హజెల్ నట్స్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా

బాదం, జీడిపప్పు, పిస్తా మాదిరిగానే మార్కెట్లో లభించే నట్స్ లో హజెల్ నట్స్ కూడా ఒకటి.. ఈ నట్స్ లో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.. అంతేకాకుండా హజెల్ నట్స్ ఆయిల్ కూడా మన చర్మాన్ని మెరిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఈరోజు హజెల్ నట్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..  హజెల్ నట్స్ ఆరోగ్య ప్రయోజనాలు: హజెల్ […]

Share:

బాదం, జీడిపప్పు, పిస్తా మాదిరిగానే మార్కెట్లో లభించే నట్స్ లో హజెల్ నట్స్ కూడా ఒకటి.. ఈ నట్స్ లో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.. అంతేకాకుండా హజెల్ నట్స్ ఆయిల్ కూడా మన చర్మాన్ని మెరిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఈరోజు హజెల్ నట్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. 

హజెల్ నట్స్ ఆరోగ్య ప్రయోజనాలు:

హజెల్ నట్స్ లో విటమిన్ ఎ, సి,ఇ తోపాటు యాంటీ ఆక్సిడెంట్స్,  ప్రోటీన్, డైటరీ ఫైబర్, హెల్ది ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి మన అనారోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుతాయి. ఈ నట్స్ శాఖాహారులకు ప్రోటీన్ అందించడంలో బెస్ట్ చాయిస్ గా చెప్పవచ్చు. 100 గ్రాముల హాజెల్ నట్స్ లో 15 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది రోజువారి అవసరాలలో 30 శాతానికి పైగా అందిస్తుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. 

ఈ నట్స్ లో గ్లుటెన్ అసలు ఉండదు. మధుమేహులకు ఈ నట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇందులో గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గుప్పెడు హజెల్ నట్స్ ను నాలుగు వారాలపాటు తింటే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. హజెల్ నట్స్ పాలు ఆవు పాలకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కాల్షియం అధికంగా ఇస్తుంది. ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఎముక సాంద్రతను, ఎముక పటితత్వాన్ని పెంచుతుంది. 

హజెల్ నట్స్ ప్రతిరోజు తినటం వల్ల బరువు తగ్గుతారు. హజెల్ నట్స్ తినటం వలన ఆయా భాగాల్లో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయని సైంటిస్టులు చేసిన పరిశోధనలో వెల్లడైంది. వీటిని తినటం వలన రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండెపోటు రాకుండా నియంత్రిస్తుంది. థైరాయిడ్ ఉన్నవాళ్లు ఈ నట్స్ తినాలి. ఇందులో ఉండే మ్యాంగనీస్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. ఇంకా శరీర మెటబాలిజం కూడా సక్రమంగా ఉంటుంది. ఈ నట్స్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రో ఆందోసైనిన్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అడ్డుకుంటాయి.

హజెల్ నట్స్ ఆయిల్:

హజెల్ నట్స్ లో విటమిన్ సి, ఇ మూలం. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా కూడా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు మీ ముఖానికి హజెల్ నట్స్ ఆయిల్ తో కనుక మసాజ్ చేసుకుంటే మీ చర్మం మృదువుగా మారడంతో పాటు చర్మాన్ని మెరిపిస్తుంది. ఈ ఆయిల్ లో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ మీ వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. మీ ముఖంపై సన్నని గీతాలు, ముడతలు రాకుండా మీ చర్మాన్ని నిత్యం సంరక్షిస్తూ ఉంటుంది. ఇంకా చక్కటి సన్ స్క్రీన్ గా ఈ ఆయిల్ పనిచేస్తుంది. UV  కిరణాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.

హజెల్ నట్స్ నూనె మీ చర్మానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవడం వలన చర్మానికి తగినంత రక్తప్రసరణను అందిస్తుంది ఈ నూనె చర్మం లోకి చొచ్చుకుపోయి చర్మ కణజాలాన్ని మృదువుగా చేస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు వాటి తాలూకు మచ్చల్ని పోగొట్టి మీ ముఖానికి చక్కటి గ్లో తెస్తుంది. 

హజెల్ నట్స్ ఫేస్ ప్యాక్..

ఒక టీ స్పూన్ హజెల్ నట్స్ పొడి, అర టీ స్పూన్ కాఫీ పౌడర్, అర టీ స్పూన్ చక్కెర, ఒక చెంచా కొబ్బరి నూనె లేదంటే ఆయిల్ నునే వేసి చక్కటి ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకొని స్క్రబ్ చేయాలి. ఈ ప్యాక్ మీ మొటిమలను తొలగించడంతోపాటు చక్కటి మెరుపును సంతరించుకునేలా చేస్తుంది.