నిద్ర‌లో తినేసే రోగం గురించి తెలుసా?

నేటి రోజుల్లో చాలా మంది సరైన విధంగా స్లీపింగ్ లేక అవస్థలు పడుతున్నారు. పడుకునేందుకు ఎంత ట్రై చేసినా కానీ సరైన విధంగా నిద్ర పట్టక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మందికి నిద్ర పట్టక ఇబ్బందులు తలెత్తుతుంటే కొంత మంది మాత్రం అతి నిద్ర వల్ల ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఇలా కొంత మందికి అధిక నిద్ర మరి కొంత మందికి నిద్ర లేకపోవడానికి మన పాటించే లైఫ్ స్టైలే కారణమని అనేక మంది వైద్య […]

Share:

నేటి రోజుల్లో చాలా మంది సరైన విధంగా స్లీపింగ్ లేక అవస్థలు పడుతున్నారు. పడుకునేందుకు ఎంత ట్రై చేసినా కానీ సరైన విధంగా నిద్ర పట్టక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మందికి నిద్ర పట్టక ఇబ్బందులు తలెత్తుతుంటే కొంత మంది మాత్రం అతి నిద్ర వల్ల ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఇలా కొంత మందికి అధిక నిద్ర మరి కొంత మందికి నిద్ర లేకపోవడానికి మన పాటించే లైఫ్ స్టైలే కారణమని అనేక మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం తమ లైఫ్ స్టైల్ ను చేంజ్ చేసుకోకుండా ఉంటూ సమస్యలను ఫేస్ చేస్తున్నారు. 

తింటుంటే నిద్ర వస్తోందా? 

కొంత మందికి మరీ ఘోరంగా తింటుంటూనే నిద్ర వస్తూ ఉంటుంది. ఇటువంటి డిజార్డర్ తో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ డిజార్డర్ ను SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి గురించి న్యూట్రీషియనిస్ట్ లు కింది విధంగా వివరించారు. వారు మాట్లాడుతూ…. ఈ స్థితిలో ప్రజలు నిద్రలో ఆహారాన్ని సిద్ధం చేసి తింటారని పేర్కొన్నారు. వారు మేల్కొన్న తర్వాత తిన్న దాని గురించి కొంచెం కూడా వారికి గుర్తుండని తెలిపారు. 

SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) సమయంలో స్పృహ స్థాయి పాక్షిక స్పృహ నుంచి అజ్ఞానం వరకు ఉంటుందని పేర్కొన్నారు. చాలా మంది SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) రోగులకు.. తాము తినే ఆహార పదార్థాలలో అధిక కేలరీల ఆహారాలకు వారు ప్రాధాన్యతనిస్తారు. ఇవి కొన్నిసార్లు తినదగని లేదా విషపూరితమైన వస్తువులను కలిగి ఉంటాయి. కానీ ఈ విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) అనేది కొన్నిసార్లు సైకోట్రోపిక్ మందులు, ప్రత్యేకించి సెడేటివ్-హిప్నోటిక్స్ మరియు ఇతర నిద్ర రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుందని పలువురు వైద్యులు తెలిపారు. 

SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) లక్షణాలు 

SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) లక్షణాలు ఎలా ఉంటాయని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. దీని వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) వల్ల అత్యంత సాధారణంగా మరియు తరచుగా వచ్చే సమస్యలలో మొదటిది అధిక బరువు పెరగడం. ఈ సమస్య వల్ల మనం ఎంత తింటున్నామో ఏమి తింటున్నామో తెలియకుండా తినడం వల్ల కేలరీల సమస్య వచ్చి మనం ఈజీగా బరువు పెరుగుతారు. SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) వల్ల తలెత్తే మరొక ముఖ్యమైన పర్యవసానం మన మీద మనకు నియంత్రణ లేకపోవడం. ఈ కారణంగా మనకు మానసిక క్షోభ అనేది తలెత్తుతుంది. 

వ్యక్తులపై SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) ప్రభావం ఎలా ఉంటుందంటే… 

ఈ SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) వల్ల రోగులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఒక వ్యక్తి SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) తో బాధపడుతుంటే.. వారు మందపాటి, చక్కెర మరియు అధిక కేలరీల ఆహారాలు అంటే వేరుశెనగ వెన్న లేదా చాక్లెట్ స్ప్రెడ్ వంటి వాటిని తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా తినడం వలన ఊబకాయం, బరువు పెరగడం మరియు మధుమేహం మరియు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. 

మరి వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్లాలి… 

SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు అర్థం అవుతోంది. మరి ఇటువంటి డేంజరస్ డిజార్డర్ ను కంట్రోల్ చేసుకునేందుకు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలని అందరూ ఆలోచిస్తారు. ఈ ప్రశ్నకు వైద్యులు సమాధానం ఇస్తూ… మనకు శ్రేయస్సు మరియు ఆరోగ్యానికి మంచి నాణ్యమైన నిద్ర అనేది చాలా అవసరమని తెలిపారు. నిద్ర రుగ్మతలతో బాధపడుతున్న కొందరు వృత్తిపరమైన సహాయం లేకుండా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు. 

ఒక వ్యక్తి యొక్క నిద్ర/ఆహారపు అలవాట్లు వారి జీవన నాణ్యత, ఆనందం లేదా ఏకాగ్రతను ప్రభావితం చేస్తే వైద్యుడి సహాయం కోరడం చాలా అవసరం అని వివరించారు. ఇటువంటి SRED (స్లీప్-రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్) సమస్యలో బాదపడే వారు ఎంత త్వరగా నిపుణుడిని సంప్రదిస్తే, అనారోగ్యానికి సంబంధించిన శారీరక లేదా మానసిక ప్రభావాలు మరింత దిగజారకుండా మనం నిరోధించవచ్చునని పేర్కొన్నారు.