Selfie: సెల్ఫీలో సన్నగా ఉన్నామంటూ మురిసిపోతున్నారా? ఈ విషయం మీకోసమే..

ఇంట్లో ఉన్న, బయట ఉన్న, కాలేజీల్లో ఉన్న, ఆఫీసుల్లో ఉన్న, పార్టీలో ఇలా, ఎక్కడ ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ కాలంలో సెల్ఫీ తీసుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు తప్పకుండా సెల్ఫీ తీసుకోవాలని, కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడు సెల్ఫీ తప్పకుండా తీసుకోవాలని, ఇలా ప్రతి ఒక్కరూ సెల్ఫీ(Selfie) మోజులో పడిపోయారు.. కానీ నిజానికి సెల్ఫీ(Selfie) తీసుకోవాలి అనే […]

Share:

ఇంట్లో ఉన్న, బయట ఉన్న, కాలేజీల్లో ఉన్న, ఆఫీసుల్లో ఉన్న, పార్టీలో ఇలా, ఎక్కడ ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ కాలంలో సెల్ఫీ తీసుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు తప్పకుండా సెల్ఫీ తీసుకోవాలని, కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడు సెల్ఫీ తప్పకుండా తీసుకోవాలని, ఇలా ప్రతి ఒక్కరూ సెల్ఫీ(Selfie) మోజులో పడిపోయారు.. కానీ నిజానికి సెల్ఫీ(Selfie) తీసుకోవాలి అనే ఆలోచన మన ఆలోచన ధోరణి మీద ప్రభావం చూపిస్తుందని కొన్ని అధ్యాయాలు తేల్చాయి.. దీని గురించి మరింత తెలుసుకుందాం రండి.. 

సెల్ఫీ..మన ఆలోచన ధోరణి మార్చేస్తుందా? 

సోషల్ మీడియా(Social Media)లో ఎక్కువగా సగటు మనిషి తీసుకునే ఫోటోలు షేర్ చేసుకునే విధంగా ఉంటుంది, సెల్ఫీ(Selfie)లు ఎక్కువగా సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో సెల్ఫీ(Selfie)లకు అపారమైన ప్రజాదరణను వచ్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం, చాలా మంది సైంటిస్టులు సగటు మనిషి తీసుకునే సెల్ఫీ విషయం మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు.. ఈ విషయానికి సంబంధించిన ఫలితాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. 

PLOS One జర్నల్‌లో ప్రచురించబడిన ఇటీవలి ఒక రీసెర్చ్(Research) ప్రకారం, సెల్ఫీ(Selfie)లు తీసుకోవడం అనేది సన్నగా కనిపించే భ్రమను సృష్టిస్తుందని వెల్లడిస్తుంది. యార్క్ సెయింట్ జాన్ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ యార్క్ సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్(Research) ప్రకారం, ఇతర కోణాల నుండి తీసిన ఫోటో(Photo)ల కంటే సెల్ఫీ(Selfie) ఫోటోగ్రాఫ్‌లలో ముఖ్యంగా అమ్మాయిల శరీర ఆకృతి సన్నగా ఉన్నాదని ఎక్కువమంది రేట్ చేసారు.

అయితే సైంటిస్టులు చేసిన రీసెర్చ్(Research) లో సుమారు 272 మంది పాల్గొనగా, వారు 10 యాంగిల్స్ లో తీసుకున్న ఫోటో(Photo)లను షేర్ చేయాలి. ఇందులో ముఖ్యంగా సెల్ఫీ(Selfie) యాంగిల్, చిన్-డౌన్ యాంగిల్ మరియు స్ట్రెయిట్-ఆన్ యాంగిల్ ఫోటో(Photo)లను పరిగణలోకి తీసుకున్నారు. పాల్గొనేవారు రెండు యాంగిల్స్‌లో తీసుకున్న ఫోటో(Photo)లతో పోలిస్తే, సెల్ఫీ ఫోటోలలోని చాలా సన్నగా ఉన్నట్లు రేట్ చేసారు.

నివేదికల ప్రకారం, రీసెర్చ్(Research) ప్రకారం వచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే, సగటు మనిషి మామూలు ఫోటో(Photo)లు చూడటం కంటే, సెల్ఫీ(Selfie) ఫోటోలు తీసుకోవడం, అంతేకాకుండా వాటిని చూసుకోవడం అనేవి రోజు వారు తీసుకునే ఆహార అలవాట్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ముఖ్యంగా సెల్ఫీ(Selfie) దిగుతూ తమని తాము సన్నగా ఉన్నామంటూ మురిసిపోవడం, లేదంటే అవతల వ్యక్తి సన్నగా ఉన్నారు అంటూ తమను తాము కించపరుచుకోవడం.. ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని.. సెల్ఫీలు తీసుకోవడం చూడడం కూడా సగటు మనిషి ఆలోచన విధానానికి ఎంతో హానికరం అంటూ చెప్పుకొస్తున్నారు నిపుణులు.

అంతేకాకుండా తప్పకుండా సోషల్ మీడియా(Social Media)లో ప్రతి ఒక్కరు సెల్ఫీ(Selfie) ఫోటోలు ద్వారా సగటు మనిషి శరీర బరువులను ఎత్తిచూపటం వంటివి, ఎదుట మనిషిని జడ్జి చేయడం వంటివి ఏ విధంగా ఉంటాయో మరిన్ని పరిశోధనల ద్వారా తప్పకుండా తెలుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పరిశోధకులు సూచిస్తున్న విషయాలు చూసుకుంటే, ఫోటోలను నిజజీవితలను కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి ఆలోచన చేసుకోకపోవడం మంచిదని, అదే మన జీవనశైలికి సహాయపడుతుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా సన్నగా కనపడేందుకు చాలామంది ఫిల్టర్లు ఉపయోగిస్తారని, అంతేకాకుండా తాము తీసుకునే యాంగిల్ ప్రకారం కూడా ఫోటో(Photo)లో మనిషి సన్నగా కనిపిస్తారని, ప్రతి మనిషి సెల్ఫీ(Selfie) చూసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలని మరొకసారి గుర్తు చేశారు నిపుణులు. ఇలాంటివి మనం గమనించుకోపోయినట్లయితే, మనం సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు, లేదా ఇతరుల సెల్ఫీ(Selfie)లను చూసేటప్పుడు సగటు మనిషి జీవన శైలి మీద ప్రభావితం చూపే అవకాశం ఉంటుందని.. అందుకే ఫోటో(Photo)ల గురించి ఎక్కువగా హైరానా పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.