వర్షాకాలంలో యూరినరీ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండి

వర్షాకాలం మొదలైంది అంటే చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దగ్గు, జ్వరం, రొంప ఇలా ఎన్నో వర్షాకాలంలో సోకుతూ ఉంటాయి. వీటితోపాటు చాలామంది యూరినరీ ఇన్ఫెక్షన్లబారిన కూడా ఈ వర్షాకాలంలో తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, వర్షాకాలంలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం చాలా ఉత్తమం. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నప్పటికి, రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే, రోగాల నుంచి సులభంగా తప్పించుకుంటాం.  యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా […]

Share:

వర్షాకాలం మొదలైంది అంటే చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దగ్గు, జ్వరం, రొంప ఇలా ఎన్నో వర్షాకాలంలో సోకుతూ ఉంటాయి. వీటితోపాటు చాలామంది యూరినరీ ఇన్ఫెక్షన్లబారిన కూడా ఈ వర్షాకాలంలో తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, వర్షాకాలంలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం చాలా ఉత్తమం. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నప్పటికి, రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే, రోగాల నుంచి సులభంగా తప్పించుకుంటాం. 

యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే..: 

వర్షాకాలంలో ఎక్కువగా వాతావరణం లో చెడు బ్యాక్టీరియా పెరుగుదల అధికంగా ఉంటుంది. అయితే పూనేలో ఉన్న అంకుర హాస్పిటల్కు సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ ప్రత్యేకించి ఈ యూరినల్ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్షాకాలంలో బయటికి వెళ్లిన సందర్భాలలో మనం ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా బయటికి వర్షాకాలంలో వెళ్లిన సందర్భాలలో వాష్రూమ్ యూస్ చేసిన సందర్భాలలో ఈ బ్యాక్టీరియా అనేది యూరినరీ ట్రాక్ ద్వారా ఎంటర్ అయ్యి యూరినల్ ఇన్ఫెక్షన్ గల కారణాలు అవుతుంటాయి. 

యూరినరీ ఇన్ఫెక్షన్ ముందుగా గమనించడం ఎలా?: 

అయితే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి వాష్ రూమ్ కి వెళ్ళిన సందర్భాలలో నొప్పి సంభవించడం, యూరిన్ డార్క్ కలర్ లో మారడం, చెడు వాసన రావడం, హఠాత్తుగా వాంతులు, విరోచనాలు అవడంతో పాటుగా, జ్వరం హఠాత్తుగా రావడం వంటివి జరుగుతుంది. ఇలాంటివి సంభవించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో ఉత్తమమైన మార్గం. ముందుగా ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే, మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువగా మారి కిడ్నీ ఫెయిల్యూర్ కి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. 

యూరినరీ ఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పకుండా నీరు తాగడం, కాఫీ, కూల్డ్రింక్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండడం, ఆయిల్ ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం, యూరిన్ వస్తున్నప్పటికీ ఎక్కువ సేపు ఆపుకోవడం, ఇలాంటివి మనలో గనక ఉంటే తప్పకుండా అనారోగ్య సమస్య తలెత్తి అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

అన్నింటికీ సొల్యూషన్ రోగనిరోధక శక్తి: 

మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే జలుబు, రొంప, దగ్గు, కళ్ళు కలకలు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవడం జరుగుతుంది. మరి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా పోషకాలతో నిండి ఉండే, రోగనిరోధక శక్తి పెంచే రకరకాల విటమిన్లు తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎంతో లాభం ఉండటమే కాకుండా అనారోగ్యానికి దూరంగా ఉంటాం. మరి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే చక్కనైన ఆరోగ్యం మన సొంతమవ్వాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకోవాల్సిందే..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది, ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి పనిచేస్తుంది. క్యారెట్లు, చిలగడదుంపలు మరియు బచ్చలికూర వంటి ఆహారాలు విటమిన్ ఎ యొక్క అద్భుతమైన మూలాలు.