తప్పక నిద్రపోవాల్సిందే..

నిద్ర.. దేవుడిచ్చిన అతి గొప్ప వరాల్లో ఒకటి. కానీ మనలో చాలా మంది నిద్ర ఒక గొప్ప వరమనే విషయాన్ని అస్సలుకే గుర్తించరు. హే.. ఏముందిలే నిద్ర పోవడమే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. అవసరం లేకపోయినా కానీ రాత్రంతా మెలకువగా ఉంటారు. ఇలా రాత్రంతా మెలకువగా ఉండి సరిగా నిద్ర పోకపోవడం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున తప్పకుండా ప్రతిరోజు నిద్ర పోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అలసిపోయిన శరీరాన్ని […]

Share:

నిద్ర.. దేవుడిచ్చిన అతి గొప్ప వరాల్లో ఒకటి. కానీ మనలో చాలా మంది నిద్ర ఒక గొప్ప వరమనే విషయాన్ని అస్సలుకే గుర్తించరు. హే.. ఏముందిలే నిద్ర పోవడమే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు.

అవసరం లేకపోయినా కానీ రాత్రంతా మెలకువగా ఉంటారు. ఇలా రాత్రంతా మెలకువగా ఉండి సరిగా నిద్ర పోకపోవడం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున తప్పకుండా ప్రతిరోజు నిద్ర పోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.

అలసిపోయిన శరీరాన్ని

పని చేసిన తర్వాత మన శరీరంతో పాటు మనసు కూడా అలసిపోతుంది. అటువంటి అలసిపోయిన శరీరానికి తిరిగి బూస్ట్ అందించేందుకు నిద్ర చాలా అవసరం. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా నిద్ర పోవాలి. ఎక్కువ రోజుల పాటు నిద్ర పోకుండా ఉండడం వలన హై బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా, ఉద్యగంలో నైట్​ షిఫ్టుల కారణంగా చాలా మంది అటువంటి జబ్బులనే కొని తెచ్చుకుంటున్నారు. అనవసరంగా ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు తగలేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలను మనం దూరం పెట్టొచ్చు. మన పనుల వల్ల ఖర్చయిన శక్తి.. తిరిగి మన నిద్ర వల్లే పుంజుకునే అవకాశం ఉంది. అలాగే మనం కొత్త విషయాలను నేర్చుకోవడానికి, నేర్చుకున్నది మెదడులో నిక్షిప్తం అవడానికి మనకు గుర్తుండటానికి నిద్ర అనేది అత్యంత కీలకం. ఇక నిద్రతో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

ఆ అభిప్రాయం సరికాదు

పెద్ద వయసులో ఉన్న వారికి కేవలం 4 గంటల నిద్ర సరిపోతుందని కొంత మంది భావిస్తుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదు. మనకు సగటున 6–8 గంటల నిద్ర అవసరం. కొంత మంది పడుకున్నా కానీ నిద్ర పట్టక బాధపడుతుంటారు. అటువంటి వారికి వేరే ఇతర రకాల వ్యాధులు ఉన్నట్లు అర్థం. మనం రాత్రి పూట పడుకునేటపుడు మన లైట్స్ అన్నీ ఆర్పేసి పడుకోవాలి. అలా అయితే నిద్ర సులభంగా పట్టే అవకాశం ఉంటుంది. పలువురు శాస్త్రవేత్తలు నిద్రను రెండు రకాలుగా విభజించారు. అందులో ఒకటి.. కళ్లు వేగంగా కదలని స్థితి, ఇక రెండోది కళ్లు వేగంగా కదిలే స్థితి. ఈ రెండూ కూడా ఒకదాని తర్వాత మరొకటి చక్రంలా కొనసాగుతూ ఉంటాయి. దాదాపు 90 నిమిషాలకో చక్రం ఉంటుంది. మనం రాత్రి పూట నిద్ర పోయినపుడు కనీసం 4–5 చక్రాల వరకు కొనసాగుతాయి. మనకు నిద్ర వచ్చేందుకు గల ఖచ్చితమైన కారణాలేంటన్నదీ ఇప్పటికీ తెలియదు. దీనికి శరీరంలోని జీవగడియారమే కారణమని అనేక మంది చెబుతారు. ఇదే పరిసరాల్లోని వెలుతురు, చీకటిని గుర్తిస్తూ ఉంటుంది. వెలుతురు ఉన్నపుడు మనం మెలకువగా ఉండేలా మన రెటీనా మెదడులోని హైపోథలమస్​కు సంకేతాలు పంపుతుంది. చీకటిపడ్డపుడు నిద్రించేలా ఇదే చేస్తుంది. అంతే కాకుండా పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా మనకు నిద్ర వచ్చేలా సహాయపడుతుంది. బాగా వర్కౌట్లు చేసినా, లేదా బాగా ఆటలాడి అలసిపోయినా కానీ మనకు నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర సరిగ్గా పట్టకపోతే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.