నార్మల్ వాటర్ లేదా కార్బోనేటెడ్ వాటర్.. ఏది మంచిది? 

స్పార్క్లింగ్ వాటర్, “సెల్ట్జర్ వాటర్” లేదా “కార్బోనేటేడ్ వాటర్” అని కూడా పిలుస్తారు. అయితే స్పార్క్లింగ్ వాటర్లో కార్బన్ డయాక్సైడ్ బబుల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్కువగా రెస్టారెంట్లలో నార్మల్ వాటర్ కన్నా కార్బోనేటెడ్ వాటర్ తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం నార్మల్ వాటర్ లేదంటే కార్బొనేటెడ్ వాటర్ మధ్య ఉన్న తేడాలని తెలుసుకుందాం ఇది మంచిదో గ్రహిద్దాం.. కార్బొనేటెడ్ వాటర్:  మనం ప్రతిరోజు తాగే నార్మల్ వాటర్ […]

Share:

స్పార్క్లింగ్ వాటర్, “సెల్ట్జర్ వాటర్” లేదా “కార్బోనేటేడ్ వాటర్” అని కూడా పిలుస్తారు. అయితే స్పార్క్లింగ్ వాటర్లో కార్బన్ డయాక్సైడ్ బబుల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్కువగా రెస్టారెంట్లలో నార్మల్ వాటర్ కన్నా కార్బోనేటెడ్ వాటర్ తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం నార్మల్ వాటర్ లేదంటే కార్బొనేటెడ్ వాటర్ మధ్య ఉన్న తేడాలని తెలుసుకుందాం ఇది మంచిదో గ్రహిద్దాం..

కార్బొనేటెడ్ వాటర్: 

మనం ప్రతిరోజు తాగే నార్మల్ వాటర్ తో పోలిస్తే ఈ కార్బొనేటెడ్ వాటర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇటువంటి కార్బొనేటెడ్ వాటర్ అనేది అనేక రూపాల్లో మనకి కనిపిస్తాయి. వివిధ రకాల కార్బొనేటెడ్ వాటర్లో క్లబ్ సోడా, సోడా వాటర్, సెల్ట్జర్ వాటర్, మినరల్ వాటర్ మరియు టానిక్ వాటర్ ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.

మినరల్ వాటర్ విషయములో మనకి మినరల్స్ తో పాటుగా, సల్ఫర్ అదేవిధంగా సహజ వాటర్ బబుల్స్ మనకి కనిపిస్తాయి. టానిక్ వాటర్ లో షుగర్ లాంటి పదార్థాలు లేదా అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌తో పాటు క్వినైన్ ఉంటుంది. ఇతర కార్బొనేటెడ్ వాటర్లలో సెల్ట్‌జర్‌లు తో పాటుగా కొంత షుగర్ లేదంటే కృత్రిమ స్వీటెనర్‌లను ఆడ్ చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి కార్బొనేటెడ్ వాటర్ కొనుగోలు చేసే ముందు మినరల్ కి సంబంధించిన లేబుల్‌ని చదవడం ఎంతో ముఖ్య.

కార్బొనేటెడ్ వాటర్ ప్రయోజనాలు: 

హైడ్రేషన్

కార్బొనేటెడ్ వాటర్ అనేది నార్మల్ వాటర్ లాగానే హైడ్రేట్ గా మనల్ని ఉంచుతుంది. కార్బొనేటెడ్ వాటర్ తాగిన వెంటనే మనకి విశ్రాంతిగా ఉంటుంది. మీరు డీహైడ్రేట్ అయినట్లయితే, మీకు నోరు పొడిబారడం, అలసట, తలనొప్పి మరియు స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బంది ఉండవచ్చు. దీర్ఘకాలిక డిహైడ్రేషన్ సమస్య ఉంటే గనక, జీర్ణ సమస్యలు మరియు గుండె మరియు మూత్రపిండాలతో సహ అనేక సమస్యలకు దోహదం చేస్తుంది.

వెయిట్ మేనేజ్మెంట్:

హైడ్రేటెడ్‌గా ఉండటం నిజానికి బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు త్రాగడం వలన మీరు ఎక్కువ సేపు ఉన్నప్పటికీ, రోజంతా తక్కువ కేలరీలను వినియోగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, కార్బొనేటెడ్ వాటర్ అనేది ముఖ్యంగా ఎక్కువ క్యాలరీస్ తో ఉన్న డ్రింక్స్ పక్కన పెట్టడానికి సహాయపడుతుంది. ఎక్కువ క్యాలరీస్ ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల, ఊబకాయం మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఉంది:

జీర్ణ సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులు కార్బొనేటెడ్ వాటర్ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మరియు మలబద్ధకం వంటి అనేక ఇతర లక్షణాలను ఉపశమనం చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

కార్బొనేటెడ్ వాటర్ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు:

కార్బోనేటెడ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. ఇందులో ఉండే కొన్ని స్వీట్నెస్ పెంచే పదార్థాలు కారణంగా, బాడీలో షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్బోనేట్ వాటర్ అప్పుడప్పుడు తాగడంలో తప్పులేదు.