విద్యార్థి విజయం వెనుక ఉండే ఉపాధ్యాయుడు

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః. ఇది విన్న ప్రతి ఒక్కరికి తమ బాల్యం, ముఖ్యంగా పాఠశాలలో చదివిన రోజుల గుర్తొస్తాయి కదా. ముఖ్యంగా గురువు దేవుడితో సమానమని, ఆయన బోధనలు ఒక విద్యార్థి గొప్పగా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్తూ ఉంటారు. గురువు ద్వారా ఒక మంచి విద్యార్థి తయారవుతాడు. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు వేసుకుందాం..  ఉపాధ్యాయుల […]

Share:

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః. ఇది విన్న ప్రతి ఒక్కరికి తమ బాల్యం, ముఖ్యంగా పాఠశాలలో చదివిన రోజుల గుర్తొస్తాయి కదా. ముఖ్యంగా గురువు దేవుడితో సమానమని, ఆయన బోధనలు ఒక విద్యార్థి గొప్పగా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్తూ ఉంటారు. గురువు ద్వారా ఒక మంచి విద్యార్థి తయారవుతాడు. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు వేసుకుందాం.. 

ఉపాధ్యాయుల దినోత్సవం: 

ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఆ రోజున భారతదేశానికి రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, 1962 నుంచి ఆయన పుట్టిన రోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఆ రోజున ముఖ్యంగా విద్యార్థులు తమ పాఠశాలలో ఉన్న ప్రతి ఒక ఉపాధ్యాయులను గౌరవంగా, తమకు విద్య నేర్పిస్తున్నందుకు తమ వంతు ధన్యవాదాలు చెబుతూ, తమ ఉపాధ్యాయుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడటం, తమకు ఇష్టమైన ఉపాధ్యాయులకు మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం, బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా తమ లైఫ్ లో సెటిలైపోయినప్పటికీ కూడా తమ చిన్ననాటి ఇష్టమైన ఉపాధ్యాయులకు, తమ వైపు నుంచి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫోన్ల ద్వారా మాట్లాడ్డం, నేరుగా వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. 

మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎంతో అవసరం: 

భరోసా: 

ఒక మంచి ఉపాధ్యాయుడు తమ తరగతిలో ఉండే పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును అందించడమే కాకుండా, తమ వైపు నుంచి ఒక భరోసాని అందిస్తూ, పిల్లవాడు ధైర్యంగా ముందుకు అడుగు వేసేందుకు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా సగటు విద్యార్థి మానసికంగా దృఢంగా మారడానికి ఎంతగానో తోడ్పడుతుంది ఒక ఉపాధ్యాయుడి కృషి. 

నమ్మకం: 

చాలా మంది చిన్నతనంలో చాలా పిరికిగా, ఎదుటివారితో మాట్లాడడానికి మొహమాటపడుతూ, తన మనసులో మాటని ధైర్యంగా చెప్పలేకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి విద్యార్థులకు నమ్మకం చేకూర్చడంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పవచ్చు. తన మీద తనకి నమ్మకం వచ్చే విధంగా ఒక విద్యార్థిని తయారుచేస్తారు ఉపాధ్యాయులు. 

విజయం: 

ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే చిన్నతనం నుంచే విజయం వైపుగా ధైర్యంగా, తమ మీద తమకి అపారమైన నమ్మకంతో ముందుకు అడుగు వేయగలిగే క్రమంలో, ఒక విద్యార్థిని తయారు చేయడంలో ఉపాధ్యాయుడు ఎప్పుడూ ముందే ఉంటాడు. విజయం వైపుగా, తమ విద్యార్థులు అడుగులు వేయడానికి తన వంతు కృషి చేస్తాడు ఉపాధ్యాయుడు. 

ప్రోత్సాహం: 

జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ వెనకనుంచి మనకి ప్రోత్సాహం అందించే వారు లేకపోతే వెనకబడిపోతాం అనేది అక్షరాల నిజం. అలా ఒక విద్యార్థి వెనకపడకుండా ఉండేందుకు తన వైపు నుంచి తప్పకుండా ప్రోత్సాహాన్ని అందించడంలో, ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ వెనకాడడు. ఒక విద్యార్థిలోని మంచి గుణాలను వెలికి తీసి, తను ఏ దారిలో అయితే వెళ్లాలనుకుంటున్నాడో, ఆ దారిలో తనదైన శైలిలో ప్రోత్సాహాన్ని అందించడంలో, ఉపాధ్యాయుడు తన ముఖ్యపాత్రను పోషిస్తారు.

క్రమశిక్షణ, మంచి అలవాట్లు: 

ప్రతి విద్యార్థికి తన చిన్నతనం నుంచి అలవర్చుకోవాల్సిన ముఖ్యమైనవి, క్రమశిక్షణ, మంచి అలవాట్లు. క్రమశిక్షణ ఉంటేనే ఒక మనిషి పైకి ఎదగడానికి వీలు పడుతుంది. అదే విధంగా మంచి అలవాట్లు సగటు మనిషి మంచి జీవనశైలికి ఆధారం. ఈ రెండింటినీ కూడా, ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు అందించడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటాడు. పాజిటివ్గా తాను చేయాలనుకునే పనికి తనదైన శైలిలో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఒక విద్యార్థి విజయం వైపు అడుగులు వేసేందుకు, వెనకుండి నడిపిస్తాడు ఉపాధ్యాయుడు.