ములేతి- అల్లం టీ: ప్రత్యేకత తెలుసా

ములేతి అంటే అతిమధురం..  ఆయుర్వేదంలో అతిమధురానికి విశిష్టమైన స్థానం ఉంది. చలికాలం లో సాధారణ సమస్యలు దగ్గు, జలుబు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పర్యావరణ కారణంగా ప్రతి వయసు వారు ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆయుర్వేదంలో విశిష్టమైన అతి మధురం వేరు తో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  దీనిని హిందీలో ములేతి అంటారు  ఈ మొక్కలో గ్లైయిసిరైజిట్ ఆసిడ్, గ్లూకోజ్, యాస్పిరాజిన్,  ఈస్ట్రోజన్, స్టెరాయిడ్,  సుక్రోజ్, సుగంధిత తైలం వంటివి ఉన్నాయి. […]

Share:

ములేతి అంటే అతిమధురం..  ఆయుర్వేదంలో అతిమధురానికి విశిష్టమైన స్థానం ఉంది. చలికాలం లో సాధారణ సమస్యలు దగ్గు, జలుబు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పర్యావరణ కారణంగా ప్రతి వయసు వారు ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆయుర్వేదంలో విశిష్టమైన అతి మధురం వేరు తో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  దీనిని హిందీలో ములేతి అంటారు  ఈ మొక్కలో గ్లైయిసిరైజిట్ ఆసిడ్, గ్లూకోజ్, యాస్పిరాజిన్,  ఈస్ట్రోజన్, స్టెరాయిడ్,  సుక్రోజ్, సుగంధిత తైలం వంటివి ఉన్నాయి. అనేక మందులు ఉన్నప్పటికీ గొంతు నొప్పితో పాటు దగ్గు జలుబులు నయం చేయడానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉండటానికి ముందుగా ఉపయోగపడుతుంది. అతి మధురం అల్లం టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అతి మధురం అల్లం టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ములేతి- అల్లం టీ తయారీ.. 

అతిమధురం అలాంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ తయారు చేసుకోవడానికి అతి మధురం వేరు లేదంటే ఆకులు సన్నగా తరిగిన అల్లం కావాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని వేసి బాగా మరిగించాలి. నీరు మరిగిన తరువాత టి ఆకులు, అతి మధురం ఆకులు లేదా అది మధురం వేరును దంచి అందులో వేయాలి. సన్నగా తరిగిన అల్లం కూడా వేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి.  ఈ నీరు బాగా మరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఇందులో తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్న  టీని తాగాలి. అతి మధురం అల్లం టి తాగడం వల్ల దగ్గు, జలుబు , గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అతి మధురం వేరు, నమలడం వల్ల గొంతు నుంచి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. దగ్గు జలుబు రాకుండా మాత్రమే కాకుండా శరీరానికి ఫ్లూ రాకుండా కాపాడుతుంది.  ప్రతిరోజు ఈ టీ  తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల అనేక రోగాలు మనల్ని చుట్టుముడతాయి.  చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు దగ్గు , జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అతిమధురంలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియాల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో మేలు చేస్తాయి.. రక్తహీనత సమస్యను నివారించడంలో అతిమధురం అద్భుతంగా సహాయపడుతుంది. ప్రతిరోజు అతి మధురం టీ తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య పరార్ అవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలోనీ వ్యర్ధాలు అన్ని బయటకు పోయి లివర్, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ చురుగ్గా మారి మలబద్ధకం తగ్గుతుంది. అతి మధురం టీను తీసుకోవడం వలన నోటి దుర్వాసన, నోటి పూత, దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి రక్తంకారడం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. అతి మధురం టీని తీసుకోవడం వలన ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి. సంతాన సమస్యలు ఉంటే నయమవుతాయి చర్మ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.