సన్‌టాన్ తో బాధపడుతున్నారా..? క్రీములు వాడి విసుగు చెందారా..?ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండిలా

వేసవిలో మండే ఎండలు మన చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎండలో ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి మరియు ఇది సన్ టాన్‌కు కూడా దారితీస్తుంది. ముఖంపై ఉండే ఈ నల్లటి మచ్చలు మన అందాన్ని పాడు చేస్తాయి. వాటిని తొలగించడానికి, వాటిని తొలగించడానికి కొన్ని సహజ మరియు ఇంటి నివారణలను ఉపయోగించడం మంచిది. సన్ టానింగ్‌ను తొలగించే ఇంటి నివారణల గురించి క్రింద తెలుసుకుందాం. మనం ఉష్ణమండల దేశంలో నివసిస్తుండటం వల్ల ఏడాదిలో ఎక్కువ […]

Share:

వేసవిలో మండే ఎండలు మన చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎండలో ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి మరియు ఇది సన్ టాన్‌కు కూడా దారితీస్తుంది.

ముఖంపై ఉండే ఈ నల్లటి మచ్చలు మన అందాన్ని పాడు చేస్తాయి. వాటిని తొలగించడానికి, వాటిని తొలగించడానికి కొన్ని సహజ మరియు ఇంటి నివారణలను ఉపయోగించడం మంచిది. సన్ టానింగ్‌ను తొలగించే ఇంటి నివారణల గురించి క్రింద తెలుసుకుందాం.


మనం ఉష్ణమండల దేశంలో నివసిస్తుండటం వల్ల ఏడాదిలో ఎక్కువ భాగం సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురవుతుంటాము. దీని వల్ల చర్మంపై పిగ్మెంటేషన్, కొన్నిసార్లు కాలిన గాయాలు ఏర్పడతాయి. అలాగే మన శరీరంలో ఉండే మెలటోనిన్ సూర్యకిరణాలకు స్పందించే గుణం ఉంది. దీని కారణంగానే చేతులు, కాళ్లు, ముఖం, మెడ వంటి బయటకు కనిపించే చర్మం నల్లబడుతుంది. దీనినే సన్‌టాన్ అంటారు. సాధారణంగా సన్‌టాన్, సన్‌బర్న్‌లను తొలగిస్తుందని చెప్పుకునే ఖరీదైన అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాలు చర్మంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగిస్తాయి. సన్‌టాన్‌ను సహజంగా తొలగించగల వివిధ గృహ-ఆధారిత చిట్కాలు, ఉపాయాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తులను వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా వీటిని తయారు చేసుకునేందుకు ఖర్చు కూడా ఎక్కువ కాదు కావున అనేక మంది ఈ క్రీమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే వాటి గురించి తెలుసుకుందాం.

సన్ టానింగ్‌ను తొలగించే ఇంటి నివారణలు

నిమ్మ మరియు తేనె:

సూర్యుడి ఎండ తగిలి నల్లగా మారిన చర్మాన్ని మళ్లీ మునుపటిలా మార్చుకునేందుకు నిమ్మకాయ, తేనెతో చేసిన మిశ్రమం మంచి ప్రభావం చూపిస్తుంది. దీనికోసం ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన ప్రాంతంలో అప్లయి చేసి కాసేపు ఆగి కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నలుపుని తగ్గించుకోవచ్చు.

కుంకుమపువ్వు, పాలు మరియు తేనె:

మీరు సన్‌టాన్ తొలగించడానికి పాలు, తేనెతో కలిపిన కుంకుమపువ్వు మిశ్రమాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది అవాంఛనీయ పిగ్మెంటేషన్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

గోధుమ పిండి, పసుపు మరియు తేనె:

గోధుమ పిండి, శెనగపిండి, పసుపు, తేనెను మిక్స్ చేసి పేస్ట్‌‌‌‌లా చేసుకోవాలి. దీన్ని వారానికి కనీసం 3 సార్లు అప్లై చేయవచ్చు. తద్వారా సన్‌ట్యాన్ తొలగించి మీ ముఖం మెరుపును పునరుద్ధరించవచ్చు.

బంగాళదుంప, తేనె, పసుపు:

తురిమిన బంగాళాదుంప, తేనె, పసుపు మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయడం ద్వారా సన్‌‌బర్న్స్, సన్‌టాన్ నుండి త్వరగా బయటపడవచ్చు. ఈ నేచురల్ రెమెడీ మీ చర్మంపై అద్భుతాలు చేస్తుంది.

బియ్యం పిండి, తేనె, పసుపు, పచ్చి పాలు: 

బియ్యపు పిండి, తేనె, చిటికెడు పసుపు, పచ్చి పాలు కలిపిన మిశ్రమం అనూహ్యంగా సన్‌‌ట్యాన్‌ను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది.

అలోవెరా జెల్, తేనె:

అలోవెరా జెల్‌తో ప్రయోజనాలు అనేక రెట్లు ఉన్నాయి. ఇది చర్మానికి అద్భుతంగా పనిచేయడమే కాకుండా అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అలోవెరా జెల్, తేనె కలిపిన పేస్ట్‌ని చర్మానికి అప్లై చేయడం వల్ల సన్‌బర్న్‌లు, సన్ టానింగ్‌‌ను తగ్గించుకోవచ్చు.

పెరుగు, పసుపు:

మీ చేతులపై ఉన్న సన్‌టాన్‌ను తొలగించుకోవడానికి పెరుగు, పసుపు మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు అప్లై చేయవచ్చు.

వీటితోపాటు మరికొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సూర్యుడి బాధల నుంచి తప్పించుకోవచ్చు.