పండుగ‌ల‌  సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి

పండుగ సమయంలో అధిక మొత్తంలో రుచికరమైన ఆహారం తినడం ప్రతి ఒక్కరు చేసేదే. కానీ ముఖ్యంగా, పండుగ సమయంలో స్వీట్స్ ప్రత్యేకమైన ఆకర్షణ. కానీ చాలామంది పండుగలో కూడా, మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు దానికి ముఖ్యమైన కారణం, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అని ఆలోచించుకోవడం.. అంటే ఇప్పుడు చెప్పబోయే చక్కని చిట్కాలు.. పండుగ సమయంలో మంచి ఆహారాన్ని ఆస్వాదించేందుకు సహాయపడడమే కాకుండా.. మీ శరీరంలో ఉండే బ్లడ్ షుగర్ ని […]

Share:

పండుగ సమయంలో అధిక మొత్తంలో రుచికరమైన ఆహారం తినడం ప్రతి ఒక్కరు చేసేదే. కానీ ముఖ్యంగా, పండుగ సమయంలో స్వీట్స్ ప్రత్యేకమైన ఆకర్షణ. కానీ చాలామంది పండుగలో కూడా, మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు దానికి ముఖ్యమైన కారణం, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అని ఆలోచించుకోవడం.. అంటే ఇప్పుడు చెప్పబోయే చక్కని చిట్కాలు.. పండుగ సమయంలో మంచి ఆహారాన్ని ఆస్వాదించేందుకు సహాయపడడమే కాకుండా.. మీ శరీరంలో ఉండే బ్లడ్ షుగర్ ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

బ్యాలెన్స్ చేసుకోండి: 

ముఖ్యంగా ఆహార విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. మీరు అప్పుడప్పుడు తృప్తికరమైన భోజనాన్ని ఆస్వాదించొచ్చు.. కానీ కొన్ని పండుగ రోజుల తర్వాత మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మళ్లీ పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఈ విధానం షుగర్ లెవల్స్‌ లో అధికంగా వచ్చిన మార్పులను నివారిస్తుంది, ఎందుకంటే ఒకేసారి వచ్చిన మార్పు అధిక బరువుకి కారణం అవ్వచ్చు.

మైండ్‌ఫుల్ భోజన ప్రణాళిక: 

అధిక-కార్బ్, అధిక-చక్కెరతో ఉన్న ఆహార పదార్థాలను ముందుగానే అంచనా వేయండి, అయితే మీరు రోజులో తీసుకునే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకుంటే తప్పకుండా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను సరైన కంట్రోల్లో ఉంచేందుకు, భోజనానికి ముందు మరియు తర్వాత ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ అదే విధంగా కొన్ని కూరగాయలను తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా, మీరు మంచి భోజనం చేసామనే తృప్తి మిగులుస్తుంది.

తయారీ మరియు రికవరీ: 

పండుగ కార్యక్రమాలకు ముందు మరియు తర్వాత మీరు చేసే పనులపై శ్రద్ధ వహించండి. వ్యాయామం చేసే ముందు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన జీర్ణశక్తి పెంపొందించుకునే వాళ్ళం అవుతాము. అయితే పండుగలు తర్వాత, మీ రెగ్యులర్ రొటీన్‌కు వేగంగా తిరిగి వెళ్లి, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ చేసుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తిరిగి రికవరీ అవ్వడానికి, ప్రత్యెక్కించి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కి ప్రాధాన్యతనివ్వండి.

బ్యాలెన్స్ షుగర్: 

ప్రత్యేకించి పండుగలు అంటేనే, ప్రత్యేకమైన స్వీట్స్ తినేందుకు చక్కని అవకాశం. అయితే మీరు రోజుల్లో ప్రత్యేకించి స్వీట్స్ తినేందుకు ప్రాధాన్యత చూపించినప్పటికీ, మీ శరీరంలో మాత్రం షుగర్ ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఒకేసారి అధికంగా స్వీట్ తినడం కూడా మంచిది కాదు. మీ పండుగ సమయంలో స్వీట్స్ తింటూ ఆస్వాదించండి. కానీ, బ్యాలెన్స్ చేయడం మర్చిపోకండి.

స్మార్ట్ ఆప్షన్స్: 

అయితే పండుగ సమయంలో అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మామూలు విషయమే. కాకపోతే షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. స్మార్ట్ గా ఆలోచించి షుగర్ ఫ్రీ స్వీట్స్ తినేందుకు ప్రియరిటీ ఇవ్వండి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి స్మార్ట్ గా ఆలోచించండి. 

శరీర శ్రమ అవసరం: 

మనం అధికంగా మన శరీరంలోకి షుగర్ లెవెల్స్ అధికంగా పంపిస్తున్నామని మనం గ్రహించిన వెంటనే, మనం కంట్రోల్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు ముఖ్యంగా శరీర శ్రమ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం శరీర శ్రమ ఇవ్వకపోతే, మన బ్లడ్ లో షుగర్ అధికంగా నిల్వ ఉండిపోతుంది. కార్బోహైడ్రేట్స్ మన శరీరంలో బర్న్ చేసుకోవడానికి శరీర శ్రమ ఎంతో అవసరం.