టీనేజర్ లో ఆత్మహత్యల కల్లోలం

వైద్య నిపుణులు  ప్రకారం తల్లిదండ్రుల అంచనాల నుండి ఆందోళన వరకు అనేక సమస్యల నుండి వచ్చే అసంతృప్తి కారణంగా యువకులు ఆత్మహత్యాయత్నం పెరుగుతూ ఉంది.   2021-22 అధ్యయనంలో యువతలో మానసిక రుగ్మతల కేసులు 40 నుండి 60 శాతం పెరిగాయని తెలిపారు  అంతే కాకుండా సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వ జోక్యం లేకపోవడం బాధాకరమని వారు విచారించారు. మానసిక సమస్యల కారణంగా తమ పిల్లలు తీసుకుంటున్న తీవ్ర చర్యలపై తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన […]

Share:

వైద్య నిపుణులు  ప్రకారం తల్లిదండ్రుల అంచనాల నుండి ఆందోళన వరకు అనేక సమస్యల నుండి వచ్చే అసంతృప్తి కారణంగా యువకులు ఆత్మహత్యాయత్నం పెరుగుతూ ఉంది.  

2021-22 అధ్యయనంలో యువతలో మానసిక రుగ్మతల కేసులు 40 నుండి 60 శాతం పెరిగాయని తెలిపారు  అంతే కాకుండా సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వ జోక్యం లేకపోవడం బాధాకరమని వారు విచారించారు.

మానసిక సమస్యల కారణంగా తమ పిల్లలు తీసుకుంటున్న తీవ్ర చర్యలపై తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మంగళవారం జరిగిన ఒక సంఘటనలో, బైపిసి ఇంటర్మీడియట్ విద్యార్థిని తన తల్లి అతిగా ఫోన్ వాడకంతో తిట్టినందుకు కోపం లో ఉన్న ఆ అమ్మయి ఆ తరువాత రోజు కనిపించలేదు  వాలా తల్లిదండ్రులు కంగారు పది ఆమెను వెతకడం మొదలు పెట్టారు అప్పటికి కనిపించకపోయే సరికి  వాలు పోలీస్ కి  ఫిర్యాదు చేసారు… ఆమె తరువాత దుర్గం చెరువులో కనుగొనబడింది. పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది.

జులైలో జరిగిన మరో సంఘటనలో, తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యులకు చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అవుతున్నా, తల్లిదండ్రులు, పేషెంట్లకే ఈ లక్షణాలు కనిపించడం లేదని సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక తల్లిదండ్రులు,తన 14 ఏళ్ల కుమారుడు క్రీడలు మరియు చదువులలో రాణించడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నందున ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పారు.  అసైన్‌మెంట్‌ విషయాల పై తల్లిదండ్రులతో వాగ్వాదం తర్వాత, అతను  ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

 మేము మా బిడ్డను వెంటనే రక్షించగలిగాము  అని తల్లిదండ్రులు చెప్పారు.

తల్లిదండ్రులు   విలేఖరితో మాట్లాడుతూ, మేము పిల్లలిని చదువు లేదా ఇతర విషయాలు పై తిట్టిన తర్వాత,మేము వాలా పై ప్రేమ చూపించట్లేదు అని భావించి ఆత్మహత్యకి పాల్పడుతున్నారు అని వాలు తెలిపారు. 

చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి గా చుస్తునారు అని అంతే కాకుండా వాలు చేసే దానిని వ్యతిరేకిస్తే సహించడం లేదు అని తెలిపారు. 

 మేము ఆఫీసు ఒత్తిళ్ల కారణంగా 24/7  పిల్లలు పై నిఘా ఉంచలేకపోవడం వల్లనా కూడా ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంతే కాకుండా పిల్లలు మొబైల్ ఫోన్‌లకు ఎక్కువగా బానిసలూ అవుతున్నారు మరియు మేము ఫోన్ లు వాడకూడదు అని నిబంధనలు పెడుతూ ఉంటే  ఆత్మహత్య కి పాలుపడ్తున్నారు అని మరొక పేరెంట్, అన్నారు.

కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ మాట్లాడుతూ, 2021-22 సర్వేలో కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రధాన సమస్యలుగా ఆందోళన, డిప్రెషన్ మరియు అబ్సెషన్ 40 శాతం నుండి 60 శాతం వరకు పెరిగాయని వెల్లడైంది. అదనంగా, ‘మీరు మరియు నేను’ అవగాహన కార్యక్రమం కింద 10,000 మంది పిల్లలకు కౌన్సెలింగ్ చేసినట్లు ఆయన చెప్పారు.

‘‘ఆరోగ్య శాఖ మంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒక ఆలోచన అందించాము మరియు రెండుసార్లు సర్వే నివేదికను సమర్పించాము అని తెలిపారు 

దురదృష్టవశాత్తు, మానసిక ఆరోగ్య అవగాహనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది ప్రసిద్ధ కళాశాలల్లో ఆత్మహత్యల నిరంతర సంఘటనలకు దారి తీస్తుంది, ”అని ఆయన అన్నారు.

“సపోర్టివ్ కమ్యూనికేషన్, ప్రకారం సానుభూతి, మానసిక ఆరోగ్య విద్య మరియు సకాలంలో వృత్తిపరమైన సహాయం యువకులను మానసిక క్షోభ నుండి కాపాడుతుంది అని  మరియు వారిలో ఆత్మహత్యాయత్నాల పెరుగుదలను తగ్గిస్తుంది అని వారు తెలిపారు దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం గురించి ఉపాధ్యాయులకు తెలియడం లేదు…  వారు సిలబస్‌ను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు, ఇది విచారకరం, ”అని అతను చెప్పారు.