పెరుగుతున్న డెంగ్యూ కేసులు

వర్షాకాలం మొదలైంది అంటే చాలు ఎక్కడపడితే అక్కడ అంటు రోగాలు, ఆందోళన కలిగించే అనారోగ్యాలు వాటిల్లుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏ మూల నుంచి ఏ వ్యాధి సోకుతుందో అనే భయం మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న క్రమంలో, విపరీతమైన దోమలు కూడా ఎక్కువైపోయాయి. చాలా ప్రాంతాలలో డెంగ్యూ వైరస్ వ్యాప్తి ఎక్కువైనట్లు సమాచారం. హైదరాబాదులో డెంగ్యూ కలకలం:  హైదరాబాద్ నగరం డెంగ్యూ కేసులతో […]

Share:

వర్షాకాలం మొదలైంది అంటే చాలు ఎక్కడపడితే అక్కడ అంటు రోగాలు, ఆందోళన కలిగించే అనారోగ్యాలు వాటిల్లుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏ మూల నుంచి ఏ వ్యాధి సోకుతుందో అనే భయం మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న క్రమంలో, విపరీతమైన దోమలు కూడా ఎక్కువైపోయాయి. చాలా ప్రాంతాలలో డెంగ్యూ వైరస్ వ్యాప్తి ఎక్కువైనట్లు సమాచారం.

హైదరాబాదులో డెంగ్యూ కలకలం: 

హైదరాబాద్ నగరం డెంగ్యూ కేసులతో వార్తల్లో నిలుస్తోంది. ఆగస్టు నెలలోనే డెంగ్యూ బారినపడిన వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. కేవలం నెల రోజుల్లోనే 164 కేసుల సంఖ్య ఇప్పుడు 1171కి చేరాయి. సంవత్సరం మొదటి 8 నెలల్లో నమోదైన కేసుల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల్లో సగం హైదరాబాద్‌లో నమోదైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి, రాష్ట్రంలో 2972 డెంగ్యూ కేసులు నమోదవగా, హైదరాబాద్‌లోనే 1562 కేసులు నమోదయ్యాయి. 

డెంగ్యూ అనేది ఒక పట్టణ వ్యాధిగా పేరుగాంచింది. దాని వ్యాప్తికి ప్రధాన కారణం, రోడ్లపై, నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణ ప్రదేశాలలో నిలిచిపోయిన నీరు. దోమల సంతానోత్పత్తి కూడా ఒక కారణం. గత ఐదు దశాబ్దాలుగా డెంగ్యూ వైరస్ బాగా అభివృద్ధి చెందింది. ప్రారంభంలో, కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయి- DENV1, DENV3 మాత్రమే ఉండగా, 2012 తర్వాత, DENV2 అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక DENV4 దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరణాల విషయానికొస్తే, దాని వెనుక ప్రధాన కారణం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లేదా డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. 

డెంగ్యూ వస్తే కలిగే సంకేతాలు: 

డెంగ్యూ సోకిన వారిలో ముఖ్యంగా, తీవ్రమైన కడుపునొప్పి, నిరంతర వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్లు లేదా ముక్కు నుండి రక్తస్రావం, అలసట, గ్రంథులు వాపు, దద్దుర్లు, విశ్రాంతి లేకపోవడం, వాంతులలో  లేదా మలంలో రక్తం, దాహం ఎక్కువగా వేయడం, శరీర చర్మం రంగు మారడం, సున్నితంగా అవ్వడం, మరియు బలహీనంగా అనిపించడం వంటి డెంగ్యూ లక్షణాలు తరచుగా జ్వరం తర్వాత వస్తాయి. ప్లేట్‌లెట్ కౌంట్ లో ముఖ్యంగా తగ్గుదల, డెంగ్యూ విలక్షణమైన లక్షణం, ఈ లక్షణాలు కనిపించిన వారు తక్షణమే ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో అవసరం. అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. 

డెంగ్యూ నివారణ: 

ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలు ఎక్కువగా వేసుకోవాలి, దోమల మందు వేయడం, దోమతెరలు మరియు రిపెల్లెంట్‌లు ఉపయోగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమ కాటుకు గురవకొండ చూసుకునే పలు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే వ్యాధిని నివారించడానికి ఏకైక మార్గం. డెంగ్యూ నిర్వహణలో ప్రారంభ రోగ నిర్ధారణ, పర్యవేక్షణ మరియు చికిత్స ప్రారంభించడం అనేవి ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తాయి. 

పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరి: 

డెంగ్యూ సోకిన వారిలో ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పిస్తే మళ్లీ ప్లేట్లెట్ కౌంట్ పెరిగే అవకాశం ఉండదు. ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తిలో ప్లేట్లెట్ కౌంట్ తప్పకుండా పెరిగితీరాల్సిందే. విటమిన్ కె, ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి విటమిన్ మరియు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడంతో పాటుగా, ప్రత్యేకమైన వైద్యం చేయడంలో సహాయపడతాయి. బొప్పాయి, దానిమ్మ మరియు సిట్రస్ పండ్లు వంటి ఆహారాలు తక్కువ ప్లేట్‌లెట్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. 

డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి, జ్వరం, నొప్పి మరియు అసౌకర్యం వంటి లక్షణాలను వీలైనంత త్వరగా పరిష్కరించి, బాధను తగ్గించి, వేగంగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. డెంగ్యూ వచ్చిన వారికి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఎంతో అవసరం పడుతుంది. వైరస్ లక్షణాల తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకిన పిల్లల విషయంలో అశ్రద్ధ చేస్తే ముప్పు తప్పదు అంటూ, అంకురా హాస్పిటల్ సిఫార్సు చేస్తోంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే, పలు జాగ్రత్తలు తీసుకుని, ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవడం ఎంతో అవసరం