మెరిసే ముఖం కోసం

నేటి రోజుల్లో ఆరోగ్యకరమైన ముఖం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. మార్కెట్లో కూడా అనేక రకాల ఉత్పత్తులు నేడు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని సులభంగా కొంటున్నారు. అందుకోసం కూడా వీటిని చాలా మంది ఉపయోగిస్తున్నారు. వీటిని వాడడం చాలా తేలిక అని అనేక మంది చర్మ నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇష్టారీతిన వాడడం కాకుండా ఏదైనా కొత్త క్రీం వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎవరికో పడింది కదా… […]

Share:

నేటి రోజుల్లో ఆరోగ్యకరమైన ముఖం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. మార్కెట్లో కూడా అనేక రకాల ఉత్పత్తులు నేడు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని సులభంగా కొంటున్నారు. అందుకోసం కూడా వీటిని చాలా మంది ఉపయోగిస్తున్నారు. వీటిని వాడడం చాలా తేలిక అని అనేక మంది చర్మ నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇష్టారీతిన వాడడం కాకుండా ఏదైనా కొత్త క్రీం వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎవరికో పడింది కదా… అని మనం ఇష్టారీతిన దానిని వాడడం మంచిది కాదు. కేవలం వైద్య నిపుణుల సలహా తీసుకుని ఆ మేరకు మాత్రమే దానిని ఉపయోగించాలి. చాలా మందికి వీటిని ఉపయోగించడం వలన మంచి ఫలితాలు వస్తుండడడంతో అనేక మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకోసమే మార్కెట్లో వీటిని తయారు చేసే కంపెనీలు పెరిగాయి. 

కొనే అవసరం లేకుండా… 

కెమికల్స్ తో తయారు చేసే సీరమ్స్ మరియు వాటిని ధర ఎక్కువ ఉన్న క్రీమ్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతుంటారు. కొన్ని కొన్ని రకాల చర్మ సౌందర్య ఉత్పత్తులకు చాలా ధర నిర్ణయిస్తారు. అందుకోసమే ఇటువంటి కాస్ట్లీ ప్రొడక్టులను కొనేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇలా వెనుకడుగు వేసే వారి కోసం ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ రెమెడీస్ చాలా వస్తున్నాయి. ఈ రెమెడీస్ వల్ల చాలా మంది ధర పెట్టలేని సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయలేని వారు వాటిని ఉపయోగిస్తూ లాభాలు పొందుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునే ఈ చిట్కాలంటే ఓ సారి లుక్కేస్తే… 

మన ముఖారవిందం పెరగడం కోసం ఫేస్ స్క్రబ్ లను ఉపయోగించాలి. ఈ ఫేస్ స్క్రబ్ లను ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సింపుల్ గా తయారు చేసుకునే ఫేస్ స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం.. 

తేనే మరియు వోట్మీల్ ఫేస్ స్క్రబ్.. 

ఈ ఫేస్ స్క్రబ్ ను ఉపయోగించి మనం ఫేస్ ను అందంగా తయారు చేసుకోవచ్చు.  అంతే కాకుండా వీటిని మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు 

  1. 2 టేబుల్ స్పూన్ల చుట్టిన ఓట్స్ 
  2. 1 టేబుల్ స్పూన్ తేనె
  3. 1 టీస్పూన్ సాదా పెరుగు

తయారు చేసే విధానం.. 

  1. మన ఇంట్లోని కిచెన్ లో ఉండే బ్లెండర్ ను ఉపయోగించి ఓట్స్ ను మొదట మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఆ తర్వాత ఒక గిన్నెలో, వోట్మీల్ పొడిని తేనె మరియు పెరుగుతో కలిపి చిక్కటి పేస్ట్ వచ్చేవరకు కలపాలి. 
  3. అనంతరం సున్నితమైన వృత్తాకార కదలికలను ఉపయోగించి, మీ తడి ముఖానికి మీరు మెత్తగా తయారు చేసిన స్క్రబ్‌ను వర్తింపజేయాలి. 
  4. ఈ స్క్రబ్ ను మొహం మీద 5-10 నిమిషాలు అలాగే ఉంచలి.  ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వలన మీరు మొహం మీద అప్లై చేసిన క్రీం మొత్తం పోతుంది. 

ఇలా చేయడం వలన వోట్మీల్ అనేది మీ చర్మాన్ని ఎక్స్‌ ఫోలియేట్ చేస్తుంది మరియు తద్వరా మీకు ఉపశమనం లభిస్తుంది. తేనె అనేది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కనుక మీ మొహానికి అది ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా పెరుగు అనేది మీ చర్మం యొక్క హైడ్రేషన్ మోతాదును పెంచుతుంది. 

బొప్పాయి మరియు తేనెతో చేసిన ఫేస్ స్క్రబ్

ఈ ఫేస్ స్క్రబ్ ను తయారు చేసేందుకు కావాల్సినవి

  1. రెండు టేబుల్ స్పూన్ల పండిన బొప్పాయి గుజ్జు 
  2. 1 టేబుల్ స్పూన్ చిక్కటి తేనె 

తయారు చేసే విధానం

  1.  పండిన బొప్పాయిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ లో వేయాలి. దానిని మెత్తగా గుజ్జుగా తయారు చేసుకోవాలి. 
  2. పచ్చి తేనె వేసి దానిని అందులో కలపాలి.
  3. మీ ముఖాన్ని సాధారణంగా ముందు నీటితో కడగాలి. మీ ఫేస్ ను శుభ్రంగా కడుకున్న తర్వాత మీరు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్ కు అప్లై చేయాలి. 
  4. ఆ క్రీమ్ అప్లై చేసేటపుడు మీ చేతి వేళ్లను చాలా కదిలించాలి. అప్పుడే ఆ క్రీమ్ మొత్తం మీ ఫేస్ కు అప్లై అవుతుంది. 
  5. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత 10-15 నిముషాలు దానిని అలాగే ఫేస్ మీద ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటిని ఉపయోగించి మీ ముఖాన్ని కడుక్కోండి. 

ఇలా అనేక రకాల స్క్రబ్స్ ను ఉపయోగించి మీరు మీ ఫేస్ ను ఈజీగా బాగు చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని వాడుకోవచ్చు. అరే ఇది మనం వాడితే ఏమైనా అవుతుందా? అనే భయం కూడా ఉండదు. కాబట్టి వైద్యులు కూడా వీటిని నిశ్చింతగా వాడుకోవచ్చునని సలహా ఇస్తున్నారు.