహజసిద్ధమైన యాంటీ డిప్రెసెంట్ .డిప్రెషన్‌తో బాధపడే వాళ్లకు దీని ఆకులు కొన్నింటిని పాలతోపాటు మరిగించి రాత్రిపూట ఇవ్వాలి. దీని వల్ల క్రమంగా వారు డిప్రెషన్ నుంచి బయటపడతారు.

మైగ్రేన్:

ప్రస్తుతం చాలామంది బాధపడే అనారోగ్యాల్లో మైగ్రేన్ ఒకటి. దీని వల్ల అనేకమంది తలలో ఒక వైపు భాగంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. తలనొప్పి ఒకేసారి కాకుండా విడతలుగా రావడం, అలాగే తరచుగా వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించే పరిస్థితిని సాధారణంగా మైగ్రేన్ అంటారు. తులసీ ఆకుల సారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగి మైగ్రేన్‌ క్రమంగా దూరమవుతుంది.

ఒత్తిడి దూరం

మన శరీరంలో ఉండే కార్టిసాల్ హార్మోన్ మెదడులో ఒత్తిడిని పెంచుతుంది. తులసీఆకులు ఈ కార్టిసాల్ హార్మోన్‌ని తగ్గిస్తాయి. కాబట్టి ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తి క్రమం తప్పకుండా తులసీ ఆకులను నమలుతుండాలి. ఒక్క కార్టిసాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా తులసీ శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి కూడా సహాయపడుతుంది. దీని ఫలితంగా నరాలు, కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. 

అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉన్న తులసీ ఆకులను  రోగనిరోధక శక్తిని పెంచడానికి, డిప్రెషన్, మైగ్రేన్ వంటి వివిధ వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు క్రమం తప్పకుండా తినాలి. హిందూ సంప్రదాయంలో ఎంతో కీలకంగా ఉండే తులసి మొక్కను దేవత రూపంలో పూజలు చేస్తుంటారు. అదే సమయంలో తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల రుగ్మతల నుండి ఉపశమనానికి వినియోగిస్తుంటారు. కాబట్టి ఉచితంగా లభించే తులసితో ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.