సాధారణ నీటి కంటే కూడా మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఇవిగో

మనిషి జీవితానికి నీరు చాలా అవసరం శరీరం సక్రమంగా పనిచేయడానికి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు చాలా అవసరం. నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. కణాలకు పోషకాలు ఆక్సిజన్ తీసుకువెళ్తుంది. టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. ఇది జీర్ణక్రియ విసర్జనకు కూడా అవసరం శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మెదడు సైతం సరిగ్గా పనిచేయదు. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, చర్మం పొడిబారడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మూత్రపిండాల వైఫల్యం, అధిక […]

Share:

మనిషి జీవితానికి నీరు చాలా అవసరం శరీరం సక్రమంగా పనిచేయడానికి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు చాలా అవసరం. నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. కణాలకు పోషకాలు ఆక్సిజన్ తీసుకువెళ్తుంది. టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. ఇది జీర్ణక్రియ విసర్జనకు కూడా అవసరం శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మెదడు సైతం సరిగ్గా పనిచేయదు. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, చర్మం పొడిబారడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మూత్రపిండాల వైఫల్యం, అధిక రక్తపోటు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. 

మనం శరీరానికి తగినంత నీరు అందించకపోతే ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు శరీరం వేడెక్కినట్లు అనిపించడమే కాదు, నీరసంగా కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే తక్షణ శక్తి కోసం ఎలక్ట్రోలైట్స్ డ్రింకును తాగుతారు ముఖ్యంగా వ్యాయామం ఎక్కువగా చేసే వాళ్ళు, క్రీడాకారులు ఎక్కువగా ఈ డ్రింక్ ను తాగుతారు. ఈ డ్రింక్ చెమట వలన కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తుంది. అంతే కాకుండా కండరాలు, కణాలకు కావలసిన శక్తిని అందేలా చేస్తుంది. అందుకనే శరీరం అలసిన డీహైడ్రేషన్ భారీనా పడినట్లు అనిపించిన ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ డ్రింక్ తాగుతారు.  ఎలక్ట్రోలైట్స్ అంటే మన శరీరానికి అవసరమైన మినరల్స్. పొటాషియం కాల్షియం మెగ్నీషియం తదితర మినరల్స్ ను ఎలక్ట్రోలైట్స్ గా చెబుతారు.

హైడ్రేట్ – ఎలక్ట్రోలైట్ వాటర్ ను ఇంట్లోనే తయారు చేసుకొనే విధానం: 

కావాల్సిన పదార్థాలు :

ఉప్పు , నీరు, నిమ్మకాయ రసం, కొబ్బరి నీరు 

ముందుగా పావు లీటర్ నీటిని తీసుకొని అందులో పావు టీ స్పూన్ ఉప్పు, పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర కప్పు కొబ్బరి నీళ్లు వేసి బాగా కలపాలి. వీటన్నింటినీ కలిపిన తరువాత ఒక బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. శరీరానికి ఎప్పుడైనా సత్తువ లేకపోయినా, నీరసంగా అనిపించినా తక్షణమే ఈ నీటిని తాగితే శక్తిని అందిస్తుంది. ఈ నీటిని తాగటం వలన కణాల నుంచి వ్యర్ధాలను బయటకు పంపుతాయి. పోషకాలను అందించడానికి సహాయపడతాయి. శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచుతాయి. శరీరంలోని పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తాయి. గుండె కండరాలు, నాడులు, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. దెబ్బతిన్న కణాలకు మరమ్మత్తులు చేస్తాయి.

కొబ్బరినీరు ఆరోగ్యానికి చాలా మంచిది.  సాధారణంగా మార్నింగ్ వాకికి వెళ్లేటప్పుడు కొబ్బరినీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడతారు. సినీ నటులు,  ఫిట్నెస్ ఫ్రీక్స్ ఆహారంలో కొబ్బరి నీరు తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ముఖ్యంగా కొబ్బరినీరు నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు, చక్కెర, పిండి పదార్థాలు వీటిలో తక్కువగా ఉంటాయి. ఖనిజాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.  కొబ్బరి నీళ్ళని కూడా ఎలక్ట్రోలైట్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు కొబ్బరినీళ్లు మనల్ని తక్షణ శక్తిని అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 

మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు నీటికి బదులుగా ఒక గ్లాసు పాలు, ఓఆర్ఎస్,  నారింజ రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ అంటే కేవలం నీటిని కోల్పోవడం కాదు. ఎలక్ట్రోలైట్ నష్టం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డీహైడ్రేషన్ కి గురైనప్పుడు లిక్విడ్ డ్రింక్స్ మాత్రమే కాకుండా తినే ఆహారాలు కూడా హైడ్రేటుగా ఉంచడానికి సహాయపడతాయి. పుచ్చకాయలు, టమోటాలు, నానబెట్టిన బీన్స్, తాజా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటూ కూడా హైడ్రేట్ గా ఉండవచ్చు. నీరు తాగడంతో పోలిస్తే ఒక పండు పూర్తిగా తిన్నా కూడా శరీరంలో ద్రవాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. నీరు పూర్తిగా దాహం తీర్చినప్పటికీ ఇది అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.