టాక్సిక్ రిలేష‌న్‌షిప్స్ నుంచి ఇలా బయటపడండి..

సినిమాల్లో, పుస్తకాల్లో చాలామంది అనుకోని రిలేష‌న్‌షిప్స్ కారణంగా బాధపడడం, చివరికి తమ జీవితాలను త్యాగం చేయడం వంటివి చూస్తూనే ఉంటాము. కానీ అది నిజ జీవితానికి వచ్చేసరికి చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుభవించే ఉంటారు. అయితే ఈరోజు ఇటువంటి టాక్సిక్ రిలేషన్లకు ఎలా దూరంగా ఉండాలో.. అటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..  మనసు ప్రశాంతంగా ఉండేందుకు చక్కని చిట్కాలు:  టాక్సిక్ రిలేషన్లకు చాలామంది బలైపోతున్న క్రమం కనిపిస్తోంది. మన అనుకునే వ్యక్తి […]

Share:

సినిమాల్లో, పుస్తకాల్లో చాలామంది అనుకోని రిలేష‌న్‌షిప్స్ కారణంగా బాధపడడం, చివరికి తమ జీవితాలను త్యాగం చేయడం వంటివి చూస్తూనే ఉంటాము. కానీ అది నిజ జీవితానికి వచ్చేసరికి చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుభవించే ఉంటారు. అయితే ఈరోజు ఇటువంటి టాక్సిక్ రిలేషన్లకు ఎలా దూరంగా ఉండాలో.. అటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.. 

మనసు ప్రశాంతంగా ఉండేందుకు చక్కని చిట్కాలు: 

టాక్సిక్ రిలేషన్లకు చాలామంది బలైపోతున్న క్రమం కనిపిస్తోంది. మన అనుకునే వ్యక్తి నుంచి మనకి సరైన ప్రేమ లభించకపోవడం, సపోర్ట్ దొరకకపోవడం, ఇలా ఇరుక్కుపోయాం ఏంటా అంటూ మనసులో భావన కలగడం, మిస్ అండర్స్టాండింగ్ ముఖ్యంగా కనిపించడం, మనల్ని తక్కువ చేసి మాట్లాడటం వంటివి కనిపిస్తూ ఉంటాయి టాక్సిక్ రిలేషన్లలో. 

మిమ్మల్ని మీరు అనుమానించడం, జరిగిన వాటికి మీరే కారణం అంటూ విశ్వసించడం, అది జరగడానికి మీరే కారణమంటూ మిమ్మల్ని మీరు నిందించుకోవడం.. అన్నీ టాక్సిక్ రిలేషన్లకు సంకేతాలు. అయితే చాలా మంది ముందుగానే ఇటువంటి రిలేషన్ల గురించి తెలుసుకోకపోవడం సాధారణ విషయమే.. అయితే ఇప్పుడు ఇటువంటి లక్షణాలు మీ రిలేషన్ షిప్ లో ఉన్నాయని గమనించినట్లయితే, మీరు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు నిర్ధారణకు రావచ్చు. మరి ఇప్పుడు అటువంటి వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలి? మనం ఎలా ఇలాంటి సిచువేషన్ నుంచి బయటపడాలో తెలుసుకుందాం.. 

–మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోండి. ప్రత్యేకించి మీకోసం కొంత సమయాన్ని పాటించండి. మీ మీద మీ ప్రేమను ముందు తెలుసుకోండి. మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి.

–స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సామాజికంగా చురుకుగా ఉండండి.  మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. అపరాధభావంతో జీవించడం మానేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. మీ పట్ల దయతో ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ గతం నుండి బయటపడడం నేర్చుకోండి.

–ఒక రిలేషన్ పోయిందని, వెంటనే వేరే రిలేషన్ పెట్టుకోవడానికి తొందరపడొద్దు . మీకు కావలిసినంత సమయం తీసుకోండి. మీరు అనుభవించే ఒంటరితనం మరొక విషపూరిత సంబంధం కంటే ఎంతో మేలని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ముందు మీపై మీరు పట్టు సాధించాలి. మరొకసారి ఎదురయ్యే విషయాలను గురించి ముందే సిద్ధంగా ఉండాలి. 

–నమ్మకంగా లేనప్పుడు, అనుమానాలు కలిగినప్పుడు, మీకంటూ మద్దతును ఇచ్చే కొంతమంది మీతో ఉండేలా చూసుకోండి. మీకు కలిగే అపోహల నుంచి బయటపడేందుకు వారు సహాయం చేసే అవకాశం ఉంటుంది.

రిలేష‌న్‌షిప్‌లో మాన‌సికంగా కుంగిపోతున్నారా? 

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మన పార్ట్నర్ తో మనం ఎలా ఉంటున్నాం అనేదాన్ని బట్టి ఒక హెల్తీ రిలేషన్ అనేది బలపడుతుంది కదా. ఈ రిలేషన్ షిప్ లో ముఖ్యంగా ఇరువైపుల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. చాలా విషయాలు మన రిలేషన్షిప్ హెల్తీగా ఉండడానికి.. పదిలంగా ఉంచేందుకు, సంతోషంగా, ఎల్లప్పటికీ ఒకేలా ఉండటానికి తోడ్పడతాయి, అయితే ఇప్పుడు రిలేషన్షిప్ అనే బంధాలు ముఖ్యంగా మెంటలీగా కాకుండా ఫిజికల్ గా కూడా ఇంపాక్ట్ ఉంటాయంటున్నారు నిపుణులు. రిలేషన్ షిప్ లో ఉంటున్న వారికి కొన్ని ముఖ్యమైన అంశాల కారణంగా సగటు మనిషి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. 

ఒకరి ఆనందం కోసం మీరు బాధపడకూడదు. అయితే చాలామంది రిలేషన్షిప్ లో ఉన్న పార్ట్నర్స్ మధ్య జరిగేది ఇది. తన పార్ట్నర్ని సంతోషపెట్టడానికి పదే పదే ట్రై చేస్తూ ఉన్నప్పటికీ, మరోవైపు తాను మాత్రం బాధపడుతూ ఉంటారు. ఈ విషయాలు కారణంగా కూడా, ఒకరు తమ మనసులో మానసికంగా బాధపడటమే కాకుండా, ఎదుట వారి కోసం తమ ఎనర్జీని ఇంకాస్త త్యాగం చేస్తున్న వారం అవుతారు. కాబట్టి రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.