శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడే టాప్ 5 పుస్తకాలు ఇవే !

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్ప శెట్టి ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆమె తన అనుభవం మొత్తం రంగరించి, శరీర బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది ఈ పుస్తకం లో చాలా చక్కగా రాసి ఉంది. ఈ పుస్తకం లో ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ , నోరూరించే ఆరోగ్యకరమైన రెసిపీలు , సైన్స్ ద్వారా నిరూపించబడ్డ కొన్ని విషయాలను ఈ పుస్తకం లో పొందుపరిచింది. ఇది చదవి […]

Share:

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్ప శెట్టి ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆమె తన అనుభవం మొత్తం రంగరించి, శరీర బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది ఈ పుస్తకం లో చాలా చక్కగా రాసి ఉంది. ఈ పుస్తకం లో ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ , నోరూరించే ఆరోగ్యకరమైన రెసిపీలు , సైన్స్ ద్వారా నిరూపించబడ్డ కొన్ని విషయాలను ఈ పుస్తకం లో పొందుపరిచింది. ఇది చదవి తూచా తప్పకుండ ఫాలో అయితే మెరుగైనా ఫలితాలు ఉండొచ్చు.

2) ఏ టేస్ట్ ఆఫ్ వెల్ బీయింగ్ :

సద్గురు తన అనుభవం తో రాసిన పుస్తకం ఇది. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనకి ఒక్కొక్కరు ఒక్కో డైట్ ఫాలో అవ్వమని చెప్తుంటారు. మనకి ఏ డైట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాము. మీరు అలా అయ్యోమయ్యం పరిస్థితి లో పడితే వెంటనే ఈ పుస్తకం కొనుగోలు చేసి, ఇందులో ఉన్న డైటింగ్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి. న్యూట్రిషన్ తో నిండిన పదార్దాలతో తయారు చేసుకోగల కుకింగ్ టెక్నిక్స్ అన్నీ ఇందులో పొందుపరిచాడు సద్గురు. ఈ పుస్తకం చదివిన తర్వాత మీ అందరికీ ఎలాంటి ఆహరం తీసుకోవాలి, ఎలాంటి ఆహరం తీసుకోకూడదు అనే దానిపై స్పష్టమైన క్లారిటీ వస్తుంది.

3) లైఫ్ స్టైల్ డైట్ :

రోహిణి పాటిల్ రచించిన పుస్తకం ఇది. ఫిట్ గా ఉండడానికి కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, మనరోజు వారి జీవనశైలి ని కూడా ఒక సరైన పద్దతిలో అవలంబించుకోవడం. ఈ పుస్తకం లో మొత్తం మూడు ముఖ్యమైన విషయాల గురించి చర్చించబడింది. ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు టిప్స్, సరైన జీవన శైలి మరియు క్రమబద్దకరమైన డైటింగ్ ప్లాన్స్ గురించి ఈ పుస్తకం లో చాలా చక్కగా ప్రస్తావించింది. 

4) డోంట్ లాస్ యువర్ మైండ్..లాస్ యువర్ వెయిట్ :

రుజుతా డివెకర్ అనే ప్రముఖ న్యూట్రీషనిస్ట్ రాసిన ఈ పుస్తకం అత్యంత ప్రాచుర్యం చెందింది. ఈ పుస్తకం లో ప్రాక్టికల్ గా నిరూపించబడ్డ అద్భుతమైన టెక్నిక్స్ తో నింపబడింది. ఇందులో మన శరీరం ని అదుపు చేసుకోవడం ఎలా, ఇష్టమైన కొవ్వు పదార్దాలను మనకి తెలియకుండానే ఇష్టంతో తినేస్తూ ఉంటాము, దానిని నియంత్రించుకోవడం ఇలా, ఏది తింటే ఆరోగ్యం, ఏది తినకపోతే మంచిది, ఇలాంటివన్నీ ఆమె తన అనుభవం లో ప్రాక్టికల్ జ్ఞానం ని పోందుపర్చింది.

5) మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్ : 62 లైఫ్ స్టైల్ చేంజెస్ 

ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరియు ల్యూక్ కౌంటిహో తమ అనుభవాలతో రాసిన పుస్తకం ఇది. కేవలం డైటింగ్ తో మాత్రమే కాదు, మన జీవన శైలి లో మార్చుకోవడం వల్ల కూడా చాలా బరువు తగ్గుతాము అని ఎంతో విలువైన 62 సూత్రాలను ఈ బుక్ లో వివరించారు. మన జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చెయ్యడం వల్ల ఎంతో బరువు తగ్గుతామట. మరి ఆ మార్పులు ఏమిటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ బుక్ కోనేయండి.