మానసిక ఒత్తిడి నుంచి బయట పడటం ఎలా..?

ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము. కొందరేమో ఒత్తిడిని ఊతపదంగా వాడుతూ చిన్న చిన్న విషయాలకే సాకుగా చూపుతోంటే మరికొందరేమో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ కూడా అది ఉన్నట్లు గుర్తించలేకపోతున్నారని అంటారు మానసిక వైద్య నిపుణులు. మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ మనలో ప్రతిఒక్కరూ డేటుడే స్ట్రెస్ కు విపరీతంగా లోనవుతూ అసంతృప్తిగా జీవనం […]

Share:

ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము. కొందరేమో ఒత్తిడిని ఊతపదంగా వాడుతూ చిన్న చిన్న విషయాలకే సాకుగా చూపుతోంటే మరికొందరేమో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ కూడా అది ఉన్నట్లు గుర్తించలేకపోతున్నారని అంటారు మానసిక వైద్య నిపుణులు. మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ మనలో ప్రతిఒక్కరూ డేటుడే స్ట్రెస్ కు విపరీతంగా లోనవుతూ అసంతృప్తిగా జీవనం గడుపుతున్నారు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటే శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా తమ విధులు అవి నిర్వహిస్తాయి. కాబట్టి మీ మనసును వీలైనంత కూల్ గా ఉంచుకునే ప్రయత్నాన్నిమీరు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి.

ఇందుకు మీరు రెండు మార్గాలను అనుసరించటం అత్యుత్తమ మార్గం. ఒకటి మీరు ఫిజికల్ యాక్టివిటీ పరంగా, తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు యోగా వంటి మనసుకు సంబంధించినవి ప్రయత్నించాలి. మీ ఇమ్యూన్ సిస్టంను విధ్వంసం చేసే స్ట్రెస్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి, బరువు పెరుగుతారు, జీఐ సమస్యలు రావటం, హైపర్ టెన్షన్, అతిగా తినటం లేదా అస్సలు తినకపోవటం వంటి విపరీతమైన ప్రవర్తన మీలో ఉందంటే మీకు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం చేసుకుని జాగ్రత్త పడండి.

సహజసిద్ధంగా స్ట్రెస్ ను జయించేందుకు అనుసరించే మార్గాలు చాలా ఉన్నప్పటికీ పోషకాలు మెండుగా ఉన్న మంచి సాత్విక ఆహారం ఎంజాయ్ చేయటం కూడా స్ట్రెస్ కు అతిపెద్ద విరుగుడన్న విషయం మీకు తెలుసా.. జీవితాన్ని బాగా ఆస్వాదించే వారికి ఒత్తిడి దరిదాపుల్లో కూడా కనిపించదు. కాబట్టి మీరున్న ఆర్థిక, సామాజిక స్థితి గతులు ఏవైనా వాటన్నింటినీ మీరు అనుక్షణం ఎంజాయ్ చేస్తే ఒత్తిడిని మీరు ఆదిలోనే జయించినట్టు.. స్ట్రెస్ ను శాశ్వతంగా అధిగమించే చిట్కా కూడా ఇదొక్కటే. 

అతిగా ఆలోచించకుండా, ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉంటూ, మీరు సాధించాలన్నదాన్ని ప్రణాళికా బద్ధంగా సర్వ శక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తూ మీ గమ్యాన్ని చేరండి అంతేకానీ హైరానా పడిపోతే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. గాబరా పడి, టెన్షన్ పడుతూ ఉంటూ మీ టార్గెట్ చేరటంలో ఇలాంటి ఆటంకాలన్నీ వచ్చి కూర్చుంటాయి. మీ దినచర్యలో హెల్తీ రొటీన్ ను అనుసరించేలా మార్పుచేర్పులు చేసుకుని కొన్ని రోజులపాటు మీ ఆరోగ్యం, మీ వృత్తిలో వచ్చిన మార్పులు గమనించండి.

విశ్రాంతి లేకుండా పనులు చేయడం:

ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పనులు చేయడం, అలాగే వివిధ పరిశ్రమల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి జయించవచ్చు.

ధ్యానం..

మనసుకు మందు, మెదడుకు రిలాక్సేషన్ ఇచ్చే ఏకైక సాధనం ధ్యానం మాత్రమే. అందుకే మన పూర్వికులు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నారు. బిజీ లైఫ్ లో మనం ధ్యానం కోసం కొన్ని నిమిషాల సమయాన్ని వెచ్చించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది. ఉచ్వాస, నిశ్వాసాలపై మనుసును ఏకాగ్రం చేస్తూ కొద్దిసేపు మీకోసం మీరు సమయం వెచ్చించుకుంటే చాలని వైద్యులంతా సూచిస్తున్నారు.

ఎక్కువ ఆలోచించడం:

అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కంటి నిండా నిద్ర..

కంటి నిండా నిద్రలేక కొందరికి స్ట్రెస్ పెరిగితే, స్ట్రెస్ వల్ల నిద్రలేమి పాలయ్యేవారు మరికొందరు. నిద్ర, స్ట్రెస్ రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. లోకాభిరామాయణం, సమస్యలు అన్నీ పక్కనపెట్టి.. చిన్న పిల్లల్లా ప్రశాంతంగా పడుకుని చూడండి.. మరుసటి రోజు మీరు ఎంత హుషారుగా, ఒత్తిడి లేకుండా ఫీల్ అవుతారో మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు రాత్రి డీప్ స్లీప్ లేకపోతే మధ్యహ్నం పవర్ న్యాప్ వేయండి ఇందులో తప్పులేదు. కనీసం అరగంట మంచి కునుకు తీస్తే మీరు ఒత్తిడికి దూరంగా ఉండచ్చు.

మ్యూజిక్..

సంగీతం ప్రాక్టీస్ చేయటం, సంగీతం వినటంతో స్ట్రెస్ ను జయించవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కు ఎలాగూ నెట్ కనెక్షన్ ఉందిగా.. శ్రావ్యమైన సంగీతాన్ని కొన్నిక్షణాలపాటు హ్యాపీగా వినండి. స్ట్రెస్ దానికదే పోతుంది. మీకు పియానో, గిటార్, తబలా ఇలా ఏవైనా ఇష్టమైన వ్యాపకాలుంటే వాటిపై మీ ఫోకస్ పెట్టండి.

నలుగురితో కలిసి..

ఒంటరిగా ప్రయాణం చేస్తే జీవితంలో త్వరగా అలసట వస్తుంది. మీరు నలుగురిలో ఉన్నప్పటికీ ఒంటరిననే భావన వదిలేసి..చక్కగా అందరితో మాట కలిపి కలిసిపోండి.. ఎంత మంచి స్ట్రెస్ బస్టరో ఇది అని మీరే ఫీల్ అవుతారు. గలగలా, సందడిగా మనం గుంపులో కలిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో. మన సమస్యలన్నీ ఫట్ మని ఎగిరిపోయినట్టు మీ వ్యక్తిగత విషయాలను కాసేపు మరిచిపోయేలా ఇది చేస్తుంది. ఆఫీసు, ఇంట్లో మీరు అందరితో చక్కగా కలిసిపోతే సరి. మనిషి సోషల్ అనిమల్ కాబట్టి.. అందరితో కలిసి ఉంటే మానసికంగా దృఢంగా ఉన్నామనే భావన వస్తుంది. మీకు నచ్చిన వారితో గెట్ టుగెదర్ లు ఎంజాయ్ చేయండి.

లైఫ్ స్టైల్ మార్పులు..

అతిగా ఇంటర్నెట్ లో గడపటం కూడా ఒత్తిడికి కారణం. కాబట్టి లైఫ్ స్టైల్స్ లో మార్పులు అవసరం. ఎప్పుడూ యూట్యూబ్, ఓటీటీల్లో వీడియో కంటెంట్ చూడటం, ఆన్ లైన్ షాపింగ్, వాట్సప్ చాటింగ్ వంటివి రేయింబవళ్లు చేసేవారు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి ఒత్తిడిని పారద్రోలాలంటే డిజిటల్ డీటాక్స్ మీకు చక్కగా పనిచేస్తుంది.