ఈ చిట్కాలతో చిటికెలో పంటినొప్పి నుంచి ఉపశమనం

పంటి నొప్పి ఈ మాట వినగానే చాలామందికి నొప్పి మొదలయినంత పనవుతుంది. ఎందుకంటే పంటి నొప్పి బాధ అంత అధికంగా ఉంటుంది కాబట్టి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ పంటి నొప్పి బారిన పడిన వారే. అయితే పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించేందుకు ఈరోజు కొన్ని ఆయుర్వేద చిట్కాలు చూసేద్దాం..  ఉసిరికాయ:  ఉసిరికాయ అనేది ముఖ్యంగా టిష్యూస్ బలంగా మారడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే నోటి […]

Share:

పంటి నొప్పి ఈ మాట వినగానే చాలామందికి నొప్పి మొదలయినంత పనవుతుంది. ఎందుకంటే పంటి నొప్పి బాధ అంత అధికంగా ఉంటుంది కాబట్టి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ పంటి నొప్పి బారిన పడిన వారే. అయితే పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించేందుకు ఈరోజు కొన్ని ఆయుర్వేద చిట్కాలు చూసేద్దాం.. 

ఉసిరికాయ: 

ఉసిరికాయ అనేది ముఖ్యంగా టిష్యూస్ బలంగా మారడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే నోటి దుర్వాసనను, క్రిముల బారిన పడకుండా పళ్ళను రక్షిస్తుంది. ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మన పళ్ళను రక్షించుకోవడానికి రోజు ఒక ఉసిరికాయ తిన్నసరిపోతుంది. ఉసిరికాయలో ఉండే ఎన్నో పోషక ఆహారాలు మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

లవంగాలు: 

ఈ లవంగం, పంటి దుర్వాసనను దూరం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ లవంగాలలో ఉండే మంచి గుణం, పళ్ళు చిగుళ్ళను బాగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా తక్షణ ఉపశమనం అందిస్తుంది. పళ్ళ నరాలను సెన్సిటివ్ అవ్వకుండా చూసుకుంటుంది. ప్రతిరోజు ఒక లవంగం మొగ్గ నోట్లో వేసుకొని నవల గలిగితే అందులో ఉండే పోషక విలువలు పల్లలోని పాడైన చోటుని బాగుపరుస్తాయి. 

వీట్ గ్రాస్: 

ప్రతిరోజూ వీట్ గ్రాస్ అంటే గోధుమ ల నుంచి వచ్చే మొలకలతో కూడిన పచ్చ గడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొద్దున్నే లేవగానే ఈ వీట్ గ్రాస్ శరీరంలో ఆహారం ద్వారా గాని, ముఖ్యంగా జ్యూస్ గానే తీసుకుంటే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, పళ్ళు పుచ్చిపోకుండా కూడా ఉపయోగపడుతుంది వీట్ గ్రాస్. ప్రత్యేకించి వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల, మన శరీరంలో డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటాయని తేలింది. 

పసుపు: 

పసుపులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గాయాలకు పసుపు రాయడం వల్ల త్వరగా మానుతాయి కూడా. ఆవాల నూనెలో మెత్తగా పొడి చేసిన పసుపు కలిపి, పేస్ట్ లా చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది చిగుళ్ళను పాడవకుండా కాపాడుతాయి, పంటి నొప్పిని తగ్గిస్తుంది. మెత్తగా పొడి చేసిన పసుపును ఆవాల నూనెతో కలిపి పేస్ట్‌లా చేయాలి. పడుకునే ముందు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 

ఆరోగ్యకరమైన దంతాల కోసం:

మనం తీసుకునే ఆహారం ముందుగా నోటి ద్వారానే లోపలికి వెళుతుంది, ముఖ్యంగా ఆహారాన్ని నమిలే విషయంలో దంతాలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఒకవేళ దంతాలు అనారోగ్యంగా ఉన్నట్లయితే మన తీసుకునే ఆహారం కూడా అనారోగ్యంగా మారుతుంది. అవునండి మీరు విన్నది నిజమే, దంతాల అనారోగ్యం అంటే, దంతాలలో ఉండే క్రిములు, కీటకాలు. దంతాలు అనారోగ్యంగా ఉన్నాయి అనే చెప్పడానికి, దంతాలు పసుపు రంగులో మారడమే ఒక సింటం.

ముఖ్యంగా, దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారాలంటే తప్పనిసరిగా క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో లో క్యాల్షియం అనేది అధికమవుతుంది. క్యాల్షియం అనేదే మన ఎముకలకే కాకుండా పల్లకి కూడా ఎంత ఆరోగ్యం అందిస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి.