ఆరోగ్యకరమైన దంతాల కోసం చిట్కాలు

దంతాల సంరక్షణ ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఎదుట వ్యక్తిని పలకరించే విషయంలో, ఆహార విషయంలో, మాట్లాడే విషయంలో మనకన్నా ముందు మన దంతాలు ఉంటాయని గుర్తుంచుకోండి. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యకరమైన నవ్వు, మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది ఎదుటి వ్యక్తి మీద గౌరవాన్ని తెలుపుతుంది. ఆరోగ్యకరమైన దంతాల కోసం: మనం తీసుకునే ఆహారం ముందుగా నోటి ద్వారానే లోపలికి వెళుతుంది, ముఖ్యంగా ఆహారాన్ని నమిలే విషయంలో దంతాలు ఎంతగానో సహాయం చేస్తాయి. […]

Share:

దంతాల సంరక్షణ ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఎదుట వ్యక్తిని పలకరించే విషయంలో, ఆహార విషయంలో, మాట్లాడే విషయంలో మనకన్నా ముందు మన దంతాలు ఉంటాయని గుర్తుంచుకోండి. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యకరమైన నవ్వు, మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది ఎదుటి వ్యక్తి మీద గౌరవాన్ని తెలుపుతుంది.

ఆరోగ్యకరమైన దంతాల కోసం:

మనం తీసుకునే ఆహారం ముందుగా నోటి ద్వారానే లోపలికి వెళుతుంది, ముఖ్యంగా ఆహారాన్ని నమిలే విషయంలో దంతాలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఒకవేళ దంతాలు అనారోగ్యంగా ఉన్నట్లయితే మన తీసుకునే ఆహారం కూడా అనారోగ్యంగా మారుతుంది. అవునండి మీరు విన్నది నిజమే, దంతాల అనారోగ్యం అంటే, దంతాలలో ఉండే క్రిములు, కీటకాలు. దంతాలు అనారోగ్యంగా ఉన్నాయి అనే చెప్పడానికి, దంతాలు పసుపు రంగులో మారడమే ఒక సింటం.

ఆరోగ్యకరమైన దంతాల కోసం, ప్రతి ఒక్కరు కూడా దంతాల మీద శ్రద్ధ వహించాలి. కేవలం ఆరోగ్యం అంటే శరీర ఆరోగ్యమే కాదు, శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తినడానికి ఉపయోగపడే దంతాల సంరక్షణ కూడా. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి రోజుకి రెండు పుట్ల బ్రష్ చేయడం తప్పనిసరి.

ముఖ్యంగా, దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారాలంటే తప్పనిసరిగా క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో లో క్యాల్షియం అనేది అధికమవుతుంది. క్యాల్షియం అనేదే మన ఎముకలకే కాకుండా పల్లకి కూడా ఎంత ఆరోగ్యం అందిస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి.

ముఖ్యంగా పళ్ళు దృఢంగా మారడానికి మనం చిన్నతనం నుంచి దృఢమైన ఆహారం అంటే చెరకు ముక్కలు తినడం, వంటి పళ్ళు ఎక్సర్సైజ్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళు చిన్నతనం నుంచి దృఢంగా మారుతాయి. 

మంచి నవ్వు వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది:

ఎక్కువగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు తప్పకుండా పాటించవలసిన కొన్ని పద్ధతులు ఉంటాయి. పండ్ల సంరక్షణ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనవసరమైన ఫాస్ట్ ఫుడ్ వంటివి తినడం వల్ల అందులో ఉండే అధిక క్రిములు పళ్ళను పాడుచేసే అవకాశం ఉంటుంది.

ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీటింగ్ విషయాల్లో, సగటు మనిషి నవ్వు ప్రాధాన్యత వహిస్తుంది. పసుపుగా ఉన్న పళ్ళు చూసినప్పుడు ఎదుట వ్యక్తి మీద అనుకోకుండానే ఒక చెడు అభిప్రాయం వంటిది ఏర్పడటం సహజం. కాబట్టి, పళ్ళను సంరక్షించుకుంటూ, పళ్ళు పసుపు గా మారకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

ఇంకా చెప్పాలంటే, ఎదుటివారితో దగ్గరగా ఉండి మాట్లాడేటప్పుడు పళ్ళు నుండి వచ్చే దుర్వాసన, ఎదుట వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. నోటి దుర్వాసన మన వ్యక్తిత్వాన్ని కిందకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దంతాల సంరక్షణ సవ్యంగా ఉంటే నోటి దుర్వాసన నుంచి విముక్తులమవుతాం. నోటి దుర్వాసన రాకుండా రెండు పూటలా బ్రష్ చేయడం, నోటిలో ఏలుకలు వేసుకోవడం, నాలుగు నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడం వంటి పద్ధతులు పాటించడం ద్వారా నోటి సంరక్షణ దంతాల సంరక్షణ మనం పాటించొచ్చు. 

మన ఆరోగ్యాన్ని, మన చక్కనైన నవ్వుని ప్రతిభంభించే దంతాల సంరక్షణ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. చక్కనైన దంతాలు, ఆరోగ్యకరమైన నవ్వు, మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా మార్చేసే శక్తి ఇస్తుంది. కాబట్టి దంతాల సంరక్షణ గురించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.