చలికాలంలో కళ్ళను కాపాడుకోండిలా.. 

చలికాలం మొదలైందంటే, మన కళ్ల గురించి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని అర్థం. ముఖ్యంగా చలికాలంలో పొడిబారిపోయే చర్మంతో పాటుగా కళ్ళు కూడా పొడిబారడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు మనల్ని కలవర పెడుతూ ఉంటాయి కదా.  కళ్ళు మంటలు:  చలికాలంలో చాలా మంది వెచ్చగా ఉండటానికి ఇంట్లోనే ఉంటూ వేడిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆరు బయట మంట వేసుకొని కూర్చుంటారు. ఈ క్రమంలోనే కళ్ళకు తగిన తేమ లేకపోవడం వల్ల పొడిబారిపోతూ […]

Share:

చలికాలం మొదలైందంటే, మన కళ్ల గురించి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని అర్థం. ముఖ్యంగా చలికాలంలో పొడిబారిపోయే చర్మంతో పాటుగా కళ్ళు కూడా పొడిబారడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు మనల్ని కలవర పెడుతూ ఉంటాయి కదా. 

కళ్ళు మంటలు: 

చలికాలంలో చాలా మంది వెచ్చగా ఉండటానికి ఇంట్లోనే ఉంటూ వేడిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆరు బయట మంట వేసుకొని కూర్చుంటారు. ఈ క్రమంలోనే కళ్ళకు తగిన తేమ లేకపోవడం వల్ల పొడిబారిపోతూ అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. పొడిబారిపోవడం వల్ల కళ్ల మంటలు, దురద వంటివి కామన్ గా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండేందుకు ముఖ్యంగా.. దురద కారణంగా ఆస్తమాను కళ్ళల్లో చేతులు పెట్టుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం లేకపోలేదు.

తగిన నీళ్లు తాగండి: 

ఎక్కువ శాతం నీళ్లు తాగడం అనేది చలికాలంలో తక్కువగా జరిగే పని కదా. కానీ ముఖ్యంగా చలికాలంలో మాత్రమే మనం ఎక్కువ నీళ్లు తాగాలని గుర్తుంచుకోవాలి. మన శరీరం హైడ్రేట్ అవ్వాలి, దానికోసం తగినన్ని నీళ్లు క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. ఇలా తాగకపోవడం వల్ల కూడా మన శరీరంలో తేమశాతం తగ్గిపోయి, చర్మం పొడి బారడమే కాకుండా కళ్ళు కూడా పొడిబారి దురద పుడుతూ ఉంటుంది. అస్తమానం చేతులనేవి కళ్ళల్లో పెట్టుకోవడం వల్ల, లేనిపోని అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. తప్పకుండా మన కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీళ్లు క్రమం తప్పకుండా తాగాలి.

పరిశుభ్రత ముఖ్యం: 

కళ్ళకు తగిన తేమ లేకపోవడం వల్ల పొడిబారిపోతూ అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. తరచుగా మన చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం ఎక్కువగా మన చేతుల్ని కళ్ళల్లోకి పెట్టకుండా ఉంచుకోగలగాలి. ఎందుకంటే ఒకవేళ మన చేతులకు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నప్పటికీ మన కళ్ళల్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ స్వీయ పరిశుభ్రత ఎంతో ముఖ్యం. 

ముఖం అదేవిధంగా కళ్ళు ముట్టుకోకండి: 

మనలో చాలామందికి ఉన్న అలవాటే ఇది. మనం పని చేస్తున్నప్పుడు గాని, వంట చేస్తున్నప్పుడు గాని, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు గాని ఇలా చాలాసార్లు మనం మనకి తెలియకుండానే మన చేతుల్లో మన ముఖం మీద అలాగే మన కళ్ళల్లో పెడుతూ ఉంటాం. ఇలాంటి అలవాటు మనం మానుకోగలగాలి. ఎందుకంటే మనం ముఖం మన కళ్ళు మన శరీరంలో చాలా సెన్సిటివ్. మనం పనులు చేతులతో చేసిన తర్వాత ఆ చేతులు మనం ముఖం మీద పెట్టుకోవడం ద్వారా కూడా బ్యాక్టీరియా అలాగే వైరస్ అనేవి కళ్ళల్లోకి వెళ్లి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటు మానుకోగలగాలి. 

పొడిబారకుండా డ్రాప్స్ వాడండి: 

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సిస్టం ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం ద్వారా పని ఒత్తిడి కారణంగా కళ్ళు స్ట్రెస్ అవుతున్నాయని కళ్ళకు సంబంధించిన డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. కళ్ళు మంటలు కారణంగా డ్రాప్స్ వాడటం కామన్. కానీ మనం ఒక్కసారి దాని ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయినప్పటికీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. కానీ కళ్ళ విషయంలో ఎలాంటి పొరపాటు చేయడం చాలా తప్పు. అందుకనే మనం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కళ్ళ డ్రాప్స్ వాడడం ద్వారా కూడా కళ్ళకు హాని కలిగే అవకాశం ఉంటుంది. 

ఇలాంటివి తప్పనిసరి: 

మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటాము. కళ్ళజోడు, ఐ డ్రాప్స్, కాస్మెటిక్స్, టవల్స్, ఇలా మరెన్నో ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇటువంటి వస్తువులు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా వారి ద్వారా బ్యాక్టీరియా అనేది మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. కళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి, కళ్లకు సంబంధించిన బ్యాక్టీరియా మరింత త్వరగా ఒకరి నుంచి మరొకరికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి తప్పని సరి చేసుకోండి.