నిద్రలో గుండెపోటు.. కారణాలు తెలుసా?

నేటి రోజుల్లో అనేక మంది గుండెపోటుతో సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు 60+ వయసులో మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ప్రస్తుతం అలా లేదు. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు కూడా గుండెపోటు వస్తోంది. ఇది అందరినీ కలవరపెట్టే వార్తే. మనం వార్తల్లో ఆ పని చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ పని చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు అని చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా కొంత మందికి నిద్రలో కూడా గుండెపోటు సంభవిస్తుంది. ఇలా […]

Share:

నేటి రోజుల్లో అనేక మంది గుండెపోటుతో సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు 60+ వయసులో మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ప్రస్తుతం అలా లేదు. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు కూడా గుండెపోటు వస్తోంది. ఇది అందరినీ కలవరపెట్టే వార్తే. మనం వార్తల్లో ఆ పని చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ పని చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు అని చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా కొంత మందికి నిద్రలో కూడా గుండెపోటు సంభవిస్తుంది. ఇలా నిద్రలో గుండెపోటు రావడం కూడా ఈ మధ్య కామన్ గా జరుగుతుంది. ఇలా సడెన్ గా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వారసత్వంగా వచ్చే జబ్బుల వల్ల కొంత మందికి గుండెపోటు వస్తే, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి చేయడం మూలాన మరికొంత మందికి గుండెపోటు వస్తుంది. 

నిద్రలోనే అనంత లోకాలకు… 

ఇలా నిద్రలోనే గుండెపోటు వచ్చి ఇప్పటికే అనేక మంది తనువు చాలించారు. రీసెంట్ గా సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ రాఘవేంద్ర అనే వ్యక్తి భార్య కూడా కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసింది. ఆమె వయసు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే. ఓ వెకేషన్ ట్రిప్ లో ఉండగా.. రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆమె తిరిగి లేవలేకోయింది. నిద్రలోనే అనంతలోకాలకు పయనమైంది. ఇలా ఆమె ఒక్క వ్యక్తే కాకుండా అనేక మంది కార్డియాక్ అరెస్ట్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా సడెన్ కార్డియాక్ అరెస్ట్ అటాక్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు అని చాలా మంది నొక్కి వక్కానిస్తున్నారు. మనం ఎటువంటి ఫుడ్ తింటున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. లేకపోతే ఇటువంటి ప్రమాదాలకు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

గుండెపోటు వచ్చేందుకు కారణాలు అనేకం… 

గుండెపోటు వచ్చేందుకు కారణాలు అనేకం ఉంటాయని పలువురు వైద్యులు చెబుతున్నారు. నిద్రలో చనిపోవడం అనేది ఆకస్మికంగా గుండె ఆగిపోవడం వల్ల జరుగుతుంది. వారు నిద్రలోనే ఉండి తనువు చాలిస్తారు. ఇందుకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి పరిశీలిస్తే

  1. వారసత్వంగా వచ్చే గుండె జబ్బులు: వారసత్వంగా వచ్చే గుండె జబ్బులు సడెన్ కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి. జన్యుపరమైన కారణాలు కూడా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతాయి. 
  2. వివిధ రకాల గుండె జబ్బులు: వివిధ రకాలుగా ఉండే గుండె జబ్బులు కూడా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతాయి. కొంత మంది వ్యక్తులలో పుట్టుకతోనే గుండె పరిమాణంలో మార్పులు, ఇంకా ఇతర డిఫరెన్సెస్ ఉంటాయి. అటువంటి వారికి సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. 
  3. అరిథ్మియా: అసంబద్ధంగా ఉండే హార్ట్ రిథమ్స్ (లయలు/గుండె కొట్టుకోవడం) కూడా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతాయి. అందుకోసమే ఈ పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
  4. మన హెల్త్ కండీషన్స్: నేటి రోజుల్లో చాలా మంది ఒబెసిటీ (ఊబకాయం)తో సఫర్ అవుతున్నారు. ఈ ఒబెసిటీ కాకుండా మరికొన్ని హెల్త్ కండీషన్స్ కూడా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు దారి తీస్తాయి. 

మన శరీరం ఎంత పెద్దగా ఉన్నా కానీ అది ఎంత గంభీరంగా కనిపించినా కానీ లోపల స్మూత్ గా ఉండే గుండె వల్లే ఇదంతా సాధ్యం. అందుకోసమే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మనం తీవ్రంగా సఫర్ కావాల్సి వస్తుంది. అందుకోసమే గుండెను సరిగ్గా మెయింటేన్ చేయాలి. 

ఇలా చేస్తే సరి… 

గుండె ఆరోగ్యాన్ని సరిగ్గా మెయింటేన్ చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. అంతే కాకుండా ఇది పెద్ద ప్రాసెస్ కాదు. చాలా సింపుల్ గా మనం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముందు మనం చెప్పుకోవాల్సింది రెగ్యులర్ హెల్త్ చెకప్స్ గురించి.. మనం ఎటువంటి ప్రాబ్లంను ఫేస్ చేయకున్నా కానీ రెగ్యులర్ గా  హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం. ఈ చెకప్స్ వల్ల మన గుండెకు ఏమన్నా ప్రమాదం సంభవించినా లేక ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నా కానీ మనం వెంటనే గమనించవచ్చు. దానికి సరైన మందులను తీసుకోవచ్చు. కేవలం రెగ్యులర్ చెకప్స్ మాత్రమే కాకుండా మంచి లైఫ్ స్టైల్ ను కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యం. మనం మంచి లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేసినపుడు మన గుండె చాలా సేఫ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.