మెదడును దెబ్బతీసే అలవాటు 

ఈ ఉరుకులు పరుగులతో ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం కష్టంగా మారింది. అయినప్పటికీ, మన మెదడుకి ఒత్తిడి తగ్గించడానికి స్ట్రెస్ నుంచి బయటపడడానికి మన దినచర్యలలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చడం ఎంత ముఖ్యమో అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన రోజు వారి పని కారణంగా, ఏక రీతిగా 10 గంటలసేపు కూర్చుండడం వల్ల, మెదడుకి ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు.  మెదడును దెబ్బతీసే అలవాటు కారణంగా కలిగే ముప్పు:  ఎక్కువసేపు […]

Share:

ఈ ఉరుకులు పరుగులతో ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం కష్టంగా మారింది. అయినప్పటికీ, మన మెదడుకి ఒత్తిడి తగ్గించడానికి స్ట్రెస్ నుంచి బయటపడడానికి మన దినచర్యలలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చడం ఎంత ముఖ్యమో అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన రోజు వారి పని కారణంగా, ఏక రీతిగా 10 గంటలసేపు కూర్చుండడం వల్ల, మెదడుకి ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. 

మెదడును దెబ్బతీసే అలవాటు కారణంగా కలిగే ముప్పు: 

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుకు అందవలసిన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల నరాల బలహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిమెన్షియా వంటి మెదడుకు కలిగే ఎన్నో రకాలైన వ్యాధుల కోసం డిప్రెషన్, స్ట్రెస్ ఎలాంటివి నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ఎంత ముఖ్యమో అధ్యయనాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంతేకాకుండా ఏ పని చేయాలన్నా సరే కాన్సెంట్రేట్ చేయలేకపోతము. ఎక్కువగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి మన చుట్టూ చేరుతాయి. స్ట్రెస్ లెవెల్స్ అధికంగా మారుతాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో వెనుకబడిపోతాము. అయితే ఎక్కువ సేపు కూర్చుని ఉండిపోవడం వల్ల శరీరానికి ఫిసికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, మన మెదడు చురుకుగా ఉండదు. మన మెదడు ఆరోగ్యానికి సంబంధించి BDNF అనే ప్రోటీన్ లెవెల్ తగ్గిపోతుంది. ముఖ్యంగా స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండడం వల్ల మెదడుకి ముప్పుతో పాటు, వెన్నుముకకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మెడ నొప్పి అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదు. మన మెదడు చురుకుగా ఆరోగ్యంగా ఉండేందుకు మన దినచర్యలో కొన్ని అలవాట్లు చేర్చుకుందాం..

చదవడం:

మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అలవాటు చదవడం. చదువుకోవడం వల్ల మనం మెదడులో ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఒక దాని మీద దృష్టి సారించడం వల్ల మెదడు అనేక రకాలైన రోగాల బారినపడడంలో ఎప్పుడూ వెనకే ఉంటుంది. 

చురుకుగా ఉండటం:

శారీరక శ్రమ మెదడు కణాలను ఛార్జ్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ వ్యాయామం మెదడులో జరిగే బ్లడ్ లో ఫ్రీగా జరిగేలా పెంచుతుంది, అంతేకాకుండా మన మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దీని కారణంగా మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:

పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, అదేవిధంగా తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యాన్ని అందిస్తుంది. మన మెదడు బలహీనతకు దారితీసే ప్రాసెస్ చేసిన ఆహారాలు అంతే కాకుండా షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ అలాగే ప్రిజర్వేటివ్స్, తినేందుకు, తాగేందుకు తగ్గించుకోవడం మంచిది.

శరీర బరువు:

సమతుల్య ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఊబకాయం మెదడుకు కలిగించే ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలకు దారితీవచ్చు.

స్మోకింగ్ వద్దు:

మొత్తం ఆరోగ్యంపై, ముఖ్యంగా మెదడుపై ధూమపానం అనేది చాలా వరకు హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది అనడంలో తప్పేమీ లేదు. ధూమపానం చేయడం కారణంగా మనిషిలో స్ట్రోక్ అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

బ్లడ్ ప్రెషర్:

అధిక రక్తపోటు మెదడులోని సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీస్తుంది, ఇది మెదడు యొక్క ఆరోగ్య బలహీనతకు దారితీస్తుంది. ఇది అనేక ఇతర అనారోగ్యాలకి అదే విధంగా స్ట్రోక్‌కు కూడా కారణమవుతుంది.

బ్లడ్ షుగర్ తగ్గించుకోండి:

మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ని తరచుగా చెక్ చేసుకోండి. రక్తంలో ఎక్కువ కాలం ఉండే షుగర్ అనేది కాలక్రమేణా మెదడును దెబ్బతీస్తుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, మానసిక స్థితి మార్పులు, బరువు పెరుగుట, హార్మోన్ల మార్పులు అంతేకాకుండా కాలక్రమేణా, అల్జీమర్స్ వ్యాధి వంటి ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.