పిల్లల ఎత్తు కోసం సూపర్ ఫుడ్స్

పిల్లలు తగినంత పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఎత్తు పెరగకపోవడం వంటి అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య వెనుక అనేక ఇతర కారణాలు ఉండవచ్చు, కానీ పోషకాహార లోపం దాని ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడగల పోషకాలు అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం. పిల్లల ఎత్తు పెరగడం లేదా? మీరు ఈ సూపర్ ఫుడ్స్ సహాయం తీసుకోవచ్చు ఈ 5 సూపర్ ఫుడ్స్ తో ఎత్తు వేగంగా పెరుగుతుంది […]

Share:

పిల్లలు తగినంత పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఎత్తు పెరగకపోవడం వంటి అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య వెనుక అనేక ఇతర కారణాలు ఉండవచ్చు, కానీ పోషకాహార లోపం దాని ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడగల పోషకాలు అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.

పిల్లల ఎత్తు పెరగడం లేదా? మీరు ఈ సూపర్ ఫుడ్స్ సహాయం తీసుకోవచ్చు

ఈ 5 సూపర్ ఫుడ్స్ తో ఎత్తు వేగంగా పెరుగుతుంది

పిల్లలు ఒక వయసుకి వచ్చాక ఎత్తు వేగంగా పెరుగుతారు. ఇంకా చెప్పుకోవాలంటే 9 సంవత్సరాల వయసు నుండి 16-17 సంవత్సరాల వయస్సు వరకు ఎత్తు వేగంగా పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎత్తు అనేది తల్లిదండ్రుల జన్యుపరమైన, ఎత్తు పెరిగే సంవత్సరాలో పిల్లలకు అందించబడే పోషక పదార్ధాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన కారకాలు మన నియంత్రణలో లేవు. కానీ పిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందేలా మనం చూడటం మన చేతుల్లోనే ఉంది.

పిల్లలలో ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోటీన్లు, విటమిన్ డి, కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తాయని మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఎత్తు పెరుగుదలలో, ఎముకల బలోపేతం, పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ముఖ్యమైన పోషకాలను పిల్లలకు అందించడానికి సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడగల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు

సోయాబీన్:

సోయాబీన్ అనేది ప్రోటీన్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, పొటాషియం, ఫోలేట్లు సమృద్ధిగా కలిసిన మంచి పోషకమైన ఆహారం. వీటిలో అధికంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. సోయాబీన్‌ను కూర, టోఫు లేదా సోయామిల్క్ వంటి వివిధ రూపాల్లో పిల్లలకు ఇవ్వవచ్చు. ఎముకల పెరుగుదలలో సహాయపడటమే కాకుండా, సోయాబీన్ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది శరీర వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

బీన్స్:

బీన్స్‌ని ఫైబర్ రిచ్ ఫుడ్ అని అంటుంటారు. ఇది పిల్లలలో ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడి మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు ప్రేగుల్లో కదలికలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ మొదలైన ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజాలన్నీ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి, అందువల్ల పిల్లలకు అందించే ఆహారంలో ఇవి కచ్చితంగా భాగమై ఉండాలి.

క్యారెట్:

క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకర కణాలు, మెరుగైన కాలేయ పనితీరు, మెరుగైన ప్రసరణ, ఆరోగ్యకర చర్మం, కంటి చూపు మెరుగుపరచడంలో క్యారెట్ ఒక సహజమైన వరంలాగా పనిచేస్తుంది. క్యారెట్ మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అందువలన పిల్లలకు దీన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి.

పాలు:

కాల్షియం, ప్రోటీన్లు అధికంగా లభించే వాటిలో పాలు ఒకటి. పాలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. పాలు పిల్లల పెరుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

గింజలు: 

వాల్‌నట్‌లు, జీడిపప్పులు, పిస్తా, బాదంపప్పు మొదలైన గింజలు పిల్లల పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. అవి అవసరమైన సూక్ష్మ పోషకాలను పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు ఎముకలు, కండరాల ఎదుగుదలకు సహాయపడతాయి

గుడ్లు:

గుడ్డులో ఇనుము, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు, విటమిన్లు, అయోడిన్ అధికంగా లభిస్తాయి. ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ పిల్లల ఎదుగుదలకు తొడ్పడతాయి. అలాగే వారిలో ఏకాగ్రతను పెంచడానికి సహాయపడతాయి. అందువల్ల పిల్లల ఆహారంలో ఖచ్చితంగా గుడ్లు ఒక భాగంగా ఉండాలి.

ఈ పోషకాహార రిచ్ ఫుడ్స్ ఒక్కటే కాకుండా రోజూ 8 గంటల నిద్ర, రెగ్యులర్ వ్యాయామం వల్ల పిల్లల మానసిక, శారీరక పెరుగుదలకు ఉపకరిస్తాయి. అందుకే రన్నింగ్, సైక్లింగ్, స్ట్రెచింగ్, స్కిప్పింగ్ మొదలైన అవుట్‌ డోర్ గేమ్‌లు ఆడేలా వారిని ప్రోత్సహించాలి.