ఈ ఆప్టికల్ ఇల్యూష‌న్‌లోని నెంబర్ ని గుర్తించగలరా ?

ఇంటర్నెట్ ద్వారా మనము తెలుసుకోలేనిది ఏమీ లేదు.. అంతేకాదు ఇంటర్నెట్ మొత్తం మన దృష్టిని ఆకర్షించే ఎన్నో విషయాలతో నిండిపోయి ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనము ఏమి తెలుసుకోవాలి అన్న, అలానే మనకు బోర్ కొడితే ఏమి చేయాలన్నా ఇంటర్నెట్ ఉంటే చాలు. రహస్యమైన విషయాలపై డాక్యుమెంటరీలు మరియు పాడ్‌క్యాస్ట్‌ల నుండి పజిల్స్ మరియు మరిన్నింటి వరకు, ఈ ఇంటర్నెట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది.  […]

Share:

ఇంటర్నెట్ ద్వారా మనము తెలుసుకోలేనిది ఏమీ లేదు.. అంతేకాదు ఇంటర్నెట్ మొత్తం మన దృష్టిని ఆకర్షించే ఎన్నో విషయాలతో నిండిపోయి ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనము ఏమి తెలుసుకోవాలి అన్న, అలానే మనకు బోర్ కొడితే ఏమి చేయాలన్నా ఇంటర్నెట్ ఉంటే చాలు. రహస్యమైన విషయాలపై డాక్యుమెంటరీలు మరియు పాడ్‌క్యాస్ట్‌ల నుండి పజిల్స్ మరియు మరిన్నింటి వరకు, ఈ ఇంటర్నెట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది. 

అయితే కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి ఇంటర్నెట్లో పాటలు వినడం ఇష్టమైతే మరి కొంతమందికి ఏవో కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం ఉండొచ్చు.  అయితే మీరు కానీ సమాధానాలను కనుగొనడంలో ఆసక్తి ఉన్న వారైతే, మీ కోసం మేము ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్‌ని ఈరోజు ముందుకు తెస్తున్నం. ఈ పజిల్ ఇంటర్నెట్లో షేర్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు చాలామంది బుర్రలకి అలానే కళ్ళకి పని చెబుతోంది. ఎటువంటి పజిల్స్ కాల్ చేయడం వల్ల కంటికి కాదు మెదడుకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేయడం అలవాటు చేసుకుంటే బ్రెయిన్ ఎంతో యాక్టివ్ గా పనిచేస్తుంది.

అసలు ఈ పజిల్ ఏమిటి?

ఈ పజిల్ ఏమిటి అంటే Redditలో భాగస్వామ్యం చేయబడిన ఆప్టికల్ ఇల్యుషన్లో, మీరు గ్రాఫిక్ లోపల వ్రాసిన సంఖ్యను కనుగొనవలసి ఉంటుంది. కింద ఉన్న పోస్ట్, ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌ని చూపుతుంది. దానిలో వ్రాసిన సంఖ్యలను కనుగొనడం మాత్రమే మనము చేయవలసిన పని. అయితే దాంట్లో ఏముంది సులభమే కదా అని మాత్రం అనుకోవద్దండి. ఈ నెంబర్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా కనిపిస్తోంది.‌ ఈ పజిల్ చూసి కొంతమంది మొదటి నెంబర్ 1 అంతే మరి కొంతమంది నాలుగు అంటున్నారు. అంతేకాదు ఈ పజిల్ కరెక్టుగా చెప్తే మీ చూపు చాలా పదును అయ్యింది అని కూడా చెప్పొచ్చు. ఈ పజిల్ ని సాల్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి మీ కంటి మీద మీరు శ్రద్ధ పెట్టాలి అన్న భావన కలుగుతుంది. అంటే ఒక రకంగా ఇలాంటి పజిల్స్ మీలోని హెల్త్ కాన్షియస్నెస్ ని కూడా పెంపొందిస్తాయి.

ఈ పోస్ట్ కొన్ని గంటల క్రితం ఇంటర్నెట్ షేర్ చేయబడింది. పోస్ట్ చేసిన కాసేపటికి దీనికి అనేక లైక్‌లు మరియు అనేక కామెంట్‌లు వచ్చాయి. చాలా మంది సమాధానం ఊహించడానికి ప్రయత్నించారు. కొంతమంది కరెక్టుగా సమాధానాలు ఇవ్వగలిగితే మరి కొంతమంది మాత్రం కొన్ని నెంబర్లు మాత్రమే కరెక్ట్ గా పెట్టగలుగుతున్నాడు.‌ ముఖ్యంగా చాలామంది ఈ ఫోటోలో ఉన్న మొదటి నెంబర్ మరియు చివరి నెంబర్ మాత్రమే రాంగ్ గా కామెంట్ చేస్తున్నారు. మధ్యలో నెంబర్లు సులభంగానే గెస్ చేస్తున్నారు యూజర్స్.

పజిల్ సాల్వ్ చేసే చిట్కా..

అయితే ఈ ఫోటోకి వచ్చిన కామెంట్లు కానీ మనం గమనిస్తే ఒక వ్యక్తి, “మీరు మీ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే, మీరు త్వరగా పైకి క్రిందికి స్క్రోల్ చేసి దీని ఆన్సర్ ని ఈజీగా చెప్పొచ్చు.” అని రాసుకొచ్చారు.. మరో యూసర్ ఏమో, “ప్రారంభంలో 8 లేదా 3 మరియు చివర 9 కూడా ఉంది.” అని జవాబు ఇవ్వడానికి ప్రయత్నించాడు.  ఒకరు సమాధానాన్ని ఊహించి, “45283” అని పంచుకున్నారు. మరి ఈ ఆప్టికల్ భ్రమలో మీకు ఏ సంఖ్య కనిపిస్తుంది? మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోని కాన్సన్ట్రేషన్తో చూసి మీరు గమనించిన నెంబర్ ని చెప్పేయండి.