ఇంటి చిట్కాలతో మడమల పగుళ్లు తగ్గించుకొని మృదువుగా చేసుకోవచ్చు

పాదాల పగుళ్లకు ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలువంటింట్లోనే దొరికేస్తాయి.. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు  ఒక వ్యక్తి అందం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు. కాళ్లు, చేతులను బట్టి కూడా వారి అందం అభివర్ణించబడుతుంది. ఒక వ్యక్తి ముఖం ఎంత అందంగా ఉన్నా.. వారి చేతులు, పాదాల పగుళ్లతో ఉంటే నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. ముఖం యొక్క అందాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చాలామంది వారి పాదాల గురించి పట్టించుకోరు. శారీరక ఆకర్షణను కాపాడుకోవడంలో ముఖంతో పాటు […]

Share:

పాదాల పగుళ్లకు ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు
వంటింట్లోనే దొరికేస్తాయి.. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు 


ఒక వ్యక్తి అందం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు. కాళ్లు, చేతులను బట్టి కూడా వారి అందం అభివర్ణించబడుతుంది. ఒక వ్యక్తి ముఖం ఎంత అందంగా ఉన్నా.. వారి చేతులు, పాదాల పగుళ్లతో ఉంటే నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. ముఖం యొక్క అందాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చాలామంది వారి పాదాల గురించి పట్టించుకోరు. శారీరక ఆకర్షణను కాపాడుకోవడంలో ముఖంతో పాటు పాదాల పాత్ర కూడా ఉంటుంది.

మన ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. పాదాల విషయంలో పెట్టకపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. దీనిని మొదటిలోనే తగ్గించుకోవాలి. లేకుంటే ఈ సమస్య కాలక్రమేణా పెరిగి నొప్పి, రక్తస్రావం ప్రారంభమవుతుంది. సక్రమంగా ఆహారం తీసుకోవడం, విటమిన్ E లేకపోవడం, కాల్షియం, ఐరన్ తగినంత మొత్తంలో అందకపోవడం వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. పగిలిన మడమలను నయం చేయగలవని చెప్పే క్రీములు మార్కెట్లో చాలానే ఉన్నప్పటికీ హోం రెమెడీస్‌తోనే మరింత ప్రయోజనం పొందవచ్చు. ఈ సాధారణ చిట్కాల సహాయంతో మృదువైన అందమైన మడమలను పొందవచ్చు. అలాంటి హోం రెమెడీస్ ఏం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

కొబ్బరి నూనె, తేనె

పగిలిన పాదాలకు కొబ్బరి నూనె, తేనె త్వరిత ఉపశమనాన్ని ఇస్తాయి. దీనికోసం రాత్రిపూట పడుకునే ముందు మీ పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, కొంచెం తేనెను తీసుకొని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత దీనిని పగిలిన మడమల మీద మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ వల్ల అలసట కూడా తగ్గుతుంది. ఆ తర్వాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచి పాదాలను నీళ్లతో కడుక్కోవాలి. ఈలాగే కొన్ని రోజులపాటు ఉపయోగిస్తే మీ పాదాలు ఆరోగ్యంగా, మృదువుగా మారుతాయి.

గ్లిజరిన్, నిమ్మరసం

గ్లిజరిన్ చీలమండలను మృదువుగా చేస్తుంది. నిమ్మరసం మృత  కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం గ్లిజరిన్, తేనెలో కొంత నిమ్మరసాన్ని కలుపుకోవాలి. రాత్రిపూట మీ పాదాలను కడిగి, తడి పూర్తిగా ఆరిన తర్వాత పగుళ్లపై మసాజ్ చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే మీ పాదాల పగుళ్లు తగ్గడం గమనించవచ్చు.

మైనంతో మాస్క్

ఒక స్టీల్ బౌల్‌లో  ఒక కొవ్వొత్తిని ఉంచి, దానిని గ్యాస్‌పై ఉంచి మైనాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ కరిగించిన మైనానికి రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనె లేదా కొబ్బరినూనె కలుపుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత సాక్స్ వేసుకుని నిద్రపోవాలి. ఇలా తరచుగా చేస్తుండటం వల్ల మడమల పగుళ్ల సమస్య కొద్ది రోజుల్లోనే నయమవుతుంది.

బనానా మాస్క్

అరటిపండు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నిజానికి అరటిపండు అద్భుతమైన సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముందుగా అరటిపండుని మెత్తగా చేసుకోవాలి. దీనికి పచ్చి పాలు, తేనె కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్‌ని పాదాల పగుళ్లలో అప్లయి చేసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుండటం వల్ల పాదాలపై పగిలిన చర్మం మృదువుగా మారి మీ పాదాలు కొద్ది రోజుల్లోనే మునుపటిలా తయారవుతాయి.

చూశారుగా, పాదాల పగుళ్లకు ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన చిట్కాలు.. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి మరి.