స్విమ్మింగ్ బెనిఫిట్స్

శరీరం లో వేడిని మరియు బరువు తగ్గించడానికి స్విమ్మింగ్ చేయడం అనేది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.  రీసెర్చ్‌గేట్‌లో పరిశోధనలోని అధ్యనం ప్రకారం నీటిలో చేసే ఈ వ్యాయామం నడవడం కంటే అతి తక్కువ సమయం లో  ఎన్నో రకాలుగా అంటే బరువు తగ్గడానికి , మరియు ఫాట్ బర్నింగ్, మరియు ఇన్సులిన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పారు. దీర్ఘకాలంలో , స్విమ్మింగ్ శరీర బరువు మరియు లిపిడ్ మేజర్ చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉత్తమమైన స్విమ్మింగ్ స్ట్రోక్‌లను […]

Share:

శరీరం లో వేడిని మరియు బరువు తగ్గించడానికి స్విమ్మింగ్ చేయడం అనేది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.  రీసెర్చ్‌గేట్‌లో పరిశోధనలోని అధ్యనం ప్రకారం నీటిలో చేసే ఈ వ్యాయామం నడవడం కంటే అతి తక్కువ సమయం లో  ఎన్నో రకాలుగా అంటే బరువు తగ్గడానికి , మరియు ఫాట్ బర్నింగ్, మరియు ఇన్సులిన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పారు. దీర్ఘకాలంలో , స్విమ్మింగ్ శరీర బరువు మరియు లిపిడ్ మేజర్ చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉత్తమమైన స్విమ్మింగ్ స్ట్రోక్‌లను తెలుసుకుందాం.

మీకోసం బరువు తగ్గడానికి కొన్ని స్విమ్మింగ్ చిట్కాలు, న్యూ ఢిల్లీకి చెందిన సర్టిఫైడ్ ఫిట్‌నెస్ మరియు న్యూట్రిషన్ కోచ్ అభి సింగ్ ఠాకూర్‌తో హెల్త్ షాట్‌లు తెలియచేసారు

స్విమ్మింగ్ చేయడం వలన ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయి?

స్విమ్మింగ్ ఒక బెస్ట్ వ్యాయామం ఎందుకంటే ఇది అన్ని కండలరాను కదిలించేలా చేస్తుంది. ఇది చాల మంది ఫిట్ గా ఉండటం కోసం ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే స్విమ్ చేసే వ్యక్తి యొక్క బరువు, మరియు ఎంత సమయం స్విమ్మింగ్ కోసం కేటాయిస్తారో దాని వలన ఇది కేలరీలను బర్న్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సగటున, ఆడవారు ఈత కొట్టడం ద్వారా గంటకు 400 నుండి 600 కేలరీలు బర్న్ చేయగలదని ఠాకూర్ చెప్పారు.

మీరు స్విమ్మింగ్  ఎలా మొదలు పెట్టాలో కొన్ని టిప్స్ : 

ఇక్కడ 70 కిలోల బరువు గల ఒక మహిళ తను ఎం చేసి కేలరీల కరించారో తెలుసుకుందాం: 

• నెమ్మదిగా, తీరికగా ఈత కొట్టడం ద్వారా : దాదాపు 280 కేలరీలు కరిగించవచ్చు

• మధ్యస్తంగా వేగవంతమైన ఫ్రీస్టైల్ లేదా బ్యాక్‌స్ట్రోక్ ద్వారా : దాదాపు 400 నుండి 500 కేలరీలు కరిగించవచ్చు

• బలంగా  ఫ్రీస్టైల్ లేదా బటర్‌ఫ్లై స్విమ్మింగ్: సుమారు 600 నుండి 700 కేలరీలు కరిగించవచ్చు

• అధిక-తీవ్రతతో ఈత కొట్టడం మధ్యలో బ్రేక్ తీసుకోని అంటే ఆ బ్రేక్ తీసుకొనే సమయాన్ని బట్టి : మీరు 700 కేలరీలు లేదా అంతకంటే ఎక్కువ బర్న్ కరిగించవచ్చు

కానీ ఇది అందికీ ఒకేలా ఉండదు అని గుర్తుంచుకోండి

వెయిట్ లాస్ కోసం కొన్ని స్విమ్మింగ్ టిప్స్ :

మీరు బరువు తగ్గడానికి స్విమ్మింగ్ చేస్తుంటే ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవలసి ఉంటుంది. 

1. స్థిరత్వం: 

బరువు తగ్గాలి అనే విషయం లో సూత్రత్వం అనేది ఒక ముఖ్యంగా పాత్ర పోషిస్తుంది. మీ వ్యాయమ దినచర్య లో స్విమ్మింగ్ ని ఒక భాగం గా చేసుకోవాలి.  వారానికి మూడు నుండి ఐదు సార్లు ఖచ్చితంగా స్విమ్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని , ఠాకూర్ సూచించారు. ఇలా చేయడం ద్వారా కాలక్రమేణా స్విమ్మింగ్ క్యాలరీ-బర్నింగ్ చేయడానికి మన శరీరం ఈ అలవాటు గా స్వీకరిస్తుంది. 

2. తీవ్రత: 

 తొందరగా బరువు  తగ్గడానికి, ముఖ్యంగా మీ వ్యాయామాలలో విరామాలు  తీసుకోవడం లేదా అధిక-తీవ్రత స్విమ్మింగ్‌ను చెరచడం మంచిది, అధిక తీవ్రత విరామాలు తీసుకుంటూ స్విమ్   చేయడం వలన మీ హృదయ స్పందన రేటును ఎక్కువవుతుంది, మీ జీవక్రియ ను మెరుగుపరుస్తుంది. మరియు స్విమ్ చేస్తప్పుడే కాకుండా తర్వాత కూడా కేలరీలను కరిగిస్తుంది. 

3. వెరైటీ: 

ఎప్పుడు ఒకేలా కాకుండా వివిధ రకాల స్విమ్మింగ్ స్ట్రోక్స్ తో చేయడం ద్వారా ప్రతి స్ట్రోక్ వేర్వేరు కండరాలను పని చేస్తుంది కాబట్టి మీ వ్యాయామాలలో వివిధ రకాల స్ట్రోక్‌లను చేర్చడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని ఆశించవచ్చు

4. సాంకేతికత: 

వ్యాయామం లో  సరైన స్విమ్మింగ్ టెక్నిక్‌పై శ్రద్ధ పెట్టడం వల్ల మరింత సమర్థవంతమైన, మరియు గాయాల మాన్పడానికి సహాయపడుతుంది. బాడీ ఫిట్ గా అవ్వడానికి, నీటిలో ఉన్నప్పుడు  మీ  శరీరాన్ని  క్రమబద్ధీకరించడం మరియు సరైన శ్వాస పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి పెట్టండి. మీకోసం ఉన్న ట్రైనర్ మీకు వీటి గురించి చెప్పి బాగా సహాయం చేస్తారు