నిద్రలేమి వల్ల ఎన్నో న్యూరో స‌మ‌స్య‌లు

నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నట్లు, నిద్ర లేకపోవడం వల్ల నరాల వీక్నెస్, అల్జీమర్ వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు డాక్టర్లు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎనిమిది గంటలు నిద్రలేక, ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు నిద్రలేమి కారణంగా వస్తాయి.  నిద్రలేమి […]

Share:

నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నట్లు, నిద్ర లేకపోవడం వల్ల నరాల వీక్నెస్, అల్జీమర్ వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు డాక్టర్లు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎనిమిది గంటలు నిద్రలేక, ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు నిద్రలేమి కారణంగా వస్తాయి. 

నిద్రలేమి కారణంగా ముఖ్యంగా ఏం జరుగుతుంది: 

ఇటీవల జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం నిద్ర లేకపోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో బయటపడింది. ముఖ్యంగా ఈ రీసెర్చ్ ద్వారా తెలిసిందేమిటంటే.. ఎవరైతే ఎక్కువ కాలం నిద్రలేమిటో బాధపడుతూ ఉంటారో, వారిలో ఒక రకమైన ప్రోటీన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎక్కువకాలం నిద్ర లేకుండా ఉన్న వారిలో ఇటువంటి ప్రోటీన్ లోపం కారణంగా, నరాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందంటున్నారు రీసెర్చ్ చేసినవారు. 

ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కాలం నిద్రలేమిటో బాధపడతారో, వారిలో హిపోక్ క్యాంపస్ అనే మెదడులో ఉండే ఒక ముఖ్యమైన పార్ట్ డామేజ్ అవుతూ వస్తుందని వెల్లడించారు. అది ముఖ్యంగా మన జ్ఞాపక శక్తికి ముఖ్య కారణం. అంతేకాకుండా డిఎన్ఏ ద్వారా కొన్ని ఆదేశాలను పాటించే ప్రోటీన్స్, అలాగే RNA అనేవి ముఖ్యంగా నిద్రలేమి కారణంగా డామేజ్ అయ్యే అవకాశం ఉందని రీసర్చ్చర్లు స్టడీ ద్వారా పేర్కొన్నారు. అయినప్పటికీ, పెద్ద జంతు జనాభాలో ఎటువంటి ప్రభావం ఉంటుందని పరిశోధకులు సాధారణంగా ధృవీకరించలేదు. అందుకనే, Fuyi Xu, Jia Mi మరి కొంతమంది పరిశోధకులు కలిసి, నిద్రలేమి మెదడును ఎలా దెబ్బతీస్తుందో మరింత రీసెర్చ్ చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఎలుకలు మీద ముఖ్యంగా పరిశోధన నిర్వహించారు. రెండు వారాల తర్వాత నిద్ర లేకుండా ఉన్న ఎలుకలు, అన్ని బాగానే జ్ఞాపక శక్తితో గుర్తుంచుకోవడం గమనించారు. 

తర్వాత కొన్ని జంతువుల మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే, కొన్ని జంతువులలో నిద్రలేమి కారణంగా మెదడులో ముఖ్య ప్రోటీన్ దెబ్బతిన్నట్టు, అదే విధంగా జ్ఞాపకశక్తి లోపం గమనించినట్లు పరిశోధనలు తెలిపాయి. అందుకే కొన్ని ప్రోటీన్లు మన మెదడు వరకు చేరాలన్న, జ్ఞాపక శక్తి పెరగాలన్న, ప్రతి సగటు మనిషికి మంచి నిద్ర ఎంత అవసరమో పరిశోధన చెప్తోంది. 

నిద్ర పట్టేందుకు తినాల్సిన పదార్థాలు:

మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ బి వంటివి ఎక్కువగా నిద్ర పట్టేందుకు సహాయపడే ఖనిజాలు అని చెప్పొచ్చు. ఇలాంటి ఖనిజాలు ఉన్న ఆహార పదార్థాలు మనం రోజు తీసుకుంటే, మనలో తప్పకుండా ఎంతో మార్పు గమనించొచ్చు. నిద్ర హాయిగా పడుతుంది. 

వేడి పాలు:

నిద్రపోయే ముందు గోరువెచ్చని వేడి పాలు తాగడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా వేడి పాలలో ఉండే ట్రైటుఫాన్, మెలోటోనిన్ వంటి పదార్థాలు నిద్ర హాయిగా పట్టడానికి సహాయపడతాయి. కాబట్టి నిద్రపోయే ముందు గోరువెచ్చని వేడి పాలు తాగి నిద్ర పోతే చాలా బాగుంటుంది.  

సబ్జా గింజలు:

మీకు ఈ సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మనం తాగే వాటిలో తినే వాటిలో సబ్జా గింజలు ఉపయోగిస్తూనే ఉన్నాము. ఈ సబ్జా గింజలలో శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాదు రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఆహారంలో గాని తాగే పానీయంలో గాని సబ్జా గింజలు వేసుకుంటే, అందులో ఉండే అమినో ఆసిడ్ మనకు చక్కని నిద్రను అందించడంలో సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆహార పదార్థాలను మీరు తినే పదార్థాలలో చేర్చండి. ఇంకా హాయి నిద్ర మీ సొంతం అవ్వక తప్పదు.