పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు ఇవే..!

సాధారణంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఎన్నో మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సాధారణంగా కొంతమంది పిల్లలు తరచూ జ్ఞాపకశక్తి కోల్పోవడం , మంద బుద్ధి తో పాటు తాము ఏం చేస్తున్నామో అన్న పనుల పైన అవగాహన లేకపోవడం వంటి పలు సమస్యలు పిల్లలను పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే పిల్లలకు మహమ్మారి సోకినట్టుగా వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇలాంటి […]

Share:

సాధారణంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఎన్నో మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సాధారణంగా కొంతమంది పిల్లలు తరచూ జ్ఞాపకశక్తి కోల్పోవడం , మంద బుద్ధి తో పాటు తాము ఏం చేస్తున్నామో అన్న పనుల పైన అవగాహన లేకపోవడం వంటి పలు సమస్యలు పిల్లలను పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే పిల్లలకు మహమ్మారి సోకినట్టుగా వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వీటివల్ల పిల్లలు చురుకుగా తయారవ్వడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతుంది.

అరటిపండు:

పోషకాల నిధి అని పిలిపించుకునే అరటిపండు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పోషకాలను సమృద్ధిగా ఇమిడి ఉంచుకున్న అరటిపండు పిల్లలలో ఏర్పడిన చెడు మానసిక స్థితిని దూరం చేయడంలో చాలా చక్కగా సహాయపడతాయి అరటి పండ్లలో విటమిన్ బి 6 తో పాటు సెరోటోనిన్ వంటి పోషకాలు ఉండడం వల్ల ఇవి పిల్లల్లో మానసిక అనుభూతిని కలిగించే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో సహాయపడతాయి. ఇకపోతే ఇందులోని కొన్ని పోషకాలు ఫైబర్ తో కలిసినప్పుడు చక్కర నెమ్మదిగా విడుదల చేయబడుతుంది.  కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అలాగే మెరుగైన మానసిక స్థితిని నిర్వహించడానికి అరటిపండు చాలా చక్కగా సహాయపడుతుంది అంతేకాదు పిల్లల్లో మానసిక స్థితిని పెంపొందించడమే కాదు అజీర్తి వంటి సమస్యలను కూడా అరటిపండు దూరం చేస్తుంది.ప్రతిరోజు పిల్లలకు ఒక అరటి పండు తినిపించడం వల్ల వారి రోజు వారి దినచర్యలో ఎంతో హుషారుగా కండ వృద్ధితో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అందుకే స్పోర్ట్స్ విభాగంలో ఉండే ప్రతి ఒక్కరు అలాగే జిమ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అరటిపండును ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు.

గుడ్లు:

గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి ,విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి.  వాటిలో కోలిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను, మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కోడిగుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ తో పాటు న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో సహాయపడి పిల్లల మానసిక స్థితిని పెంపొందించి.. వారిని చురుకుగా చేయడమే కాదు వారిని మరింత దృఢంగా మారుస్తుంది. అందుకే పిల్లలకు ప్రతిరోజు లేదా వారానికి మూడుసార్లు కోడిగుడ్డు ఉడికించి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

పులియపెట్టిన ఆహారాలు:

తాజాగా కొన్ని పరిశోధనలో అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే గట్  మెదడు కనెక్షన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయట. జీర్ణ వ్యవస్థ దాదాపు 95% సెరటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి పేగు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే గట్  బ్యాక్టీరియా అలాగే మానసిక స్థితి లేదా జ్ఞానం మధ్య సంబంధాలను కూడా చూస్తున్నారని బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలకు జరిపించే చికిత్సలో ప్రోబయోటిక్స్ సహాయపడతాయని కొన్ని మెటా విశ్లేషణలు కూడా నిరూపించాయి ముఖ్యంగా పులియపెట్టిన ఆహారాలైన ఇడ్లీ,  దోస అలాగే పాలరహిత పెరుగు వంటి వాటిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.

ఇక వీటితోపాటు బాదం , చియా విత్తనాలలో కూడా లభించే పోషకాలు పిల్లలు యొక్క మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.