ప్రతిరోజూ ఈ వ్యాయామాలతో మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోండి

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, నీరసం, ఒత్తిడి మన దరి చేరుతున్నాయి.  వీటి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నిత్యం యాక్టివ్ గా ఉండటంతో పాటు తగిన శక్తిని కూడా సంపాదించుకోవాలి. అయితే ఆహారం తినడం ద్వారా మాత్రమే శక్తి లభిస్తుందని అనుకోవడం పొరపాటు. కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల కూడా మనకు ఎనర్జీ లభిస్తుంది. చాలా మంది వ్యాయామాలు చేయడం వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది అనుకుంటారు. కానీ ఈ ఆసనాలు […]

Share:

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, నీరసం, ఒత్తిడి మన దరి చేరుతున్నాయి.  వీటి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నిత్యం యాక్టివ్ గా ఉండటంతో పాటు తగిన శక్తిని కూడా సంపాదించుకోవాలి. అయితే ఆహారం తినడం ద్వారా మాత్రమే శక్తి లభిస్తుందని అనుకోవడం పొరపాటు. కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల కూడా మనకు ఎనర్జీ లభిస్తుంది. చాలా మంది వ్యాయామాలు చేయడం వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది అనుకుంటారు. కానీ ఈ ఆసనాలు చేస్తే మీ శక్తి రెట్టింపు అవుతుంది. ఆ ఆసనాలు ఏంటో చూసేయండి. 

కపాలభాతి

  • ధ్యానం చేసినట్లు పద్మాసనంలో కూర్చోండి.
  • కళ్లు మూసుకుని ప్రశాంతంగా మారండి.
  • రెండు నాసికా రంధ్రాలతో సుదీర్ఘమైన శ్వాస పీల్చండి. ఛాతిని విస్తరించండి.
  • పొట్ట నుంచి బయటకు తీసినట్లుగా గాలిని బలవంతంగా రెండు నాసికా రంధ్రాల ద్వారా బయటకు వేగంగా పంపండి.
  • వేగంగా గాలి పీలుస్తూ బలంగా వదులుతూ ఉండండి.
  • ఈ విధంగా 30 సార్లు చేయాలి.
  • చివరిగా  లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా చేస్తే ఒక రౌండ్‌ పూర్తి అవుతుంది. ఇలా ఇంకో రెండు సార్లు చేయాలి. అంటే మొత్తం 90 సార్లు గాలిని పీల్చి వదలాలి. ఒక్కో రౌండ్‌ చివర్లో లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా కపాలభాతి చేయాలి.

కపాలభాతి చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. షుగర్‌ లెవల్స్‌, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని మీ బాడీని యాక్టివేట్ చేస్తుంది. మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. 

సూర్య నమస్కారాలు

మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. సూర్య నమస్కారాలు చేయడానికి గంటల కొద్ది సమయం అవసరం లేదు కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలు సూర్య నమస్కారం మొత్తం శరీరాన్ని టోన్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.

సూర్య నమస్కారాలు మొత్తం 12..

  1. నమస్కారాసనం
  2. అర్ధచంద్రాసనం
  3. పాద హస్తాసనం
  4. అశ్వసంచాలనాసనం
  5. పర్వతాసనం
  6. సాష్టాంగ నమస్కారాసనం
  7. భుజంగాసనం
  8. భూకంపాసనం
  9. అశ్వసంచాలనాసనం
  10. పాద హస్తాసనం
  11. వృక్షాసనం
  12. నమస్కారాసనం

ఇంజిన్ డాడ్

ఈ వ్యాయామం మడమలను తుంటికి అనుసంధానం చేస్తూ చేయాలి. ఇలా 60-90 సెకన్ల పాటు వార్మప్ చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా శరీరం మొత్తానికి ఒకేసారి శక్తినిస్తుంది. ఇది సత్తువ, కండరాల సమన్వయం, హార్ట్ రేట్ ను కూడా మెరుగుపరుస్తుంది.

పిండాలి శక్తి వికాసక్ క్రియ

ఇది ఒక సంపూర్ణ వ్యాయామం, ఇది కాలు, కోర్, భుజాల పనితీరును నిర్వహిస్తుంది, ఇది మొత్తం వ్యవస్థలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో చెమటను పట్టేలా చేస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం ఈ క్రియను 10-15 సార్లు రిపీట్ చేయండి.