హెర్బల్ మాస్క్‌‌తో ఇంట్లోనే మృదువైన కురులు

మృదువైన హెయిర్ కావాలా? అయితే మీ ఇంట్లోనే మ్యాజిక్ లాంటి మాస్క్‌లుకెమికల్స్ లేకుండానే హెర్బల్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే తయారీ ప్రస్తుత కాలంలో జుట్టు పెరుగుదల మీదే కాకుండా మృదువుగా ఉంచుకోవడంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రింగులుగా, మెరిసే, సిల్కీ హెయిర్‌ని కోరుకుంటారు. అయితే సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. దీంతో జుట్టు నిర్జీవంగా, పొడిగా, బలహీనంగా మారుతుంది. ఇది అందాన్ని తగ్గించడమే కాకుండా  మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది.  […]

Share:

మృదువైన హెయిర్ కావాలా? అయితే మీ ఇంట్లోనే మ్యాజిక్ లాంటి మాస్క్‌లు
కెమికల్స్ లేకుండానే హెర్బల్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే తయారీ

ప్రస్తుత కాలంలో జుట్టు పెరుగుదల మీదే కాకుండా మృదువుగా ఉంచుకోవడంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రింగులుగా, మెరిసే, సిల్కీ హెయిర్‌ని కోరుకుంటారు. అయితే సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. దీంతో జుట్టు నిర్జీవంగా, పొడిగా, బలహీనంగా మారుతుంది. ఇది అందాన్ని తగ్గించడమే కాకుండా  మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. 

అందుకని జుట్టు మృదుత్వాన్ని పెంచడానికి వివిధ రకాల హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తారు. కొంతమంది సెలూన్‌లో స్మూత్‌నెస్ కోసం ట్రీట్‌మెంట్లు కూడా తీసుకుంటారు. అయితే సెలూన్లలో జుట్టును మృదువుగా చేయడానికి అనేక రకాలు కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కెమికల్ ట్రీట్‌‌‌మెంట్లు ఎల్లప్పుడూ జుట్టు కుదుళ్లకు నష్టం కలిగిస్తాయి. అందుకోసమే జుట్టు పొడితనాన్ని తగ్గించడం కోసం ఇంట్లోనే హెర్బల్ పదార్థాలు మరియు నేచురల్ హెయిర్ మాస్క్‌లు వాడటం మంచిది. ఇంట్లోనే సిల్కీ, సాఫ్ట్ హెయిర్ కోసం హెర్బల్, నేచురల్ హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండుతో హెయిర్ మాస్క్

పొడిబారిన, దెబ్బతిన్న జుట్టును సరిచేసుకోవడానికి అరటిపండుని మించినది ఏదీ లేదు. అరటిపండు మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. ఇది జుట్టుకు తగిన హైడ్రేషన్‌ని అందించి మృదువుగా మారుస్తుంది. అరటిపండులో పొటాషియం, విటమిన్ బి-6, విటమిన్ సి, మెగ్నీషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు కుదుళ్లను బలపరిచి, కొత్త హెయిర్ ఫోలికల్స్‌ వచ్చేలా సహాయపడుతుంది. దీనిలోని పోషకాలన్నీ జుట్టుకు పోషణనిచ్చి అందంగా మరియు ఆరోగ్యంగా మారుస్తాయి. అరటిపండు హెయిర్ మాస్క్ చేసుకోవడానికి

ఒక గిన్నెలో బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానికి రెండు చెంచాల స్వచ్ఛమైన తేనే కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే దీనిలో గుడ్డు కూడా కలుపుకోవచ్చు. మీరు గుడ్డు వద్దనుకుంటే నారింజ, నిమ్మ నూనె వాడుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాలన్నింటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు మర్దన చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచిన తర్వాత కడిగేయాలి. కొన్ని రోజుల్లో మీ జుట్టు సిల్కీగా, మృదువుగా మారడం గమనించవచ్చు.

బొప్పాయి మాస్క్‌తో భలే జుట్టు

బొప్పాయి జుట్టుకు అత్యంత ప్రయోజనకరమైన పదార్ధం. బొప్పాయిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పొడి జుట్టుకు బొప్పాయి అసమానమైన మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది. బొప్పాయి హెయిర్ మాస్క్ చేయడానికి బొప్పాయిని పొట్టు లేకుండా ఒక గుప్పెడు తీసుకుని బాగా మెత్తగా చేయాలి. తర్వాత మిక్సీలో కొంచెం తేనే వేసి కొద్దిగా పచ్చి పాలను మిక్స్ చేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. అనంతరం జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకు మందంగా అప్లయి చేసుకోవాలి. సుమారు అరగంట పాటు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. 

కొబ్బరి పాలతో సిల్కీ, షైనీగా

జుట్టు పొడవుగా పెరడంలో కొబ్బరి పాలు బాగా సహాయపడతాయి. అలాగే పొడి జుట్టుని సిల్కీగా, బలంగా మార్చగల లక్షణాలు కొబ్బరి పాల సొంతం. కొబ్బరి పాలతో చేసుకున్న మాస్క్ దెబ్బతిన్న జుట్టుకు పోషకాలను అందిస్తుంది. ఈ మాస్క్ తయారీ కోసం అరకప్పు కొబ్బరి పాలలో కొద్దిగా బాదం నూనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాస్క్ లాగా జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత తక్కువ గాఢత గల షాంపూతో కడిగేసుకోవాలి. ఈ విధానాన్ని తరచుగా చేస్తుండటం వల్ల జుట్టు సిల్కీ, షైనీగా తయారవుతుంది.

చూశారుగా  మృదువైన కురులకోసం ఎలాంటి మ్యాజిక్ మాస్కులు తయారు చేసుకోవచ్చో.. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు తయారు చేసుకోండి మరి.