కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వైద్య రంగంలో రాను రాను చాలా అభివృద్ధి జరుగుతుంది. అందులో ముఖ్యమైనది ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్. ఒకప్పుడు వైద్యులు కొన్ని రకాల ఆపరేషన్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు శరీరంలో ప్రతి అవయవాన్ని మార్చే టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు నిలుస్తున్నాయి. డాక్టర్లు చాలా ఓపికగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల చాలామంది పేషంట్లకు డాక్టర్ల మీద నమ్మకం పెరుగుతుంది. అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి? ఆపరేషన్ […]

Share:

వైద్య రంగంలో రాను రాను చాలా అభివృద్ధి జరుగుతుంది. అందులో ముఖ్యమైనది ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్. ఒకప్పుడు వైద్యులు కొన్ని రకాల ఆపరేషన్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు శరీరంలో ప్రతి అవయవాన్ని మార్చే టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు నిలుస్తున్నాయి. డాక్టర్లు చాలా ఓపికగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల చాలామంది పేషంట్లకు డాక్టర్ల మీద నమ్మకం పెరుగుతుంది. అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి? ఆపరేషన్ జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన జీవన శైలిలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి? అనే దాని గురించి తెలుసుకుందాం.. 

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి: 

కిడ్నీ మార్పిడికి అర్హత వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కోలుకోలేని కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, అంతేకాకుండా తరచుగా డయాలసిస్ అవసరమయ్యే ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధి (ESRD) ఉన్న వ్యక్తులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకోవడం ఉత్తమం. సాధారణంగా, 65 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పేషెంట్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు, అది కూడా వారు మంచి మొత్తం ఆరోగ్యంతో ఉంటే. యాక్టివ్ ఇన్‌ఫెక్షన్‌లు లేదా కొన్ని రకాల క్యాన్సర్‌లు లేకపోవడమే అర్హతకు కీలకం. అంతేకాకుండా సగటు మనిషి, ఆపరేషన్ అనంతరం శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కూడా అంచనా వేయగలగాలి. 

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ రకాలు: 

కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో రెండు రకాలు ఉంటాయి. చనిపోయిన వారి కిడ్నీని మరొకరికి ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం, బ్రతికున్న వారి కిడ్నీని వేరొకరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. అయితే చనిపోయిన వారి దగ్గర నుంచి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగే సంఘటనలు చాలా కొద్దిగా భారత దేశంలో కనిపిస్తూ ఉండేవి. అయితే  చాలా చోట్ల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవేర్నెస్ సంబంధించి కార్యక్రమాలు జరుగుతుండడం వల్ల, చాలామంది కూడా అవసరంలో ఉన్నవారికి తమ వైపు నుంచి కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వారు చనిపోయిన అనంతరం వారి అవయవాలు వేరొకరికి దానం చేసేందుకు ముందుగానే పేరు నమోదు చేసుకుంటున్నారు. అవయవ దానం అనేది కూడా మన భారతదేశంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను దక్కించుకుంది. 

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

సాధారణంగా, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత సుమారు 7 నుండి 10 రోజుల వరకు హాస్పిటల్ లోనే ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి, అదే విధంగా తమ పని చేసుకోవడానికి చాలా వారాల నుండి కొన్ని నెలల వరకు పట్టచ్చు. రెగ్యులర్ ఫాలో-అప్, సమయానికి మెడిసిన్ వేసుకోవడం మరియు మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడం వంటి వైద్య బృందం సూచనలను పాటించడం వంటి వాటి మీద పేషెంట్ తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఇది సగటు పేషెంట్ రికవరీ రోజులను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆహార విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం, తాగే నీరు శాతం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి మన శరీరంలో ఎంత మొత్తంలో ఉన్నాయి, ఇలా అనేక రకాలుగా మనం డైట్ ఫాలో అవుతూ ఉండాలి. నిజానికి మనం రోజు తాగే నీళ్లు మన కిడ్నీ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన జీవన శైలిలో పలు మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా డైట్ విషయంలో, ఫిజికల్ యాక్టివిటీ విషయంలో, ధూమపానం, మద్యపానం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కిడ్నీ ఫెయిల్యూర్ కి ధూమపానం. మద్యపానం ముఖ్య కారణాలు. అందుకనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన అనంతరం ఒకవేళ జ్వరం, నొప్పి, మూత్ర విసర్జనలో మార్పులు, వాపు ఇలాంటివి కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.