Stroke: స్ట్రోక్ కి గురైన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మనం రోజు వారి జాగ్రత్తలు (care) తీసుకుంటున్నప్పటికీ, ఆరోగ్యం (Health)గా మన దినచర్య గడుస్తున్నప్పటికీ, ఒక్కోసారి హఠాత్తుగా మనిషికి స్ట్రోక్ (Stroke) రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు స్ట్రోక్ (Stroke) కి గురైనప్పుడు, మాట్లాడలేకపోవడం, అయోమయంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పికి గురవడం వంటివి చూస్తూ ఉంటాము. స్ట్రోకీ గురైన వెంటనే చాలామందికి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే పెరాలసిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.. అదేవిధంగా గతం మర్చిపోవడం, హఠాత్తుగా వేరేగా మాట్లాడటం వంటివి కనిపిస్తూ […]

Share:

మనం రోజు వారి జాగ్రత్తలు (care) తీసుకుంటున్నప్పటికీ, ఆరోగ్యం (Health)గా మన దినచర్య గడుస్తున్నప్పటికీ, ఒక్కోసారి హఠాత్తుగా మనిషికి స్ట్రోక్ (Stroke) రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు స్ట్రోక్ (Stroke) కి గురైనప్పుడు, మాట్లాడలేకపోవడం, అయోమయంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పికి గురవడం వంటివి చూస్తూ ఉంటాము. స్ట్రోకీ గురైన వెంటనే చాలామందికి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే పెరాలసిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.. అదేవిధంగా గతం మర్చిపోవడం, హఠాత్తుగా వేరేగా మాట్లాడటం వంటివి కనిపిస్తూ ఉంటాయి. స్ట్రోక్ (Stroke) వచ్చిన అనంతరం కొన్ని జాగ్రత్తలు (care) తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 

స్ట్రోక్ కి గురైన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

అయితే ఇప్పుడున్న ఉరుకులు పరుగులు జీవితం (Life)లో, ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడి పనులు చేయడం వంటివి చేయడం వల్ల బ్రెయిన్ (Brain) కి సరైన బ్లడ్ సర్కులేషన్ జరగక, బ్రెయిన్ (Brain) కి సరిపడినంత ఆక్సిజన్ లెవెల్స్ అందక స్ట్రోక్ (Stroke) రావడం జరుగుతూ ఉంటుంది. అయితే స్ట్రోక్ (Stroke) కి గురైన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు (care) తీసుకోవడం ద్వారా.. మళ్లీ మన ఆరోగ్యం (Health) మనం మునపటిలా మార్చుకోవచ్చు. 

ఆరోగ్యకరమైన జీవనశైలి: 

స్ట్రోక్ (Stroke) వచ్చిన మొదట మూడు నెలల వరకు చాలా జాగ్రత్త (care)గా ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ (Stroke) వచ్చే అవకాశాలు మూడు నెలల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొహం లో ఎక్స్ప్రెషన్స్ మారడం, వీక్నెస్ అనిపించడం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, తలనొప్పి, కంటి చూపు తగ్గడం వంటివి మొదట స్ట్రోక్ (Stroke) వచ్చిన అనంతరం జరిగేవి. అయితే ఇవన్నీ మనం రికవరీ చేసుకోవడానికి మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అంటే చక్కని ఆహారాన్ని (food) తీసుకోవడం, డైట్ (Diet) ఫాలో అవ్వడం వంటివి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తృణధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్ (food) తీసుకోవడం మంచిది. రోజు ఉప్పు, పంచదార, కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ రేట్ తగ్గుతుంది రిస్క్ తగ్గుతుంది. డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటివి మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్నాళ్లు చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మెదడుకు రిలాక్స్ అందడం జరుగుతుంది. మన నిద్ర అలవాట్లు కూడా మార్చుకో గలగాలి. 

పాజిటివ్.. ఓర్పు: 

చాలామందిలో మాకే ఎందుకిలా జరుగుతుంది? మా ఆరోగ్యం (Health) ఎందుకు ఇలా పాడైపోతుంది? మేము రోజు ఆరోగ్యకరమైన ఆహారం (food) తీసుకుంటున్నాం.. ఎక్సర్సైజ్ చేస్తున్నాం అయినా సరే మాకే ఎందుకు ఇలా అవుతుంది? అంటూ దిగులు పడిపోతూ తమలో తామే ప్రస్టేట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా నెగిటివిటికి దారితీస్తుంటాయి. దీనివల్ల స్ట్రోక్ (Stroke) నుంచి కోలుకోవడం కన్నా, మరింత అనారోగ్యం (Illness) పాలయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండడం నేర్చుకోవాలి. అంతేకాకుండా మన జీవితం (Life)లో ముందుకు సాగడానికి ఓర్పుతో కొత్త సవాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా మన జీవితం (Life) మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, మనం పాజిటివ్గా ముందుకు సాగడం నేర్చుకోగలగాలి. 

క్రమం తప్పకుండా మెడికేషన్: 

మొదటిసారి స్ట్రోక్ (Stroke) వచ్చిన అనంతరం వైద్యుడు మనకి అందించిన కొన్ని మెడికేషన్ (Medication) వంటివి మనం క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి. మన ఆరోగ్యాన్ని జాగ్రత్త (care)గా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మెడిసిన్స్ వేసుకోవాలి. మనం ఎంతవరకు రికవరీ అవుతున్నాం అనే విషయం గురించి మనకి అంచనా వస్తుంది. అదే సమయంలోనే మంచిగా రికవరీ అవ్వడానికి సహాయపడుతుంది. మెడికేషన్ (Medication) అదేవిధంగా మనలోని కొన్ని మార్పులు మనం తెచ్చుకోగలగాలి. మనకి ధైర్యం లేకపోయినప్పటికీ, ధైర్యాన్ని కూడగట్టుకోగలగాలి. ఇటువంటి అనారోగ్యం (Illness) నుంచి బయటపడగలం అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మన చుట్టూ మన వాళ్లు ఉన్నారని మనకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనకి ఎవరూ లేనప్పటికీ కూడా మన మీద మనం మనకున్న నమ్మకంతో మనల్ని మనం చూసుకోగలం అనే మనోధైర్యంతో ముందుకు సాగగలగాలి. ఇవన్నీ చేస్తే మన ఆరోగ్యం (Health) మన చేతుల్లోనే ఉంటుంది.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.