భారతదేశంలో 87.5 ల‌క్ష‌ల‌కు చేరిన నడుమునొప్పి కేసులు

ప్రొఫెసర్ డాక్టర్ రాఖీ దండోనా, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) మాట్లాడుతూ “మస్క్యులోస్కెలెటల్ పరిస్థితులపై తక్కువ డేటా లభ్యత కారణంగా ఈ సంఖ్య ఇలా ఉంటుంది” అని  చెప్పారు. అంధేరికి చెందిన అరవై ఏళ్ల సవితా బురంగే కుమారుడు అనిల్, పన్వెల్ నుంచి పూణే వరకు వున్న వైద్యులను సంప్రదించాడు. “నా తల్లి గత 15 సంవత్సరాలుగా నడుము నొప్పితో బాధపడుతోంది. ఐస్ థెరపీ, మొబిలిటీ వ్యాయామాలు మరియు నొప్పి నివారణ మందులు కొన్ని […]

Share:

ప్రొఫెసర్ డాక్టర్ రాఖీ దండోనా, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) మాట్లాడుతూ “మస్క్యులోస్కెలెటల్ పరిస్థితులపై తక్కువ డేటా లభ్యత కారణంగా ఈ సంఖ్య ఇలా ఉంటుంది” అని  చెప్పారు.

అంధేరికి చెందిన అరవై ఏళ్ల సవితా బురంగే కుమారుడు అనిల్, పన్వెల్ నుంచి పూణే వరకు వున్న వైద్యులను సంప్రదించాడు. “నా తల్లి గత 15 సంవత్సరాలుగా నడుము నొప్పితో బాధపడుతోంది. ఐస్ థెరపీ, మొబిలిటీ వ్యాయామాలు మరియు నొప్పి నివారణ మందులు కొన్ని నెలల పాటు సహాయపడతాయి, కానీ ఆమె మళ్లీ మాములుగా ఇంటి పనులను చేయలేకపోయింది, ”అని అనిల్ చెప్పారు. సవిత ఇప్పుడు పూణేలోని సంచేతి హాస్పిటల్‌లో వెన్నెముక నిపుణుల ద్వారా చికిత్స అందుకుంటుంది మరియు ఆమె నడుము నుంచి మొదలుకొని కాళ్ళ వరకు నొప్పితో బలహీనంగా ఉందని చెప్పింది.

మరొక వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి- పూణేకి చెందిన 55 ఏళ్ల సెకండరీ స్కూల్ టీచర్ – తరగతిలో ఎక్కువసేపు నిలబడటం ఆమె పరిస్థితిని మరింత దిగజార్చింది. “ఒక సంవత్సరంలో, నేను కనీసం రెండు నుండి మూడు సార్లు తీవ్రమైన నడుము నొప్పితో తీవ్రంగా బాధపడ్డాను మరియు పనికి దూరంగా ఉండవలసి వచ్చింది” అని ఆ నొప్పిని కూడా గుర్తు చేసుకోనంత బాధతో మాట్లాడాడు ఉపాధ్యాయుడు. సవిత డీహైడ్రేటెడ్ క్రానిక్ లంబార్ డిసీజ్‌తో బాధపడుతుండగా, టీచర్‌కు తీవ్రమైన లంబార్ డిస్క్ ఉబ్బిన సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ది లాన్సెట్ రుమటాలజీలో ఈ నెలలో ప్రచురితం జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో నడుము నొప్పికి సంబంధించిన 87.5 మిలియన్ కేసులు  ఉన్నాయి. 

నడుము నొప్పి కేసులు ఎందుకు ఎక్కువయ్యాయి:

“మస్క్యులోస్కెలెటల్ పరిస్థితులపై తక్కువ డేటా లభ్యత కారణంగా మరియు ఈ అంచనాలు కోవిడ్ -19 యొక్క ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోనందున ఈ సంఖ్య ఇలా ఉండి ఉండొచ్చు” అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) ప్రొఫెసర్ డాక్టర్ రాఖీ దండోనా చెప్పారు. 

“సెలెక్టివ్ కేసులలో శస్త్రచికిత్స ఉపయోగకరంగా ఉంటుంది, కానీ ఇది సరేనా శాశ్వతమైన పరిష్కారం కాదు అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక వెన్నునొప్పి తరచుగా పెరుగుతున్న వయస్సుకు సంబంధించినది, మరియు సాధారణ కారణాలలో వెన్నెముక యొక్క ఆర్థరైటిస్, స్పైనల్ స్టెనోసిస్ మరియు ఉబ్బిన డిస్క్ వంటి డిస్క్ సమస్యలు ఉన్నాయి. నాన్-సర్జికల్ మేనేజ్‌మెంట్ నడుముకు సంబంధించి సమస్యలకు చాలా వరకు సహాయం చేయగలరు, ”అని హద్గాంకర్ చెప్పారు.

ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం, వంగడం లేదా ఎత్తడం వంటి వృత్తిపరమైన పనుల కారణంగా వెన్నునొప్పి రావడం సాధారణ విషయమని YLDలను ఇది ఆపాదించింది. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం మరియు గణనీయమైన సామాజిక మరియు ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య ఎజెండాలో, వెన్ను నొప్పులకు శాశ్వత పరిష్కారం, అంతేకాకుండా వెళ్ళినొప్పి ఈ సమస్యలను తగ్గించే క్రమం ఇందులో కనిపించడం లేదని PHFI యొక్క దండోనా చెప్పారు.

“భారతదేశంలో, నొప్పిని తాగించుకోవడానీకి ప్రజలు అనుసరించే మార్గాలను డాక్యుమెంట్ చేయడంలో మనం పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా జనాభాలో నడుము నొప్పి నివారణ వ్యూహాలను రూపొందించడం, కార్యాలయాల పనుల కారణంగా వచ్చే వెన్నునొప్పిని తగ్గించడం, తగిన పునరావాస సేవల లభ్యతను సులభతరం చేస్తాయి, ”అని ఆమె చెప్పింది.