టాప్ 4 బెస్ట్ హెయిర్ ప్రొడ‌క్ట్స్

ఆడవాళ్లకు ముఖ సౌందర్యం మరియు స్కిన్ టోన్ ఎంత ముఖ్యమో, అందమైన జుట్టు కూడా అంతే ముఖ్యం. ముఖం సౌందర్యం మీద వాళ్ళు ఎంత ప్రత్యేకత జాగ్రత్తలు చూపిస్తారో, కురులను అందం గా ఉంచుకోవడం లో కూడా అంతే శ్రద్ద చూపిస్తుంటారు. అయితే ఆడవాళ్లకు జుట్టు గజిబిజిగా చిక్కుకోవడం అనేది పెద్ద సమస్య అనే సంగతి తెలిసింది. తెల్లవారు జామున వాళ్ళు నిద్ర లెయ్యగానే దువ్వెన తీసుకొని గజిబిజిగా మారిన తమ జుట్టుని సర్దుకోవడానికి పెద్ద యుద్ధాలే […]

Share:

ఆడవాళ్లకు ముఖ సౌందర్యం మరియు స్కిన్ టోన్ ఎంత ముఖ్యమో, అందమైన జుట్టు కూడా అంతే ముఖ్యం. ముఖం సౌందర్యం మీద వాళ్ళు ఎంత ప్రత్యేకత జాగ్రత్తలు చూపిస్తారో, కురులను అందం గా ఉంచుకోవడం లో కూడా అంతే శ్రద్ద చూపిస్తుంటారు. అయితే ఆడవాళ్లకు జుట్టు గజిబిజిగా చిక్కుకోవడం అనేది పెద్ద సమస్య అనే సంగతి తెలిసింది. తెల్లవారు జామున వాళ్ళు నిద్ర లెయ్యగానే దువ్వెన తీసుకొని గజిబిజిగా మారిన తమ జుట్టుని సర్దుకోవడానికి పెద్ద యుద్ధాలే చేస్తారు. చిక్కుముడి దువ్వెన తో చెరపాలంటే చాలా కష్టపడాలి. మొత్తం మీద ఎంతో శ్రమపడి చిక్కుముడులు మొత్తం విప్పుకొని జుట్టు సరిచేసుకున్న తర్వాత ఒక్కసారి దువ్వెన వైపు చూస్తే, జుట్టు దువ్వెనకి ఇరుక్కుందా, లేదా దువ్వెనకి జుట్టు మొలిచిందా అని అనిపించక తప్పదు. అందుకే జుట్టుని స్మూత్ గా ఉండేలా ఆడవాళ్ళూ ఎన్నో సీరమ్స్, హెయిర్ ఆయిల్స్ మరియు కండీషనర్స్ ని వాడుతూ ఉంటారు. అయితే ఏది పడితే వాడడం మంచిది కాదు, కొన్ని సార్లు అవి సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి, జుట్టు మొత్తం గుట్టలు గుట్టలు గా రాలిపొయ్యే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్లు సూచించిన సీరమ్స్ ని మాత్రమే వాడాలి. అలా మంచి ఫలితాలను అందచేసిన కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

1) ష్వార్జ్ కోప్ ప్రొఫెషనల్ ఓసిస్ మ్యాజిక్ యాంటీ ఫ్రిజ్ షైన్ సీరమ్ (50 ML):

ష్వార్జ్ కోప్ ప్రాడక్ట్స్ నుండి వచ్చిన ఈ సీరమ్ కస్టమర్స్ నుండి అద్భుతమైన రివ్యూస్ ని దక్కించుకున్న టాప్ 1 ప్రోడక్ట్ గా చరిత్ర సృష్టించింది. ఎవరైతే తమ జుట్టు వికృతంగా ఉందని బాధపడుతూ ఉన్నారో, వాళ్ళు వెంటనే ఈ సీరమ్ వాడండి. ఇసుమంత జిడ్డు కూడా లేకుండా నిగనిగలాడే అందమైన , మృదువైన జుట్టుగా మారుస్తుంది ఈ సీరమ్ . ఇందులో వాడిన సిలికోన్ మరియు గ్లిసరిన్ వల్ల  ఈ సీరమ్ కి అలాంటి స్వభావం దక్కింది. ఈ సీరమ్ అమెజాన్ లో అందుబాటులో ఉంది, దీని ధర కేవలం 860 రూపాయిలు మాత్రమే.

2) మ్యాట్రిక్స్ ఆప్టి కేర్ ప్రొఫెషినల్ యాంటీ ఫ్రిజ్ కిట్ :

మ్యాట్రిక్స్ సంస్థ నుండి వచ్చిన ఈ కిట్ ఒక చిన్న సైజు సలోన్ అనే చెప్పాలి. ఇందులో ఉండే షాంపూ, సీరమ్  మరియు హెయిర్ కండీషనర్ ని షియా వెన్న తో తయారీ చేయబడినది.  హెయిర్ కి షైనింగ్ పెంచేందుకు, జుట్టుని స్ట్రైట్ గా మరియు స్మూత్ గా ఉంచేందుకు రకరకాల సీరమ్స్ ని వాడే అవసరం లేకుండా, ఒక సింగల్ పరిష్కారం లాగ ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా అమెజాన్ లో అందుబాటులో ఉన్నది, దీని ధర 1035 రూపాయిలు మాత్రమే .

3) ఎస్టీ బొటానికా జీవో యాంటీ ఫ్రిజ్ హెయిర్ మాస్క్ (200 ML ):

200 ML గల ఈ సీరమ్ మిశ్రమాన్ని కొబ్బరి నూనె, షియా వెన్న మరియు కెరిటాన్ తో తయారు చేసారు. ఈ సీరమ్ వాడడం వల్ల జుట్టు చాలా మృదువుగా మారడమే కాకుండా, చాలా పటిష్టమైన బలంగా కూడా జుట్టుని మారుస్తుంది. ఇది కేవలం 598 రూపాయలకు అమెజాన్ లో అందుబాటులో ఉంది. 

4)  హెర్బల్ అస్సెన్స్ అర్గాన్ ఆయిల్ ఆఫ్ మొరక్కో కండీషనర్ :

ఈ కండీషనర్ లో పేరాబాన్ మరియు కొలొరెంట్ వంటి పదార్దాల నుండి దూరం గా ఉంటుంది. ఈ మిశ్రమం మొత్తం అర్గాన్ ఆయిల్ అఫ్ మొరక్కో తో తయారు చేయబడినది. ఇది కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది, దీని ధర కేవలం 487 రూపాయిలు మాత్రమే.

ఈ నాలుగు సీరమ్స్ కూడా మంచివే కానీ, కస్టమర్స్ నుండి అత్యధిక పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకున్న సీరం మాత్రం మ్యాట్రిక్స్ ఆప్టి కేర్ ప్రొఫెషినల్ యాంటీ ఫ్రిజ్ కిట్, ఆలస్యం చెయ్యకుండా వెంటనే కోనేయండి.